Reasons for Tired in Early Morning: ఉదయాన్నే తాజాగా నిద్ర లేవాలి. అప్పుడే.. మనసుతోపాటు శరీరం కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. కొన్నిసార్లు రాత్రి నిద్ర సరిపోకపోవడం వల్ల ఈ సమస్య రావొచ్చు. మళ్లీ తగినంత నిద్రపోతే ఈ సమస్య సెట్ అయిపోతుంది. కానీ.. 7 నుంచి 8 గంటలు పడుకున్నా కూడా.. ఉదయం అలసట, చిరాకు వంటి ఫీలింగ్స్ ఫేస్ చేస్తున్నారంటే.. కచ్చితంగా కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు నిపుణులు!
ఆందోళన: ఈ పరిస్థితికి మొదటి కారణం ఆందోళన. ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలన్నీ మానసిక అలసటకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు.
పరిష్కారం: ఈ సమస్యను నుంచి బయటపడడానికి ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లడం, బిగ్గరగా నవ్వడం, డ్యాన్స్ చేయడం, మీ మనసుకు నచ్చిన వారితో సమయం గడపడం వంటివి చేయాలి. "అరిజోనా స్టేట్ యూనివర్శిటీ" నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువ సామాజిక కార్యకలాపాలలో నిమగ్నమైన విశ్వవిద్యాలయ విద్యార్థులు మరుసటి రోజు తక్కువ కార్టిసోల్ స్థాయిలను ప్రదర్శించారని, మెరుగైన నిద్రపోయారని పేర్కొన్నారు.
విటమిన్ డెఫీషియన్సీ: శరీరంలో విటమిన్లు సరిపడా లేకపోయినా కూడా నిద్ర లేచిన తర్వాత అలసటకు గురవుతారని నిపుణులు అంటున్నారు. శరీరంలో జరిగే అనేక రసాయన ప్రక్రియలకు విటమిన్లు సహాయపడతాయి. కణాల పెరుగుదల, నిర్వహణ, జీవక్రియ, ఇమ్యూన్ సిస్టమ్ పనితీరుకు సపోర్ట్ చేస్తాయి. ఇలాంటి విటమిన్లు తగ్గితే కూడా నిద్ర సమస్యలు వస్తాయి.
పరిష్కారం: మాంసాహారులకు, విటమిన్ B12 (ఇది చికెన్, గుడ్లు, చేపలలో లభిస్తుంది) పొందడం కష్టం కాదు. ఇక శాకాహారులైతే విటమిన్ బి12 సప్లిమెంట్లతో పాటు పాలు, చీజ్, పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు అందుతాయి.
రక్త ప్రసరణ మెరుగుపడాలా? ఈ ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకోండి!
స్లీప్ అప్నియా: ఇది కూడా ప్రధాన కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కొందరు వ్యక్తులు తగినంత నిద్రపోతున్నారని అనుకుంటారు. కానీ స్లీప్ అప్నియా వారికి నిద్ర సరిగా పట్టనివ్వదు. ఇది రాత్రంతా శ్వాసకు అంతరాయం కలిగిస్తుంది. ఈ విషయం వారికి తెలియదు. 2019లో Sleep Medicine జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. స్లీప్ అప్నియా బాధితులు.. మిగిలిన వారికంటే రెండున్నర రెట్లు ఎక్కువగా అలసటను అనుభవించే అవకాశం ఉందట.
పరిష్కారం: ముందుగా అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. ధూమపానం మానేయాలి. వైద్యులను కలిస్తే.. వారు పరిశీలించి తగిన చికిత్స ఇస్తారు.
తలనొప్పి తగ్గడం లేదా? ఈ టీ లు ట్రై చేస్తే చిటికెలో మాయం!
హైపోథైరాయిడిజమ్: హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల సంభవించే ఒక సమస్య. హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు.. థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైనంత హార్మోన్లను ఉత్పత్తి చేయదు. దీంతో.. అలసట, మలబద్ధకం, పొడి చర్మం, ఉబ్బిన ముఖం, ముతక జుట్టు, చర్మం వంటి పలు సమస్యలను ఫేస్ చేస్తారు.
పరిష్కారం: మీకు పై లక్షణాలలో ఏవైనా ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సందర్శించి అందుకు సంబంధించిన టెస్టులు చేయించుకోవాలి. మీ థైరాయిడ్ హార్మోన్లను అదుపులో ఉంచుకోవడానికి సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి కీలకం.
దగ్గుతున్నప్పుడు ఛాతి, భుజాల దగ్గర నొప్పిగా ఉందా? ఇది క్యాన్సర్ సంకేతం కావచ్చు!