ETV Bharat / health

అలర్ట్‌ : రోజూ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ తీసుకుంటున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? - Apple Cider Vinegar Effects

Apple Cider Vinegar Side Effects : ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ కలుపుకుని తీసుకోవడం వల్ల వెయిట్‌ లాస్‌ అవుతామని కొంతమంది తాగుతుంటారు. అయితే, ఇలా తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతోపాటు, సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయని మీకు తెలుసా ? అవేంటో ఇప్పుడు చూద్దాం.

Apple Cider Vinegar
Apple Cider Vinegar Side Effects (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 9:54 AM IST

Side Effects Of Apple Cider Vinegar : ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంటిని శుభ్రం చేయడం దగ్గరి నుంచి.. వంటలకు మంచి రుచి రావడం కోసం వరకు.. ఎన్నో అవసరాలకు యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వాడుతున్నారు. అలాగే.. మరికొందరు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో యాపిల్‌ సైడర్‌ వెనిగర్ కలిపి తాగడం వల్ల బరువు తగ్గుతామని తీసుకుంటున్నారు. అయితే.. యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ అధికంగా వాడటం వల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో మీకు తెలుసా?

పొటాషియం స్థాయులు తగ్గుతాయి :
దీర్ఘకాలం యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయులు తగ్గుతాయి. దీనివల్ల గుండె లయ తప్పడం, అలసట, మూత్రపిండాల సమస్యలు, అధిక రక్తపోటు వంటి హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అలాగే ఎముకలు బలహీనంగా మారి బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

కడుపునొప్పి :
యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్‌ స్థాయులను పెంచుతుంది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో గుండెల్లో మంటగా ఉండటం, వికారం, వాంతులు, అజీర్ణం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొంతమందిలో, యాపిల్ సైడర్ వెనిగర్ అతిసారానికి కారణమవుతుంది. ఇంకా కడుపునొప్పి సమస్య కూడా వేధిస్తుందని అంటున్నారు.

దంతాలు పాడవుతాయి :
యాపిల్ సైడర్ వెనిగర్‌లోని ఆమ్లాలు ఎనామిల్‌ని దెబ్బతీస్తాయి. అలాగే నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను పెరిగేలా చేస్తాయి. ఇది క్రమంగా దంత క్షయానికి దారితీస్తుంది. దీనివల్ల దంతాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. 2001లో 'జర్నల్ ఆఫ్ డెంటిస్ట్రీ' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వాటర్‌ తీసుకోవడం వల్ల కొందరిలో దంతాలపై ఎనామిల్‌ దెబ్బతిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బ్రెజిల్‌లోని పోర్టో అలెగ్రేలోని ఫెడరల్ యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్ M.A. మగల్హేస్-నెటో' పాల్గొన్నారు.

చర్మ సమస్యలు :
యాపిల్ సైడర్ వెనిగర్ చర్మ సహజ పీహెచ్‌ స్థాయులను మార్చగలదు. అలాగే ఇది స్కిన్ నుంచి సహజ నూనెలను తొలగిస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారుతుంది. ఇంకా కొందరిలో దద్దర్లు, అలర్జీ వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ సైడర్ వెనిగర్ చర్మాన్ని మరింత సున్నితంగా చేస్తుంది. దీనివల్ల చర్మం సెన్సిటివ్‌గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, సున్నితమైన చర్మం ఉన్నవారు నిపుణులను సంప్రదించి ఉపయోగించాలి.

చివరిగా యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వల్ల కొన్ని ప్రయోజనాలున్నప్పటికీ.. దీనివల్ల కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతాయి. కాబట్టి, మీరు దీనిని ఏ విధంగానైనా తీసుకునే ముందు మీ వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

యాపిల్ వెనిగర్​తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్- అలా అని ఎక్కువ వాడితే అంతే సంగతి!

రెడ్ యాపిల్ Vs గ్రీన్ యాపిల్ - డయాబెటిస్ పేషెంట్స్​కు ఈ రెండింటిలో ఏది మంచిది!

మీరు యాపిల్‌ పండ్లని పొట్టు తీసి తింటున్నారా? - అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.