ETV Bharat / health

వర్షాకాలంలో దోమలకు మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్ వద్దు - ఇలా చేస్తే ఒక్క దోమ కూడా కుట్టదు! - How To Keep Away Mosquitoes - HOW TO KEEP AWAY MOSQUITOES

Prevent Mosquito Bites Naturally : వర్షాకాలంలో చాలా చోట్ల ఎక్కడికక్కడ నీరు చేరిపోతుంది. దీంతో దోమలు ఎక్కువగా విజృంభిస్తాయి. ఈ క్రమంలో డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా వంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే చాలా మంది దోమలు కుట్టకుండా కెమికల్ కాయిల్స్, రిపెల్లెంట్స్‌ వాడుతారు. కానీ వాటివల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. అలా కాకుండా నేచురల్​ టిప్స్ తో తరిమికొట్టండిలా..

Prevent Mosquito Bites
Prevent Mosquito Bites Naturally (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 10:38 AM IST

Natural Ways To Keep Mosquitoes Away : మామూలు రోజుల్లోనే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. వీటివల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రమాదకర రోగాలు వస్తాయి. అందుకే.. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్ వాడుతుంటారు. అయితే.. వీటి వల్ల దోమలు చనిపోతాయేమో గానీ.. మన ఆరోగ్యం తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే.. దోమలను నేచురల్​గా తరిమికొట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

కర్పూరంతో :
మనందరి ఇళ్లలో దేవుడికి హారతి ఇచ్చేందుకు కర్పూరం వాడుతుంటాం. దీని ద్వారా దోమలను ఈజీగా తరిమికొట్టవచ్చని మీకు తెలుసా ? అదేలా అంటే.. రాత్రి అవ్వగానే ఇంట్లో ఓ చిన్నప్లేటులో కర్పూరాన్ని తీసుకొని అరగంటసేపు ఓ మూలన పెట్టండి. ఇలా చేస్తే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి.

దోమలతో నిద్రలేని రాత్రులా? - ఈ 4 మొక్కలు పెంచితే చాలు - అన్నీ ఔట్!

వెల్లుల్లి ఘాటు వాసనకు పరార్‌ :
వెల్లుల్లి వంటల రుచిని పెంచడమే కాదు.. దోమలను కూడా తరిమికొడుతుంది. ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలను దంచి, వాటిని నీళ్లలో వేసి బాగా మరిగించండి. తర్వాత ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో పోసుకుని.. రాత్రి ఇంట్లో స్ప్రే చేయండి. ఇలా చేస్తే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

లావెండర్‌ నూనెతో :
దోమలకు లావెండర్‌ నూనె అస్సలు నచ్చదు. ఈ వాసన ఉన్నచోట నుంచి అవి పారిపోతాయి. కాబట్టి, ఇంట్లో లావెండర్‌ నూనె స్ప్రే చేయండి. దోమలు మరీ ఎక్కువగా ఉంటే.. లావెండర్‌ ఆయిల్‌ని చేతులు, కాళ్లకు రాసుకోండి. ఇలా చేస్తే ఒక్క దోమ కూడా మిమ్మల్ని కుట్టదు.

పుదీనాతో దోమలకు చెక్‌ :
నాన్‌వెజ్‌ కూరలు, సాంబార్‌ వంటివి ఏవైనా ఘుమఘుమలాడాలంటే.. పుదీనా వేయాల్సిందే. పుదీనా ఆకులు కర్రీ రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే, ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు పుదీనా ఆకుల కట్టలను గానీ లేదా ఆయిల్‌ని ఉంచినట్లయితే దోమలు పారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 2012లో 'Parasitology' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. పుదీనా ఆకుల నుంచి వచ్చే వాసన దోమలను తిప్పికొట్టడంలో ఎంతో ప్రభావంగా పనిచేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. అలాగే, పుదీనా ఆకుల వాసన ఉన్న ప్రదేశంలో దోమలు తక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ పరిశోధనలో మలేషియాలోని యూనివర్సిటీ సెయిన్స్ మలేషియాకు చెందిన 'డాక్టర్‌ M.A. కమరుదిన్' పాల్గొన్నారు. పూదీనా ఆకుల వాసన ఉన్నచోట దోమలు తక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

రీసెర్చ్ : బెంబేలెత్తిస్తున్న డెంగీ, మలేరియా - ఈ కలర్ డ్రెస్సు వేసుకున్న వాళ్లను దోమలు ఎక్కువగా కుడతాయ్!

దోమలు మిమ్మల్ని మాత్రమే కుడుతున్నాయా? అందుకు కారణాలు, తప్పించుకునే చిట్కాలు ఇవిగో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.