ETV Bharat / health

పాస్తా ఆరోగ్యానికి మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? - Is Pasta Unhealthy

Is Pasta Unhealthy : పాస్తా అంటే మీకు చాలా ఇష్టమా? కానీ ఇది ప్రాసెస్ చేసిందని, ఆరోగ్యానికి హాని చేస్తుంది అని అంతా చెబుతున్నారా? అయితే ఈ కొత్త పరిశోధనలు మీ కోసమే. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అవేంటంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 6:55 AM IST

Is Pasta Unhealthy
Is Pasta Unhealthy (GettyImages)

Is Pasta Unhealthy : ప్రస్తుతం చాలా మంది తల్లులు తమ పిల్లలకు తరచుగా పెడుతున్న ఆహార పదార్థాల్లో పాస్తా ముందు వరుసలో ఉంటుంది. సమయం లేక కొందరు, పిల్లల ఇష్టాన్ని కాదనలేక ఇంకొందరు పాస్తాను రెగ్యులర్​గా చేసి పెడుతున్నారు. సాధారణంగా గోధుమ పిండిలో గుడ్లు, లేదా నీరు కలిపి ఉడికించిన తర్వాత పిల్లలను ఆకర్షించేలా రకరకాల రూపాల్లో పాస్తాను తయారు చేస్తారు. ప్రాసెస్ చేసిన పిండితో తయారు చేస్తారు కనుక ఇది ఆరోగ్యకరమైన ఆహారం కాదని చాలా మంది చెబుతుంటారు. అధిక కార్బోహైడ్రేట్లు కలిగిన పాస్తా తినడం అందరికీ అనారోగ్యకరం కాదని, కేవలం డైటింగ్ చేసేవాళ్లు, బరువు తగ్గాలనుకునే వారు మాత్రం వీటికి దూరంగా ఉంటే చాలనీ తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

అవును మీరు వింటున్నది నిజంగా నిజమే. ఇది చాలా మంది పాస్తా లవర్స్​కు శుభవార్తనే చెప్పచ్చు. చాలా మంది డైటీషియనల్లు, నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, పాస్తా అందరికీ అనారోగ్యకరమైన ఆహార పదార్థం కాదు.కేవలం కొందరికి మాత్రమే ఇది హాని చేసే అవకాశఆలున్నాయట. అది కూడా ఎంత మొత్తంలో తింటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుందట. అంటే సాధారణంగా పాస్తాను పూటకు సుమారు 2 ఔన్సలు అంటే 1కప్పు మాత్రమే తీసుకోవాలి.

ఒక కప్పు పాస్తాలో సుమారు 200కేలరీలు, 40గ్రాముల కార్బోహైడ్రేట్లు, 6గ్రాముల ప్రొటీన్, ఒకటి నుంచి 2 గ్రాముల ఫైబర్ ఉంటాయి. అలాగే పిండితో తయారు చేసింది కనుక పాస్తలో కేలరీలు అస్సలు వుండవనీ, కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి పాస్తా ప్రధాన శక్తి వనరుగా, పోషకాహారంగా పనిచేస్తుందట.హోల్ గ్రెయిన్ పాస్తాలో ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించి అతిగా తినే అవకాశాలను తగ్గిస్తాయి. కాబట్టి మీకు ఇష్టమైన పాస్తాను మీరు తప్పకుండా తినచ్చు.

అయితే కొన్ని షరతులు!
పాస్తా ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దీనికి సాస్ లు, వెన్న, క్రీమ్, మాంసాలు లేదా చీజ్ వంటి వాటిని జోడించడం వల్ల కేలరీలు పెరుగుతుయి. ఫలితంగా పోషకాల అసమతుల్యత సమస్య తలెత్తి జీర్ణ రుగ్మతలు వచ్చే ప్రమాదముంది.

ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఎంత మంచి ఆహారమైనా మితంగా తింటేనే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఎక్కువగా తినడం వల్ల ఆహార అసమతుల్యత ఏర్పడి అనారోగ్యకరంగా మారుతుంది. ఇది మీ జీర్ణ వ్యవస్థకు హాని చేసే అవకాశముంది. పాస్తాను మీరు ఎప్పుడూ సైడ్ డిష్​లా మాత్రమే తీసుకోవాలి. పూర్తి భోజనంగా మీరు దీన్ని అస్సలు తీసుకోకూడదు.

గోధుమ పిండితో తయారయ్యే పాస్తాలో ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. కానీ మీరు తీసుకున్నది గోధుమ పిండితో తయారు చేసిన పాస్తానేనా లేక ప్రత్యామ్నాయంగా తయారు చేసినవా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. మార్కెట్లో చిక్ పా పాస్తా, ప్రొటీన్ పాస్తా, ఎడామామ్ పాస్తా, బ్లాక్ బీన్ పాస్తా అంటూ రకరకాలుగా లభిస్తున్నాయి. చూసి కొనుక్కోవడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉండచ్చు.

పాస్తాతో కొత్తగా 'ఫ్రైడ్ రవియోలి' నోరూరించగా!

'సీ ఫుడ్​ పాస్తా'.. రుచిలో పిస్తా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.