ETV Bharat / health

అలర్ట్ : నైట్​​షిఫ్ట్ చేస్తున్నారా? - ఈ ఆహారపు అలవాట్లు పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటారు! - Night Shift Healthy Diet

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 3:55 PM IST

Night Shift Healthy Diet : ఈ రోజుల్లో నైట్ షిఫ్ట్​లు కామన్. అయితే.. దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే.. డైట్​ విషయంలో పక్కాగా ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే.. ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరి.. ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

Healthy Diet Plan For Night Shift Employees
Night Shift Healthy Diet (ETV Bharat)

Healthy Diet Plan For Night Shift Employees : నేటి టెక్నాలజీ యుగంలో అన్ని రంగాల ఉద్యోగాల్లో నైట్ షిఫ్ట్​లు అనేవి కామన్ అయిపోయాయి. అయితే.. రాత్రివేళల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. పగటి సమయంలో ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల వారి దినచర్యే మారిపోతోంది. ఇలాంటివారు అనివార్యంగానో, అలవాటుగానో రాత్రి వేళల్లో ఆహార పదార్థాలు, చిరుతిళ్లు తింటుంటారు. కాలక్రమంలో వీరు ఊబకాయం, మధుమేహం, బీపీ, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అలాకాకుండా ఉండాలంటే నైట్​ షిఫ్ట్ ఉద్యోగాలు చేసేవారు తమ ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇంతకీ, నైట్​ షిఫ్ట్(Night Shift) ఉద్యోగాలు చేసేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? తమ లైఫ్ స్టైల్​లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నైట్ షిఫ్ట్​కు వెళ్లే చాలా మంది ఉద్యోగులు చేసే పొరపాటు ఏంటంటే.. టైమ్ లేదనో ఇంకేదైనా కారణం చేతనో ఇంటి వద్ద తినకుండా వెళ్లి పనిప్రదేశంలో రాత్రివేళ తింటుంటారు. అది సరికాదని చెబుతున్నారు. నైట్ షిఫ్ట్ ఉన్నవారు ఉద్యోగానికి వెళ్లడానికే ముందే ఫ్యామిలీతో కలిసి కాస్త ముందుగానే భోజనం చేసేలా ప్లాన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. అందులోనూ తక్కువ మోతాదులో సంతృప్త కొవ్వులు ఉండే చికెన్‌, చేపలు వంటి వాటితోపాటు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు కలిగిన బ్రౌన్‌రైస్‌ లేదా మిల్లెట్లను కలిపి తీసుకునేలా చూసుకోవాలని చెబుతున్నారు.

అదేవిధంగా ఎక్కువ మొత్తంలో పండ్లు, తాజా కూరగాయల్ని తమ డైట్​లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా శరీరానికి కావాల్సిన పోషకాలు అంది ఎక్కువ ఉత్సాహంగా ఉంటారంటున్నారు. ముఖ్యంగా రోజులో మొత్తం ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నామన్నది సరి చూసుకుంటూ కొద్ది కొద్ది మొత్తాల్లో ఎక్కువ టైమ్స్ తినడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు.

నైట్​ షిఫ్ట్ చేసే కొంతమంది ఉద్యోగులు బ్రేక్​ఫాస్ట్​ను స్కిప్ చేస్తుంటారు. కానీ, అలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అంతేకాదు.. మార్నింగ్ తీసుకునే బ్రేక్​ఫాస్ట్​లో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు డాక్టర్ జానకీ శ్రీనాథ్. అందుకోసం.. మిల్లెట్ ఇడ్లీ, దోశ, పెసరట్టు, పల్లీ చట్నీ, సాంబార్ వంటివి తీసుకోవచ్చంటున్నారు. అదే.. నాన్​వెజ్ తినేవారు అయితే ఉడకబెట్టిన గుడ్డు, చికెన్ సూప్ లాంటివి తీసుకోవచ్చని చెబుతున్నారు. బొబ్బర్లు, పెసలు, శనగలు వంటి వాటితో సలాడ్స్ చేసుకుని తినొచ్చంటున్నారు. అయితే, ఏవైనా పడుకోవడానికి గంట ముందు తినాలనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.

2019లో' అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్​'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. నైట్ షిఫ్ట్ చేసే వ్యక్తులు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని, అది వారిలో టైప్ 2 డయాబెటిస్‌ను అభివృద్ధి చేసే ప్రమాదం 28% ఎక్కువగా ఉందని కనుగొన్నారు.

నైట్​షిఫ్ట్​ చేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు మస్ట్ - లేకుంటే అంతే!

ఇక చాలా మంది నైట్ షిఫ్ట్ ఉద్యోగులు.. రాత్రివేళ మెలకువతో ఉండటానికి ఛాయ్, కాఫీ వంటివి తీసుకుంటూ ఉంటారు. నిజానికి నిద్రపోకుండా ఉండటానికి ఆ పానీయాల్లో ఉండే కెఫెన్ సహకరిస్తుంది. కానీ, అది మీరు నైట్ షిఫ్ట్ అయిపోయాక మీ నిద్రకూ భంగం కలిగిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కాఫీ లేదంటే ఇంకేదైనా కెఫెన్ ఉండే డ్రింక్ తాగినప్పుడు అది శరీరాన్ని వదలడానికి 6 గంటల సమయం పడుతుందంటున్నారు. కాబట్టి నైట్ టైమ్ కాఫీ, టీ తాగే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

అదేవిధంగా.. నైట్ డ్యూటీ నుంచి వచ్చాక పగలు సరైన నిద్ర పోవాలంటే పడుకునే అరగంట ముందు టీవీ, ఫోన్లకు దూరంగా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు. అలాగే ప్రశాంతంగా చీకటి గదిని ఎంచుకోవాలంటున్నారు. ఇలా చక్కని ఆహారపు అలవాట్లను ఫాలో అవుతూ రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవడం మీరు ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా సహాయపడుతుందంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నైట్​ డ్యూటీ చేసే వారికి షుగర్​ వస్తుందా? - నిపుణుల సమాధానం ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.