ETV Bharat / health

బెల్లం ఎన్ని రకాలు? ఏది తింటే ఆరోగ్యానికి మంచిది? రోజూ తినాలని ఎందుకు చెబుతారు? - Health Benefits Of Jaggery

Jaggery Health Benefits : రోజూ బెల్లం కొంచెమైనా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దలు, వైద్యులు చెబుతుంటారు. మరి బెల్లం ఎన్ని రకాలు ఉంటుందో తెలుసా? ఏది తింటే ఆరోగ్యానికి మంచిది?

Jaggery Health Benefits
Jaggery Health Benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 7:10 AM IST

Jaggery Health Benefits : సహజంగా తీపి గుణం కలిగిన బెల్లం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. రోజూ కొంచెం బెల్లమైనా తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని పెద్దలు, నిపుణులు చెబుతుంటారు. మార్కెట్​లో బెల్లం వివిధ రకాలుగా లభిస్తుంది. ఒక్కో బెల్లం ఒక్కో రకమైన ప్రయెజనాలను కలిగిస్తుందట. అసలు బెల్లం ఎన్ని రకాలుగా ఉంటుంది? ఏది తింటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందో చూద్దాం.

బెల్లం రకాలు
1. చెరుకు బెల్లం: చెరుకుతో తయారు చేసే బెల్లం చాలా సాధారణ రకం. వాస్తవానికి బెల్లం ఎంత ముదురు రంగులో ఉంటే అంత మంచిదట. ఈ రకంగా చూస్తే చెరుకు బెల్లం అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. దీన్ని రోజూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, నిర్విషీకరణకు అవసరమైన పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి.

2. తాటి బెల్లం:
తాటి చెట్ల రసంతో తయారు చేసే తాటి బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ మనిషి శారీరక ఎదుగుదలకు బాగా సహాయపడుతుంది.

3. ఖర్జూర బెల్లం:
ఖర్జూర చెట్టు ఆకుల రసం నుంచి తీసుకునేదే ఖర్జూర బెల్లం. దీన్నే ఖజూర్ బెల్లం అని కూడా పిలుస్తారు. ఇందులో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని చాలా మంది వంటకాల్లో ఉపయోగిస్తుంటారు.

4. కొబ్బరి బెల్లం:
కొబ్బరి చెట్ల నుంచి తయారుచేసే కొబ్బరి బెల్లంలో పొటాషియానికి గొప్ప మూలం. రుచిలో పంచదార పాకంలా ఉండే ఈ కొబ్బరి బెల్లం చెరుకు బెల్లం కన్నా ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తుందట.

5. నల్ల బెల్లం:
సంప్రదాయ ఆయుర్వేద ఔషధాల్లో నల్ల బెల్లానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇది అనేక రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటుందట. పలు రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాల తయారీలో నల్ల బెల్లాన్ని ఎక్కువగా ఉపయెగిస్తారు.

6. నువ్వుల బెల్లం:
వేయించిన నువ్వులతో తయారు చేసే ఈ బెల్లం ఆరోగ్యానికి చాలా రకాల ప్రయెజనాలను కలిగిస్తుందట. వీటిలోని కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి.

రోజూ బెల్లం తింటే ఏమవుతుంది?
పోషకాల గని:
బెల్లంలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలకు మూలం. ఇందులో శరీరానికి అవసరమైన బీ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

శక్తిని పెంచుతాయి:
కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే బెల్లం శరీరానికి సహజమైన శక్తిని అందిస్తుంది. ఇది అలసట, నీరసం వంటి వాటి నుంచి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది.

అరుగుదల:
భోజనం చేసిన తర్వాత బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. మలబద్దకం, అజీర్తి లాంటి సమస్యలను తగ్గించి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నిర్విషీకరణ:
బెల్లం మన ప్రాణాధారమైన కాలేయం ఎప్పుడూ డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి రక్తన్ని శుద్ధి చేయడానికి బెల్లం చక్కగా సహాయపడుతుందట.

శ్వాసకోశ ఆరోగ్యం:
దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల చికిత్సకు బెల్లం బాగా ఉపయోగపడుతుంది. బెల్లాన్ని కాస్త అల్లంతో కలిపి తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది.

రక్తహీనత నివారణ:
బెల్లంలోని ఐరన్ కంటెంట్ రక్తహీనత నివారిణిగా పనిచేస్తుంది. ఐరన్ డెఫీషియన్సీ, అనీమియా వంటి వాటి చికిత్సతో పాటు ఎర్ర రక్త కణాల ఉత్త్పత్తికి బెల్లం బాగా దోహద పడుతుంది.

బరువు నియంత్రణ:
బరువు తగ్గాలనుకునే వారు శుద్ధి చేసిన చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది తక్కువ కేలరీలు, ఆరోగ్యకరమైన తీపిదనం కలిగి ఉండి మీ బరువును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుతుంది.

చర్మానికి:
బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చక్కగా సహాయపడతాయి. ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలు తగ్గించడానికి రోజూ కొంచెం బెల్లం తప్పక తినాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.

కరివేపాకు మజ్జిగ తాగితే ఎన్నో లాభాలు! స్కిన్ ఇన్ఫెక్షన్లు దూరం! - Curry Leaves Buttermilk Benefits

ఈ పది లక్షణాలు కనిపిస్తే మలేరియా బారినపడ్డట్లే- అవేంటంటే? - Malaria Symptoms In Telugu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.