ETV Bharat / health

పార్కిన్​సన్ - జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు!

Parkinson Disease Causes and Symptoms : శరీరంలో వణుకు వస్తుంది.. నిల్చోవడం, నడవడం కూడా కష్టంగా ఉంటుంది.. మతి మరుపు పెరిగిపోతుంది.. ఇవన్నీ పార్కిన్​సన్​ వ్యాధి లక్షణాలు. మరి.. ఇది ఎలా వస్తుంది? దీని తీవ్రత ఏంటి? నివారణ ఉందా? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Parkinson Disease Causes and Symptoms
Parkinson Disease Causes and Symptoms
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 5:25 PM IST

Parkinson Disease Causes and Symptoms: తల, చేతులు, కాళ్లు ఒకటే వణుకుతాయి.. నడక నెమ్మదిస్తుంది.. మాట నిదానమవుతుంది.. కండరాలు బిగుసుకుపోతాయి.. ఇవి చాలవన్నట్టుగా క్రమంగా మతిమరుపు, నిద్ర సమస్యలు, కుంగుబాటు కమ్ముకొస్తాయి. మొత్తంగా జీవితమే మొద్దుబారిపోతుంది! ఈ ప్రమాదకర లక్షణాలన్నీ కలిపితే.. పార్కిన్‌సన్‌ వ్యాధి. అసలు ఈ వ్యాధి ఎందుకొస్తుంది? లక్షణాలు ఏంటి..? చికిత్స విధానమేంటి? అనే వివరాలను ఈ స్టోరీలో చూద్దాం..

What is Parkinson: పార్కిన్‌సన్‌ అనేది న్యూరోడెజెనరేటివ్ వ్యాధి. 1817లో మొదటిసారిగా డాక్టర్ జేమ్స్ పార్కిన్‌సన్‌ ఈ వ్యాధి గురించి వివరించారు. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. ఇది కేంద్ర నాడీ వ్యవస్థ, శరీర కదలికలను నియంత్రించే మెదడు సామర్థ్యాన్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. బాడీ పార్ట్స్​ను నియంత్రించే మెదడులోని ఒక భాగంలో ఉన్న డోపమైన్-ఉత్పత్తి చేసే న్యూరాన్‌లపై ఈ వ్యాధి దాడి చేస్తుంది. ఇది వచ్చిన వారిలో చేతులు, తల వణుకుతాయి. బాడీలో దృఢత్వం (Stiffness) లోపిస్తుంది.. చక్కగా నడవలేరు.

చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే - మీకు షుగర్ వ్యాధి రాబోతున్నట్టే!

పార్కిన్​సన్​ కారకాలు:

  • వయసు: దాదాపు 60 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఈ వ్యాధి కనిపిస్తుంది.
  • జన్యుశాస్త్రం: కుటుంబంలో ఎవరైనా దీని బారిన పడితే.. ఫ్యామిలీలో మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది.
  • జెండర్​: ఇది పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది.
  • గాయాలు: తలకు దెబ్బలు తగలడం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

పార్కిన్​సన్​ లక్షణాలు: ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభదశలో కనిపించవు. 80% న్యూరాన్‌లు దెబ్బతిన్న తర్వాతనే వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ఇందులో కూడా రెండు రకాల లక్షణాలు ఉన్నాయి. 1. మూవ్​మెంట్​ 2. నాన్​ మూవ్​మెంట్​.

స్వీట్స్ వదిలించుకోలేకపోతున్నారా? - అయితే ఇలా ట్రై చేయండి!

మూవ్​మెంట్​ లక్షణాలు..

  • వణుకు: శరీరంలో వణుకు ఉంటుంది. పడుకున్నా.. లేచినా.. కూర్చున్నా, నిల్చున్నా వణుకు ఉంటుంది.
  • అస్థిరత్వం: బాధితులు నిల్చున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు చక్కగా ఉండలేరు. పార్కిన్సన్స్ వ్యాధి కేంద్ర నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది కాబట్టి.. కండరాల్లో స్టెబిలిటీ ఉండదు. సాధారణ పనులు కూడా చేసుకోలేరు.
  • గొంతు మారిపోతుంది.​ దృష్టి కూడా తగ్గిపోతుంది.

నాన్​ మూవ్​మెంట్​ : ఈ​ లక్షణాల్లో ఆందోళన, వాసన కోల్పోవడం, భ్రాంతి, నిద్రలేమి, న్యుమోనియా వంటివి లక్షణాలు కనిపిస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి వివిధ రకాల మందులు ఉన్నాయి. డాక్టర్ల సూచన మేరకు వాటిని తీసుకుంటూ.. వ్యాయామం చేస్తూ సరైన ఆహారం తీసుకోవాలి.

ఈ వ్యాధి వస్తే ఎముకలు వట్టిగానే విరిగిపోతాయి - జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే!

దగ్గు తీవ్రంగా వేధిస్తోందా? - అయితే అది 100 రోజుల దగ్గు కావొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.