ETV Bharat / health

'తల్లులు సరిగ్గా నిద్రపోతేనే పిల్లలు హుషారుగా పుడతారు'- మరి ఎంత సేపు నిద్రపోవాలి?

సాధారణంగానే చాలా మంది గర్భిణులు రాత్రి పూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఇలా నిద్రలేమి సమస్యతో బాధపడే గర్భిణులకు పుట్టే పిల్లలు అనారోగ్యం పాలవుతారని పరిశోధకలు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

author img

By ETV Bharat Health Team

Published : 4 hours ago

Pregnant Woman Sleep Hours
Pregnant Woman Sleep Hours (ETV Bharat)

Pregnant Woman Sleep Hours: పుట్టబోయే బిడ్డ అందంగా, హుషారుగా, చురుకుగా ఉండాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం ప్రత్యేకమైన ఆహారంతో పాటు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే, ఈ జాగ్రత్తలతో పాటు రాత్రి పూట సరిగ్గా నిద్రపోవడం కూడా ముఖ్యమేనని అంటున్నారు పరిశోధకులు. గర్భం ధరించినప్పటి నుంచి కంటి నిండా నిద్రపోయేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రిపూట కనీసం 7 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయే గర్భిణులకు పుట్టే పిల్లల్లో ఎదుగుదల సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు చైనా పరిశోధనలో వెల్లడైంది. "Improving sleep habits during pregnancy may prevent or reduce the risk of neurodevelopmental issues in children" అనే అంశంపై చేసిన పరిశోధన Endocrine Society’s Journal of Clinical Endocrinology & Metabolism లో ప్రచురితమైంది. దీని ప్రకారం.. పిల్లల్లో మాట్లాడటం, కదలికలు, ఇతరులతో కలవటం, విషయ గ్రహణ నైపుణ్యాలు అలవాటు పడడం ఆలస్యం అవుతున్నట్టు తేలింది. అందుకోసమే గర్భిణులు కంటి నిండా నిద్ర పోవటం చాలా ముఖ్యమని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ పెంగ్‌ ఝూ వివరించారు.

ఇవే కాకుండా పిల్లల్లో ఎదుగుదలతో ముడిపడిన సమస్యల ముప్పూ పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో బహిర్గతమైంది. తగినంత సమయం నిద్రపోని గర్భిణులకు పుట్టిన పిల్లల్లో మెదడు, అవయవాల మధ్య సంకేతాలను చేరవేసే వ్యవస్థలు సరిగా అభివృద్ధి చెందటం లేదని బయట పడింది. ఫలితంగా విషయగ్రహణ సామర్థ్యాలు, ప్రవర్తన, నేర్చుకునే నైపుణ్యాలు కొరవడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇవన్నీ మగ పిల్లల్లో మరింత ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. దీంతోపాటు తల్లి పర్యావరణ అంశాలకు పిల్లలు స్పందించటంలో లింగ భేదం కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ అధ్యయనం వివరించింది.

అయితే, గర్భిణిల్లో నిద్రలేమి సమస్యకు హార్మోన్ల మార్పులు, తరచూ మూత్ర విసర్జనకు లేవటం, వికారం వంటివి కారణం అవుతుంటాయని అంటున్నారు. ప్రతి ఐదుగురు గర్భిణుల్లో సుమారు ఇద్దరు తక్కువ సమయం నిద్రపోతున్నట్టు.. ఫలితంగా ఇన్సులిన్‌ నిరోధకత, గర్భిణి మధుమేహం వచ్చే అవకాశం ఉన్నట్టు గత అధ్యయనాల్లోనూ వెల్లడైంది. ఇవే కాకుండా గర్భిణి మధుమేహంతో నెలలు నిండక ముందే ప్రసూతి, గుర్రపువాతం, అత్యవసర సిజేరియన్, బిడ్డ రక్తంలో గ్లూకోజు స్థాయిలు తగ్గటం వంటి దుష్ప్రభావాలు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నడుం నొప్పి తరచూ ఇబ్బంది పెడుతోందా? - దీనికి కారణం ఇవీ కావొచ్చట!

ముఖంపై ముడతలకు 'బేబీ బొటాక్స్‌' ట్రీట్మెంట్! - దీని గురించి మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.