ETV Bharat / health

సూపర్ సీక్రెట్ : రైస్ వాటర్​ వృథాగా పారబోస్తున్నారా? - ఇలా చేస్తే మీ ముఖం తళతళా మెరిసిపోతుంది! - Rice Water For Skin care

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 4:05 PM IST

Rice Water Health Benefits : ఈరోజుల్లో చర్మం సౌందర్యం కోసం ఏవేవో క్రీములు, లోషన్లు వాడుతుంటారు. అందుకోసం వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ.. రూపాయి ఖర్చు లేకుండా వంటింట్లో వృథాగా పారబోసే రైస్ వాటర్​తో ఇలా చేస్తే.. మీ ముఖ సౌందర్యాన్ని మెరిపించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Rice Water For Healthy Skin
Rice Water Health Benefits (ETV Bharat)

Rice Water For Healthy Skin : బియ్యం కడిగిన నీళ్లను అందరూ వృథాగా పారబోస్తుంటారు. కానీ.. ఆ వాటర్ వల్ల పొందే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఇకపై అలా చేయరు! ముఖ్యంగా సౌందర్య ప్రియులు రైస్ వాటర్​ను సరిగ్గా వాడితే.. ఎలాంటి క్రీమ్స్, లోషన్స్ అవసరమే ఉండదంటున్నారు నిపుణులు. బియ్యం కడిగిన నీళ్లలో ఉండే పోషకాలు అందాన్ని రెట్టింపు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు. ఇంతకీ, చర్మానికి రైస్ వాటర్(Rice Water) అప్లై చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చర్మ సమస్యలు దూరం : బియ్యం కడిగిన నీళ్లలో అధికశాతంలో విటమిన్లు, మినరల్స్​, అమైనో యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి.. చర్మాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో ఈ నీటిని వాడటం ద్వారా మన చర్మం మృదువుగా మారుతుంది. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రెబెక్కా మార్కస్.

ఫేషియల్​ టోనర్​ : రైస్​ వాటర్​ను మంచి ఫేషియల్​ టోనర్​గా వాడుకోవచ్చని చెబుతున్నారు. ఒక కాటన్​ ప్యాడ్​పై ఈ నీటిని పోసి.. దానితో ముఖంపై స్మూత్​గా అప్లై చేయాలి. అలా కొన్ని నిముషాలు ఉంచాక చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో కనీసం రెండుసార్లు చేస్తే చర్మం మృదువుగా మారి.. స్కిన్​పై ఉన్న ముడతలు తగ్గుతాయంటున్నారు.

మొటిమలు, మచ్చలు తగ్గుతాయి : గంజి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు. అలాగే రైస్ వాటర్​లోని పోషకాలు కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు.

జనరేషన్​ గ్యాప్ గురూ - ఆరోగ్యానికి గంజి అమృతమని మీకు తెలుసా! - ఆ సమస్యలన్నీ దూరం!

సన్‌బర్న్స్ నుంచి రిలీఫ్ : బయట ఎండకు తిరిగినప్పుడు సున్నితమైన ప్రదేశాల్లో స్కిన్ కందిపోతుంటుంది. అలాంటి సమయాల్లో బియ్యం కడిగిన వాటర్​ని ఉపయోగించడం ద్వారా చాలా చక్కటి ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఇందుకోసం ఒక కాటన్ ప్యాడ్‌పై ఈ నీటిని కొద్దిగా వేసి కందిపోయిన ప్రదేశాల్లో స్మూత్​గా అప్లై చేయాలి. దీనివల్ల మంట తగ్గుతుంది. చర్మం మృదువుగా తయారవుతుందని చెబుతున్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ రెబెక్కా మార్కస్.

ఆరోగ్యవంతమైన జుట్టు సొంతం! : రైస్ వాటర్​తో కేవలం చర్మ సౌందర్య ప్రయోజనాలు మాత్రమే కాదు.. కేశ సంరక్షణ లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. జుట్టును బియ్యం కడిగిన నీళ్లతో కడగడం వల్ల హెయిర్​కు కావాల్సిన పోషకాలు అంది వెంట్రుకలు బలంగా పెరుగుతాయని చెబుతున్నారు.

అంతేకాకుండా.. రైస్ వాటర్ వల్ల జుట్టు(Hair) ఆకర్షణీయంగా మెరుస్తుందని సూచిస్తున్నారు. ఇందుకోసం షాంపూతో తలస్నానం చేసిన తర్వాత రైస్ వాటర్‌ని తలపై పోసి.. ఆ నీరు కుదుళ్లకు చేరేలా మసాజ్ చేసుకోవాలి. అలా కొన్ని నిమిషాలు చేసిన తర్వాత శుభ్రమైన నీటితో జుట్టును వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేయడం ద్వారా ఫలితం తప్పక కనిపిస్తుందంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

అలర్ట్ : తాజా చర్మం కోసమంటూ - పదే పదే ముఖం కడుక్కుంటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?

30 ఏళ్లకే నుదుటిపై గీతలు.. ముఖం మీద ముడతలా? - ఇలా చేస్తే 60 ఏళ్ల దాకా చర్మం ఫిట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.