Health Benefits Of Junnu : చాలా మంది ఫేవరెట్ స్వీట్ రెసిపీలలో జున్ను తప్పకుండా ఉంటుంది. ఇందులో పాల కంటే అధిక మోతాదులో పోషక విలువలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది రుచిలోనే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు. ముఖ్యంగా దీనిలో పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయట. అందుకే.. ప్రతిఒక్కరూ జున్ను తినాలని సూచిస్తున్నారు.
కండరాలు బలంగా మారుతాయి : ఇతర పాల ఉత్పత్తుల మాదిరిగానే జున్నులోనూ కండరాలను పటిష్టం చేసే పోషకాలు మెండుగా ఉంటాయంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా దీనిలో పుష్కలంగా ప్రొటీన్లు కండరాలను(Muscles) బలంగా మార్చడానికి చాలా బాగా తోడ్పడతాయని చెబుతున్నారు. కాబట్టి, కండరాల బలహీనత ఉన్నవారు జున్ను తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
మంచి ఇమ్యూనిటీ బూస్టర్ : జున్ను తినడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చంటున్నారు. దీనిలో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో చాలా బాగా ఉపయోగయపడతాయని చెబుతున్నారు. ఫలితంగా అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లు బారినపడకుండా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఎముకలు స్ట్రాంగ్‌గా మారతాయి : ఎముకలు బలంగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అలాంటి వాటిల్లో జున్ను ఒకటిగా చెప్పుకోవచ్చంటున్నారు. ఇందులో పుష్కలంగా ఉండే కాల్షియం, ఫాస్పరస్‌తో పాటు ఇతర పోషకాలు ఎముకలను స్ట్రాంగ్‌గా మార్చడంలో చాలా బాగా సహాయపడతాయని చెబుతున్నారు.
2016లో "అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. జున్ను తినే వారిలో ఎముకలు విరిగే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూఎస్‌లోని టెక్సాస్ A&M హెల్త్ సైన్సెస్ సెంటర్ డెపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ డాక్టర్ మార్సియా సి. కాల్డ్‌వెల్ పాల్గొన్నారు. జున్నులో ఉండే కాల్షియం, ఇతర పోషకాలు బోన్స్ బలంగా మారడానికి చాలా బాగా తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు.
జీర్ణక్రియకు మేలు : జున్నులో ఉండే ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడతాయి. ఫలితంగా జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు.
చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది : రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడంలో కూడా జున్ను సహాయపడుతుందని చెబుతున్నారు. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు. అయితే, జున్ను తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ మితంగా తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అతిగా తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు దారితీసే ఛాన్స్ ఉంటుందని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
అలర్ట్ : మీకు ఈ ఆరోగ్య సమస్యలుంటే - పాలు అస్సలు తాగొద్దు!
"భయ్యా - పిజ్జా విత్ ఎక్స్ట్రా ఛీజ్" అని ఆర్డర్ వేస్తున్నారా? - అయితే ఇదర్ దేఖో జీ!