ETV Bharat / health

నేషనల్ మ్యాంగో డే: గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి క్యాన్సర్ దాకా - అన్నింటికీ మామిడితో చెక్! - National Mango Day 2024 History - NATIONAL MANGO DAY 2024 HISTORY

Mango : పండ్లలో రాజు అంటే క్షణం ఆలస్యం లేకుండా చెప్పే పేరు "మామిడి". చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ దీనిని తినేవారే. ఇక వేసవి కాలంలో మాత్రమే లభించే మామిడికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. అయితే ఇంత ప్రాముఖ్యత కలిగిన మామిడి పండ్లకూ ఓ ప్రత్యేకమైన రోజు ఉంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Mango Health Benefits
National Mango Day 2024 History (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 12:31 PM IST

National Mango Day 2024 History: మామిడి పండ్లు.. ఈ పేరు చెబితేనే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. తీపి, పులుపు రుచుల్లో దొరికే ఈ పండ్లకు ఫ్యాన్స్​ కూడా ఎక్కువే. అంతేనా ఏడాదికోసారి లభించే వీటిని ఎప్పుడంటే అప్పుడు తినేలా.. ఆవకాయ పెట్టి నిల్వ చేసుకుంటారు. వేడి వేడి అన్నంలో కొంచెం ఆవకాయ వేసుకుని, నెయ్యితో కలుపుకుని తింటే ఆ మజానే వేరు. మరి ఇంత ఇష్టంగా తినే మామిడి పండ్లకూ ఓ ప్రత్యేకమైన రోజు ఉంది. మీరు విన్నది నిజమే. జులై 22న జాతీయ మామిడి దినోత్సవంగా జరుపుకుంటారు. అసలు ఈ మామిడిపండ్ల కోసం ఓ దినోత్సవాన్ని ఎందుకు జరుపుతున్నారు? దీని వెనక చరిత్రలో ఏం జరిగింది? ఈ పండ్లకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది? వంటి అంశాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

జాతీయ మామిడి పండ్ల దినోత్సవం చరిత్ర : 1987లో, భారతదేశంలో పండ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మామిడి ప్రాముఖ్యతను గుర్తించడానికి నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (NHB) మొదటి జాతీయ మామిడి దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి, ప్రతి సంవత్సరం జులై 22న జాతీయ మామిడి దినోత్సవాన్ని జరుపుకుంటారు.

అప్పటి నుంచే మొదలు: ఇండియా మామిడిపండ్లను పండ్లలో రాజుగా ఎందుకు చెబుతుందో తెలుసా? ఎందుకంటే... భారతదేశ నాగరికత ప్రారంభం నుంచే భారతీయులకు మామిడి పండ్లతో సంబధం ఉంది. సుమారు 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో మొదటిసారిగా మామిడిని పండించారు. మామిడి పండ్లు కూడా జీడిపప్పు, పిస్తా జాతికి చెందినవే. దీని శాస్రీయ నామం Mangifera Indica (Anacardiaceae).

భారత్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ జాతీయ పండు మామిడిపండు. బంగ్లాదేశ్ జాతీయ చెట్టు మామిడిచెట్టు. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా మామిడిని సప్లై చేస్తున్న దేశం ఇండియా. దాదాపు సగం సప్లై ఇండియాదే. తర్వాతి స్థానంలో చైనా, ఇండోనేషియా, పాకిస్థాన్​, మెక్సికో ఉంది. ఇండియాలో ప్రతి సంవత్సరం 2 కోట్ల టన్నులకు పైగా మామిడి ఉత్పత్తి అవుతోంది.

మామిడి తాండ్ర తింటున్నారా? - మీకు ఈ ప్రయోజనాలు లభించడం గ్యారెంటీ!

మ్యాంగో పేరు ఎలా వచ్చిందంటే: "మామిడి" అనే పేరు మలయాళం పదం "మన్న" నుంచి ఉద్భవించింది. పోర్చుగీస్ వారు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయడానికి 1498లో కేరళకు వచ్చినప్పుడు "మాంగా"గా మార్చారు. కాలక్రమేణా దీనిని మ్యాంగోగా పిలుస్తున్నారు.

ఇండియాలో మామిడి రకాలు: భారతదేశంలో వాణిజ్య రకాలు సహా మొత్తం 15 వందల రకాల మామిడిని పండిస్తారు. మామిడి ప్రధాన రకాలు ఒక్కొక్కటి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల మామిడి పండ్లను పండిస్తారు.

  • అల్ఫోన్సో మామిడి - రత్నగిరి - మహారాష్ట్ర

• కేసర్ మామిడి - జునాగఢ్ - గుజరాత్

• దాషేరి మామిడి - లఖ్​నవూ, మలిహాబాద్ - ఉత్తరప్రదేశ్

• హిమసాగర్, కిషన్ భోగ్ మామిడి పండ్లు - ముర్షిదాబాద్, పశ్చిమ బంగాల్​

• చౌసా మామిడి - హర్దోయి, ఉత్తరప్రదేశ్

• బాదామి మామిడి - ఉత్తర కర్ణాటక

• సఫేదా మామిడి - ఆంధ్రప్రదేశ్

• బొంబాయి గ్రీన్ మామిడి - పంజాబ్

• లాంగ్రా మామిడి - వారణాసి, ఉత్తర ప్రదేశ్

• తోతాపురి మామిడి - బెంగళూరు, కర్ణాటక

• నీలం మామిడి - ఆంధ్రప్రదేశ్

• రాస్పూరి మామిడి - కర్ణాటక

• మాల్గోవా/ముల్గోబా మామిడి - సేలం, తమిళనాడు

• లక్ష్మణభోగ్ మామిడి పండ్లు - మాల్దా, పశ్చిమ బెంగాల్

• ఆమ్రపాలి మామిడి పండ్లు - భారతదేశం అంతటా

• ఇమామ్ పసంద్ మామిడి పండ్లు - ఆంధ్రప్రదేశ్/తెలంగాణ/తమిళనాడు

• ఫజ్లీ మామిడి - బీహార్

• మంకురద్ మామిడి పండ్లు - గోవా

• పహేరి/పైరి మామిడి పండ్లు - గుజరాత్

• మల్లికా మామిడిపండ్లు - భారతదేశం అంతటా

• వనరాజ్ మామిడి - గుజరాత్

• కిలిచుండన్ మామిడి - కేరళ

• రుమాని మామిడి పండ్లు – చెన్నై

పచ్చి మామిడి Vs పండిన మామిడి - ఏది ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా?

మామిడి ఆరోగ్య ప్రయోజనాలు: మామిడిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్​, ఫైబర్​, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి అధికంగా ఉంటాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మామిడిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: మామిడిలోని ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్​ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. 2021 లో "Journal of Nutrition" లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం మామిడి పండ్లు తినడం వల్ల అందులోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్​ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్​ స్థాయిలను పెంచుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో టెక్సాస్​ A&M విశ్వవిద్యాలయంలో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్​ Dr. Maria G. Villarreal-Gonzalez పాల్గొన్నారు.

జీర్ణక్రియకు సహాయపడుతుంది: మామిడిలోని ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. గ్యాస్ట్రిక్​, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుందని అంటున్నారు.

కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: మామిడిలోని విటమిన్ ఎ కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.

చర్మానికి మేలు చేస్తుంది: మామిడిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయని, ముఖంపై ముడతలను తగ్గించడానికి సహాయపడతాయని అంటున్నారు.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది: మామిడిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు.

అలర్ట్ : మామిడి పండు తింటే షుగర్ పెరుగుతుందా? - నిపుణులు ఏమంటున్నారంటే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.