Is Coffee Safe During Pregnancy : చాలా మందికి కాఫీ అంటే ఎంతో ఇష్టం. ఉదయాన్నే కప్పు కాఫీ తాగితే ఆ రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చని ఫీల్ అవుతుంటారు. అలాగే కాస్త పని ఒత్తిడిగా అనిపించినా, అలసటగా ఉన్న కాఫీ తాగితే రిలీఫ్ లభిస్తుందని భావిస్తుంటారు. అయితే, గర్భధారణ సమయంలో కాఫీ తాగడంపై చాలా మందిలో అనుమానాలుంటాయి. ఎక్కువ మంది.. కాఫీ తాగడం వల్ల బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుందని, అలాగే తక్కువ బరువు పుడతారని ఆందోళన చెందుతుంటారు.
కాఫీలో ఉండే కెఫెన్ బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తుంటారు. అందుకే గర్భిణులు కాఫీకి దూరంగా ఉండాలని చెబుతుంటారు. దీంతో కాఫీ అంటే ఎంతో ఇష్టమున్న మహిళలు.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో దూరంగా ఉంటారు. అయితే, నిజంగానే ప్రెగ్నెన్సీ టైమ్‌లో కాఫీ తాగకూడదా ? తాగితే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుందా ? అనే విషయాలపైన ఇటీవలే ఓ అధ్యయనం క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆ రీసెర్చ్ ఏంటీ ? పరిశోధనలో ఆరోగ్య నిపుణులు ఏం కనుగొన్నారు? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
తాజా పరిశోధన.. సైకలాజికల్ మెడిసిన్‌లో (Psychological Medicine), గర్భధారణ సమయంలో కాఫీ తాగడం సురక్షితమని తేలింది. ప్రెగ్నెన్సీ టైమ్‌లో కాఫీ మితంగా తీసుకోవడం వల్ల శిశువు మెదడు అభివృద్ధిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని తేల్చిచెప్పింది. గర్భధారణలో సమయంలో కాఫీ తాగడం వల్ల పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం, గర్భస్రావం వంటివి ఉండవని.. ఆస్ట్రేలియాలోని 'ది యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్'కు చెందిన 'డాక్టర్ గన్-హెలెన్ మోయెన్' వెల్లడించారు.
ఈ అధ్యయనంలో 10వేల కుటుంబాల నుంచి డేటా సేకరించారు. ప్రెగ్నెన్నీకి ముందు, గర్భదారణ సమయంలో కాఫీ వినియోగాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అయితే, గర్భిణులు కాఫీ తాగడం వల్ల పిల్లల మెదడుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. కాగా, గర్భిణులు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లుగానే.. కాఫీని కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల తల్లీబిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది
గర్భిణులకు వాటిని చూస్తేనే వికారం - అప్పుడు ఇలా తీసుకోవాలట!
పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ - డెలివరీ టైమ్‌లోనే చేయిస్తే ఏమవుతుంది?