ETV Bharat / health

మిక్స్‌‌డ్ వెజిటబుల్ సలాడ్ - తింటే బరువు తగ్గడంతో పాటు ఎన్నో లాభాలు- ఈజీగా చేసుకోండిలా! - Vegetable Salad For Weight Loss

Vegetable Salad For Weight Loss : మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా ? డైలీ వివిధ రకాల వ్యాయామాలు చేస్తూ, కఠినమైన డైట్‌ పాటించినా కూడా సన్నగా మారడం లేదా ? అయితే, మీరు కచ్చితంగా మీ డైట్‌లో మిక్స్‌డ్ వెజిటబుల్‌ సలాడ్‌ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అది ఎలా ప్రిపేర్​ చేయాలో చూద్దాం..

Vegetable Salad For Weight Loss
Vegetable Salad For Weight Loss
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 2:57 PM IST

Mixed Vegetable Salad For Weight Loss : ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం వంటి వివిధ కారణాల వల్ల అధిక సంఖ్యలో జనాలు బరువు పెరిగిపోతున్నారు. ఇలా అధిక బరువుతో బాధపడేవారు వెయిట్‌లాస్‌ అవ్వడానికి రోజూ వ్యాయామాలు చేయడంతో పాటు, కఠినమైన డైట్‌ను పాటిస్తుంటారు. అయినా కొన్నిసార్లు ఫలితం ఉండదు. అలాంటప్పుడు బరువు ఎక్కువగా ఉన్న వారు డైట్‌లో మిక్స్‌డ్ వెజిటబుల్‌ సలాడ్‌ తినడం వల్ల వెయిట్​ లాస్​కు అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులంటున్నారు. మరి మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ సలాడ్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వెయిట్​ లాస్​: అధిక బరువుతో బాధపడేవారు బరువు తగ్గడానికి రోజూ డైట్‌లో ఫైబర్‌ ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అందుకోసం మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ సలాడ్‌ ట్రై చేయమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఈ సలాడ్​ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ సలాడ్‌లోని కూరగాయలలో ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలి కాకుండా, అతిగా తినకుండా ఉండేలా చేస్తుందని అంటున్నారు.

2017లో "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఓబెసిటీ" లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అధిక బరువుతో బాధపడేవారు మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ సలాడ్‌ తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి, ఫైబర్‌ ఎక్కువగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని 'మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్‌'లో పని చేసే 'డాక్టర్‌. డేవిడ్ జె లెవిన్' పాల్గొన్నారు. బరువు ఎక్కువగా ఉన్న వారు మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ సలాడ్‌ తినడం వల్ల బరువు తగ్గుతారని ఆయన అన్నారు.

  • అలాగే అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ADA) నివేదిక ప్రకారం, డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ సలాడ్‌ తినడం వల్ల షుగర్‌ అదుపులో ఉంటుందట.
  • ఇంకా మిక్స్‌డ్ వెజిటబుల్‌ సలాడ్‌ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని, చర్మం మెరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి మిక్స్​డ్​ వెజిటబుల్​ సలాడ్​ ఎలా తయారు చేసుకోవాల? దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • బ్రోకలీ - 100 గ్రాములు
  • క్యాప్సికం - 1
  • బీన్స్ - 5
  • క్యారెట్ - 2(మీడియం సైజువి)
  • క్యాబేజీ తరుగు - మూడు స్పూన్లు
  • నిమ్మరసం - ఒక స్పూను
  • టమాట - 2 (మీడియం సైజువి)
  • పచ్చిమిర్చి - 1
  • మిరియాల పొడి - పావు స్పూను
  • కొత్తిమీర కట్ట - 1

మిక్స్‌డ్ వెజిటబుల్ సలాడ్ ఎలా చేయాలి ?

  • ముందుగా అన్ని కూరగాయలను శుభ్రంగా కడిగి సన్నగా కట్‌ చేసుకోవాలి.
  • తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • మెత్తగా అయిన కూరగాయలను ఒక ప్లేట్‌లోకి తీసుకుని వాటిపై కొద్దిగా నిమ్మరసం, మిరియాల పొడి చల్లుకోవాలి. అంతే మిక్స్​డ్​ వెజిటబుల్​ సలాడ్​ రెడీ..
  • సలాడ్​ తినేముందు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని తింటే ఈజీగా బరువు తగ్గే అవకాశం ఉంది నిపుణులంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.