Best Tips For Healthy Nails : ప్రతి ఒక్కరూ మంచి హెయిర్ స్టైల్, గ్లోయింగ్ స్కిన్, ఎట్రాక్ట్ చేసే గోళ్లతో అందంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ.. పలు కారణాలతో గోళ్లు(Nails) విరిగిపోతుంటాయి. అయితే.. కొన్ని రకాల టిప్స్ పాటించండం ద్వారా.. ఆరోగ్యకరమైన గోళ్లను సంపాదించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
తేమ అందాలి : గోళ్లు కాస్త పెరగ్గానే పొడిబారి, పెళుసుగా మారి విరిగిపోవడానికి అవి తేమను కోల్పోవడం ఒక కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ముందుగా నెయిల్స్‌కు తగినంతం తేమను అందించడం చాలా ముఖ్యమంటున్నారు. ఇందుకోసం తగినంత వాటర్ తాగాలి. అలాగే.. పెట్రోలియం జెల్లీ లేదంటే మాయిశ్చరైజర్‌ను గోరు మొదలు(క్యుటికల్) చుట్టూ పూసి, చేతులకు కాటన్ గ్లౌజుల్ని ధరించాలని సూచిస్తున్నారు. రాత్రంతా అలాగే ఉంచుకొని మార్నింగ్ లేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం ద్వారా నెయిల్స్ తిరిగి తేమను పొందుతాయి. ఫలితంగా నెయిల్స్ విరిగిపోయే ప్రమాదం తగ్గుతుందంటున్నారు.
విటమిన్ E నూనెతో ఇలా చేయండి : మీ గోళ్లు తరచుగా నిర్జీవంగా మారి, పొడిబారిపోయి విరిగిపోతున్నాయా? అయితే.. విటమిన్ E నూనె తప్పనిసరిగా ఉపయోగించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం కొన్ని చుక్కల విటమిన్ E నూనె తీసుకొని.. గోళ్లపై, గోరు మొదలులో వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా నెయిల్స్‌కు రక్తప్రసరణ మెరుగుపడి.. కొన్ని రోజుల్లోనే అవి అందంగా, ఆరోగ్యంగా తయారవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో గోళ్లు విరిగిపోయే సమస్య కూడా తగ్గుతుందని అంటున్నారు.
మీ గోళ్లు ఏ కలర్లో ఉన్నాయి? - ఆ రంగులోకి మారితే ప్రమాదం ముంచుకొస్తోందని అర్థం!
ఆలివ్ ఆయిల్ : గోళ్లు విరక్కుండా ఆపడంలో అద్బుతంగా పనిచేసే మరో నూనె ఆలివ్ ఆయిల్. గోళ్లు విరిగే సమస్యను తగ్గించడంలో ఇది చక్కగా పనిచేస్తుందని చెబుతున్నారు. ముందుగా ఒక గిన్నె తీసుకొని.. అందులో ఆలివ్ ఆయిల్ వేసి, తర్వాత మీ గోళ్లను అందులో ముంచాలి. దాదాపు పావుగంటపాటు గోళ్లు అందులో ముంచి ఉంచాలి. ఇలా మొదటి నెలలో వారానికి ఒకసారి.. ఆ తర్వాత నెలలో రెండు వారాలకు ఒకసారి చేయడం ద్వారా గోళ్లు విరిగిపోయే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
2019లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఆలివ్ ఆయిల్‌ను రోజుకు రెండు సార్లు గోళ్లకు పూసుకున్న వారితో పోలిస్తే.. అసలు రాసుకోని వారి గోళ్లు ఎక్కువగా పొడిబారినట్టు నిపుణులు గుర్తించారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ జె. కె. అలీ పాల్గొన్నారు. అలివ్ ఆయిల్ గోళ్లు పొడిబారి విరిగిపోవడాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : గోళ్లు కొరకడం అలవాటు కాదు మానసిక సమస్య - ఈ టిప్స్‌తో వెంటనే మానుకోండి!