Pet Care Tips For Beginners : ప్రస్తుత కాలంలో ఇంట్లో కుక్కలను పెంచుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. సెలబ్రిటీల నుంచి మొదలుపెడితే కామన్ మ్యాన్ వరకూ అందరూ వివిధ రకాల కుక్కలను పెంచుకుంటున్నారు. కొంత మంది కుక్కలను పెంచుకోవడం ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తే, మరికొందరు రక్షణ కోసం వాటిని పెంచుకుంటారు. అయితే.. తొలిసారిగా పెట్‌ను ఇంటికి తెచ్చుకున్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
పెట్స్ కేర్ టిప్స్ :
- ఇంట్లో పెంచుకునే కుక్కలలో చాలా రకాల జాతులుంటాయి. కొన్ని చిన్నగా ఉండి క్యూట్‌గా ఉంటే, మరికొన్ని కాస్త చూడటానికి గంభీరంగా ఉంటాయి. అయితే.. ఇంట్లో పెంచుకునేవారు చిన్న జాతి కుక్కలను పెంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
- ఒకవేళ మీరు చురుకుగా ఉండే కుక్కలను పెంచుకోవాలనుకుంటే.. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కలను కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
- ఇవి చాలా విశ్వాసంగా ఉంటాయి. కానీ.. వీటికి రోజూ సుమారు గంట సేపు వ్యాయామం చేయించడం తప్పనిసరి.
- కాబట్టి.. మీకు ఇంట్లో ఉన్న సమయాన్ని బట్టి ఏ జాతికి చెందిన కుక్క కొనుగోలు చేయడం మంచిదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.
ఈ శునకం ధర రూ.10 కోట్లు.. కిలోమీటరుకు మించి నడవదు.. రోజంతా ఏసీలోనే..
- మీరు కుక్కను ఇంట్లోకి తీసుకువచ్చే ముందు ఇంట్లో విషపూరిత మొక్కలు ఉంటే వాటిని తొలగించాలి.
- కుక్కలు నమిలి మింగగలిగే చిన్న చిన్న వస్తువులు ఏవైనా ఉంటే తీసేయండి.
- ఇంట్లో, ఆవరణలో.. కరెంట్ వైర్లు కుక్కలకు తగిలేలా ఉంటే జాగ్రత్త చేయాలి.
- అలాగే డైలీ కుక్కలకు షాంపూ, బ్రష్‌తో స్నానం చేయించాలి. దీనివల్ల కుక్కలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
- మీరు కొత్తగా కుక్కను కొనుగోలు చేసి తీసుకువచ్చినప్పుడు అవి కొంత కఠినంగా ఉండవచ్చు. అప్పుడు విసిగిపోకుండా ఓపికగా శిక్షణ ఇవ్వాలి. ఇలా రోజూ చేయడం వల్ల కుక్కల ప్రవర్తనలో మార్పు వస్తుంది.
- పెట్స్ ఆరోగ్యంగా ఉండటానికి నెలకు ఒకసారి పశు వైద్యుడికి చూపించడం అవసరం. వారు టీకాలు, మందులు అందిస్తారు.
- కుక్కలకు వాటి వయసు, పరిమాణం, జాతి ఆధారంగా పోషకాహారం అందించాల్సి ఉంటుంది.
- కాబట్టి, మీ కుక్కకు ఏ రకమైనటువంటి ఆహారం అందించాలో వైద్యుడిని అడిగి తెలుసుకోండి.
- నిజానికి కుక్కలను పెంచుకోవడం వల్ల మన మనసు ఎప్పుడైనా బాగోలేకపోయినా, బోర్ కొట్టినా వాటితో కాసేపు ఆడితే మంచి రిలాక్సేషన్ లభిస్తుంది.
- కాబట్టి, వాటితో సరదాగా రోజూ బయటకు వాకింగ్‌కు వెళ్లండి. అలాగే పిల్లలు గ్రౌండ్‌లో ఆటలు ఆడితే అక్కడకు కూడా మీ కుక్కను తీసుకెళ్లండి.
- ఎప్పుడైనా అనుకోని సందర్భాల్లో కుక్కలకు ఏవైనా గాయాలు కావచ్చు. కాబట్టి, యాంటీసెప్టిక్ క్రీమ్‌లు, బ్యాండేజ్‌లు వంటి ఇతర వస్తువులు ఉండే.. ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను మీ ఇంట్లో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
- ఇవన్నీ పాటిస్తే కుక్కల పెంపకంలో ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు.
వైరల్ వీడియో - లెక్కలు చేస్తున్న కుక్క - పిల్లలకు ట్యూషన్ చెప్పేస్తదేమో!
Best Dog Collar GPS Trackers in Telugu : మీ ఇంట్లో కుక్కను పెంచుతున్నారా..? ఇది మీకోసమే..!