ETV Bharat / health

మేకప్​ తొలగించుకోవడానికి కెమికల్​ రిమూవర్స్​ వాడుతున్నారా? - ఒక్కసారి ఈ నేచురల్​ ప్రొడక్ట్స్ ట్రై చేయండి! - Tips to Remove Makeup Naturally

Natural Makeup Removers: అందంగా కనిపించడానికి మేకప్​ వేసుకుంటుంటారు చాలా మంది. అయితే పార్టీ తర్వాత మేకప్​ తొలిగించుకోవడానికి కెమికల్స్​ తో కూడిన రిమూవర్స్​ వాడుతుంటారు. దీనివల్ల కొద్దిమందికి రియాక్షన్స్​ స్టార్ట్​ అవుతుంటాయి. అలాంటప్పుడు నేచురల్​ రిమూవర్స్​ వాడితే మంచిది అంటున్నారు నిపుణులు..

Natural Makeup Removers
Tips to Remove Makeup Naturally (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 3:01 PM IST

Tips to Remove Makeup Naturally: ఫంక్షన్లు, పెళ్లిళ్లు.. ఇలా అకేషన్​ ఏదైనా అందంగా కనిపించడంలో అమ్మాయిలు ముందుంటారు. ఈ క్రమంలోనే వేడుకకు తగినట్లుగా మేకప్​ వేసుకుంటుంటారు. అయితే రోజంతా మేకప్‌తో ఉన్నా.. రాత్రి నిద్రపోయే ముందు మాత్రం మేకప్‌ను తొలగించుకోవడం తప్పనిసరి. లేదంటే.. వివిధ రకాల చర్మ సమస్యలు చుట్టుముడతాయి. అయితే.. మేకప్​ రిమూవ్​ చేయడానికి రసాయన పూరిత మేకప్‌ రిమూవర్స్‌కు బదులుగా ఇంట్లోనే లభించే పదార్థాలతో నేచురల్​గా మేకప్‌ను తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. వీటి వల్ల ఎటువంటి సైడ్​ ఎఫెక్ట్సూ ఉండవంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

పాలు: పచ్చి పాలను ఎన్నో బ్యూటీ ట్రీట్​మెంట్స్​లో వాడుతుంటారు. కాగా, పాలతో మేకప్‌ను సైతం తొలగించవచ్చంటున్నారు నిపుణులు. పాలలో కాటన్‌ బాల్‌ను ముంచి.. దాంతో ముఖాన్ని శుభ్రంగా తుడిచేసుకుంటే.. ముఖంపై ఉన్న మేకప్‌ తొలగిపోయి తాజాగా మారుతుందని అంటున్నారు. ఒకవేళ ఎక్కువగా మేకప్‌ వేసుకున్నట్లయితే పాలలో ఒక టేబుల్‌స్పూన్‌ బాదం నూనెను వేసి కలుపుకొని, ఈ మిశ్రమంతో మేకప్‌ను తొలగించుకోవచ్చని చెబుతున్నారు.

"ఇంటర్నేషనల్​ జర్నల్​ ఆఫ్​ డెర్మటాలజీ"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పాలతో మేకప్​ను తొలగించుకోవడం వల్ల మేకప్​ పూర్తిగా తొలగిపోతుందని అలాగే హైడ్రేషన్​ అండ్​ మృదుత్వం పెరుగుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు, న్యూయార్క్ నగరంలోని మౌంట్ సినాయ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌ డాక్టర్​ డాన్​ యాంగ్​ పాల్గొన్నారు.

కొబ్బరినూనె: మేకప్‌ త్వరగా చెరిగిపోకూడదని చాలామంది వాటర్‌ప్రూఫ్‌ మేకప్‌ను ఎంచుకుంటారు. అయితే.. ఇది వేసుకోవడానికి బాగానే ఉన్నా దీన్ని రిమూవ్​ చేసేందుకు కాస్త ఎక్కువగా శ్రమించాలి. ఇలాంటప్పుడు సహజమైన కొబ్బరినూనెను వాడడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇది వాటర్‌ప్రూఫ్‌ మేకప్‌ను ఎంతో సులువుగా తొలగించడమే కాకుండా చర్మానికి మాయిశ్చరైజర్‌లాగా పనిచేసి మృదువుగా మారుస్తుందని అంటున్నారు. అందుకోసం ఒక టీస్పూన్‌ కొబ్బరినూనె చేతుల్లోకి తీసుకొని ముఖానికి, మెడకు బాగా పట్టించి 2-3 నిమిషాల తర్వాత కాటన్‌ ప్యాడ్లతో తుడిచేసుకుంటే సరి. లిప్‌స్టిక్‌ను సైతం కొబ్బరినూనెతో ఇలాగే తొలగించుకోవచ్చు.

టీ Vs కాఫీ - ఈ రెండిట్లో ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది? - మీకు తెలుసా? - Tea Vs Coffee Which Is Better

తేనె: తేనెలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి మంచి మాయిశ్చరైజర్‌లాగా పని చేస్తాయని.. అంతేకాకుండా.. నేచురల్‌ మేకప్‌ రిమూవర్‌గానూ తేనెను ఉపయోగించవచ్చని అంటున్నారు. దీనికోసం.. ఒక కాటన్‌ బాల్‌ లేదా తడిపిన కాటన్‌ క్లాత్‌పై కాస్త తేనె వేసి, దాంతో ముఖంపై మసాజ్‌ చేసినట్లుగా మృదువుగా 5 నిమిషాల పాటు రుద్దుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

కలబంద: నిత్యం మేకప్‌ వేసుకునే వారు ఇంట్లోనే కలబందతో సులువుగా మేకప్‌ను తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. దీనికోసం ఒక గిన్నెలో టేబుల్‌స్పూన్‌ కలబంద గుజ్జు, కొద్దిగా తేనె, 4-5 చుక్కల బాదంనూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసుకొని.. చేతి వేళ్లతో రెండు నిమిషాల పాటు మసాజ్‌ చేసుకోవాలి. ఆపై చల్లని నీళ్లతో కడిగేస్తే సరి. తద్వారా మేకప్‌ తొలగిపోవడంతో పాటు ముఖం కాంతివంతంగా తయారవుతుందని అంటున్నారు.

ఆవిరి: ఆవిరిని మేకప్‌ తొలగించుకోవడానికి కూడా ఉపయోగించచ్చని చెబుతున్నారు నిపుణులు. ఆవిరి ప్రక్రియ.. వేసుకున్న మేకప్‌ను నిమిషాల్లో తొలగించి ముఖాన్ని తాజాగా మారుస్తుందంటున్నారు. దీనికోసం, ఒక వెడల్పాటి గిన్నెలో వేడి నీళ్లను తీసుకొని అయిదు-పది నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. ఆపై మేకప్‌ రిమూవర్‌ స్పాంజి లేదా కాటన్‌ క్లాత్‌తో ముఖాన్ని తుడిచేసుకోవాలి. తద్వారా మేకప్‌ మొత్తం చెమటతో పాటు తొలగిపోతుంది. ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరచుకొని వాటిలోని దుమ్ము, ధూళి, మురికి సైతం తొలగిపోయి చర్మం తాజాగా మారుతుందని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోజూ లిఫ్ట్​ ఎక్కుతున్నారా? - మెట్లు ఎక్కితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? - Health Benefits of Climbing Steps

అలర్ట్​: ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా? - ఈ సమస్యలున్న వారు తాగితే అంతే! - These People Should Not Drink Lemon Water

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.