Overboiling Milk Tea Side Effects : గ్రీన్, లెమన్, అల్లం టీ అంటూ ఛాయ్‌లో చాలా రకాలు ఉన్నాయి. కానీ ఎక్కవ మంది పాలతో తయారు చేసుకునే టీనే ఇష్టపడుతుంటారు. పైగా బాగా మరిగించుకుని తాగితే కానీ మజా రాదని ఫీలయేవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే పాలతో టీ తయారు చేసుకోవడంలో ఒక్కొక్కరికీ ఒక్కో పద్ధతి ఉంటుంది. కొందరు ముందుగా నీటిలోనే టీ పౌడర్, చక్కెర అన్నీ వేసి మరిగించి తర్వాత పాలు పోస్తారు. ఇంకొందరు ముందుగానే పాలు మరిగించి టీ తయారు చేస్తారు. ఇలా పద్దతి ఏదైనప్పటికీ పాలతో చేసిన టీని ఎక్కువ సేపు మరిగించడం, మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
పదే పదే మరిగిస్తే ఏమవుతుంది?
వాస్తవానికి ఛాయ్ తాగడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు, రక్తంలో చక్కెర వంటివి నియంత్రణలో ఉంటాయి. కానీ నిపుణులు అభిప్రాయం ప్రకారం, టీని ఎక్కవ సేపు మరిగించకూడదు. ఎందుకంటే టీ టానిన్లతో నిండి ఉంటుంది. పండ్లు, కూరగాయలు, నట్స్, వైన్స్ వంటి వాటిలో లభించినట్టే పాలీఫెనోలిక్ బయోమాలికుల్స్ దీంట్లోనూ ఉంటాయి.
ఇవి శరీరంలోని ప్రోటీన్లు, మినరల్స్, సెల్యూలోస్, పిండి పదార్థాలు వంటి వాటిని కుళ్లిపోకుండా శరీరానికి ఉపయోగపడేలా చేస్తాయి. టీని ఎక్కువ సేపు మరిగించారంటే వీటిని మీరు కోల్పోతారు. 4-5 నిమిషాలకు మించి పాలతో తయారు చేసే టీని వేడి చేస్త శరీరంలో ఐరన్ శోషణకు ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కువ సేపు మరింగించడం వల్ల ఛాయ్లోని పోషకాలు తగ్గుతాయి. క్యాన్సర్‌కు కారణమయే కణాల ఉత్పత్తి పెరుగుతుంది.
ఛాయ్ ఎక్కువ సేపు మరిగించడం వల్ల కలిగే నష్టాలు :
పోషకాల నష్టం
టీని ఎక్కువ సార్లు వేడి చేయడం, ఎక్కువ సేపు మరిగించడం వల్ల పాలలో ఉండే కాల్షియం, విటమిన్ బీ12, విటమిన్ సీ వంటి పోషకాలు క్షీణిస్తాయి.
రుచిలో మార్పు
ఛాయ్‌ను ఎక్కువ సార్లు వేడి చేయడం వల్ల రంగుతో పాటు రుచి కూడా మారుతుంది. కాలిన వాసన వస్తుంది.
ఎసిడిటీ
ఎక్కువ సేపు మరిగించడం వల్ల పాలలోని పీహెచ్ స్థాయిలు మారుతాయి. ఇది హానికరమైన ఆమ్లంగా మారి, ఎసిడిటీని పెంచుతుంది.
క్యాన్సర్ కారకాలు
బాగా మరగబెట్టడం వల్ల పాలలో యాక్రిలామైడ్ వంటి మిశ్రమాలు ఉత్పత్తి అవుతాయి. ఇది ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధికి దారితీస్తుంది. పాలతో మీరు టీని తయారుచేసుకోవాలంటే 4- 5 నిమిషాలు మించకుండా తయారు చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుందని నిపుణలు చెబుతున్నారు.అంతకుమించి టీని మరిగించినా, మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగిన శరీరానికి హాని కలుగుతుందని అంటున్నారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఐదు పనులు చేస్తే అంతా సెట్! - Memory Power Increase Tips