ETV Bharat / health

జుట్టు సమస్యలన్నీ క్లియర్ - ఈ నేచురల్ ఆయిల్స్​ గురించి తెలుసా?

Natural Oils For Hair Growth : కొందరికి జుట్టు రాలుతుంది.. మరి కొందరికి చివర్లు చిట్లిపోతుంది.. ఇంకొందరికి జుట్టు సిల్కీగా ఉండదు.. ఇలా జుట్టు సమస్యలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇదేవిధంగా.. ఒక్కో సమస్యకు ఒక్కో నేచురల్ ఆయిల్ వాడాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మరి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Natural Oils For Hair Growth
Natural Oils For Hair Growth
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 11:38 AM IST

Natural Oils For Hair Growth : మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి వివిధ కారణాల వల్ల.. ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం, చివర్లు చిట్లి పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి హెయిర్‌ డ్యామేజ్‌ మహిళలు, పురుషులు ఇద్దరిలోనూ కనిపిస్తోంది. అయితే.. రోజూ కొన్ని రకాల సహజ నూనెలను జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం పొంద వచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మరి.. ఏ సమస్యకు ఎలాంటి ఆయిల్ వాడాలనేది ఇప్పుడు చూద్దాం.

ఆముదం నూనె :
ఆముదం నూనెలో విటమిన్‌ ఇ, ప్రొటీన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీనన్ని రోజూ అప్లై చేసుకోవడం వల్ల జుట్టు మృదువుగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హెయిర్‌ పెరుగుదలలోనూ ఆముదం నూనె ఎంతగానో సహాయపడుతుందని చెబుతున్నారు. 2015లో ప్రచురించిన 'కాస్మెటిక్‌ డెర్మటాలజీ జర్నల్‌' నివేదిక ప్రకారం.. ఆముదం నూనెను వారానికి రెండు సార్లు అప్లై చేసుకున్న వారిలో జుట్టు మృదువుగా, మెరిసేలా మారిందని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో 40 మంది పాల్గొన్నారు. ఇది 8 వారాల పాటు జరిగింది.

టీట్రీ ఆయిల్ :
పొడి జుట్టు, చుండ్రు సమస్యతో బాధపడేవారికి టీ ట్రీ ఆయిల్‌ బాగా పని చేస్తుందట. ఆ నూనె అప్లై చేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారతాయట. అలాగే.. ఒత్తైన జుట్టు సొంతమవుతుందని చెబుతున్నారు.

ఉల్లిపాయ నూనె :
ఉల్లిపాయ నూనె కూడా జుట్టుకు సమస్యల నివారణకు చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయిల్ ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుతుంది. అదేవిదంగా.. స్కాల్ప్‌ ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.

తెల్లజుట్టుతో ఇబ్బందిపడుతున్నారా? ఈ సీడ్స్​ ట్రై చేస్తే నల్లగా మారడం పక్కా!

కొబ్బరి నూనె :
మనలో మాగ్జిమమ్ జనాలు కొబ్బరి నూనె వినియోగిస్తారు. ఇందులో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఈ ఆయిల్​తో జుట్టు కుదుళ్లు లోపలి నుంచి బలంగా మారతాయట. అలాగే.. కొబ్బరి నూనె జుట్టును మృదువుగా, మెరిసిపోయేలా చేస్తుంది. అందుకే రోజూ ఈ నూనెను అప్లై చేసుకోమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఆలివ్ నూనె :
ఆలివ్ ఆయిల్‌లో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, ఒలేయిక్ యాసిడ్ వంటివి ఉంటాయి. ఇవి స్కాల్ప్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఈ ఆలివ్‌ నూనెతో జుట్టుకు మర్దన చేసుకోవడం వల్ల హెయిర్‌కు పోషణ అందుతుందట. అలాగే చుండ్రు సమస్యతో బాధపడేవారు నిమ్మరసంతో దీనిని జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని తెలియజేస్తున్నారు.

ఉసిరి నూనె :
ఉసిరి నూనెలో విటమిన్‌ సి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్‌ వంటి ఎన్నో గుణాలుంటాయి. దీన్ని వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండి రాలకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చిట్లిపోవడం తగ్గిపోయి మృదువుగా మారుతుందని తెలియజేస్తున్నారు.

గమనిక : ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఫలితాల్లో తేడా ఉండొచ్చు. అందువల్ల మీరు ఏదైనా ఆయిల్ వాడే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.

మానిక్యూర్ కోసం బ్యూటిపార్లర్​కు వెళ్తున్నారా? - అయితే ఇకపై ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

స్టైలిష్​ లుక్​ కోసం హెయిర్​కు కలర్​ వేసుకుంటున్నారా ? ఈ టిప్స్​ పాటిస్తే ఎక్కువ రోజులు నిగనిగలాడుతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.