ETV Bharat / health

బిగ్​ అలర్ట్​: కొద్దిసేపు పనిచేయగానే నీరసం ముంచెత్తుతోందా? కారణం ఇదే కావొచ్చు - చెక్​ చేసుకోండి! - Iron Deficiency Symptoms - IRON DEFICIENCY SYMPTOMS

Iron Deficiency Symptoms : మీరు కొద్ది దూరం నడవగానే అలసిపోతున్నారా ? ఎప్పుడూ గుండెల్లో దడదడగా ఉంటోందా ? అయితే, ఈ లక్షణాల వెనుక ఓ లోపం ఉందని ఆరోగ్య నిపుణులంటున్నారు. మరి ఆ ప్రాబ్లమ్​ ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం..

Iron Deficiency
Anemia Symptoms (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 17, 2024, 5:00 PM IST

Anemia Symptoms : కొద్దిసేపు పని చేయగానే నీరసం ముంచుకొస్తుంది. కాసేపు నడిస్తే ఆయాసం వచ్చేస్తుంది. ఏకాగ్రత కుదరదు. పని మీద శ్రద్ధా ఉండదు. ప్రతిదానికి చిరాకు, కోపం.. వస్తుంటాయి. అయితే ఇలాంటి వాటిని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. సరిగా తినకపోవటం వల్ల వచ్చిన బలహీనతగానో.. రాత్రి నిద్ర పట్టకపోవటం వల్ల తలెత్తిన అలసటగానో భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఈ లక్షణాల వెనుక ఓ లోపం ఉందని ఆరోగ్య నిపుణులంటున్నారు. మరి ఆ ప్రాబ్లమ్​ ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం..

తీవ్రమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడదడగా ఉండటం, ఆందోళన వంటి అన్ని లక్షణాలు రక్తహీనతకు కారణమని నిపుణులు చెబుతున్నారు. దీనినే వైద్య పరిభాషలో 'ఎనిమియా' అని అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే- రక్తంలో ఎర్ర రక్తకణాల మోతాదు తగ్గటం. రక్తంలో ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్‌లెట్లు.. ఇలా మూడు రకాల కణాలుంటాయి. రక్తంలో 40-45 శాతం వరకు ఉండేవి ఎర్ర రక్తకణాలే. ఇవన్నీ ఎముక మజ్జ నుంచే పుట్టుకొస్తాయి. ఎర్ర రక్తకణాలు చేసే ఏకైక పని హిమోగ్లోబిన్‌ అనే ప్రోటీన్‌ను ఆరోగ్యంగా ఉండేలా చూస్తూ, దీన్ని రక్తం ద్వారా వివిధ భాగాలకు చేరవేయటం. ఆక్సిజన్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ వాయువుల మార్పిడిలో హిమోగ్లోబిన్‌ పాత్ర చాలా కీలకం. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను మోసుకెళ్లి, వివిధ అవయవాలకు చేరవేసేది ఇదే. అలాగే ఆయా భాగాల నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ను మోసుకొచ్చి, ఊపిరితిత్తులకు చేరవేస్తుంది కూడా. ఇలా మన ప్రాణాలు నిలవటానికి తోడ్పడుతుంది. ఇంతటి కీలకమైన పనిలో పాలు పంచుకుంటాయి కాబట్టే ఎర్ర రక్తకణాల సంఖ్య ఏమాత్రం తగ్గినా శరీరం జావగారుతుంది. చిన్న చిన్న పనులకే చేతులెత్తేస్తుంది. ఈ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

తరచుగా వచ్చే నీరసాన్ని తగ్గించుకునేందుకు చిట్కాలు..

రక్తహీనత లక్షణాలు:

అలసట : సాధారణంగా రక్తహీనతతో బాధపడేవారిలో అలసట ఎక్కువగా కనిపిస్తుంటుందని నిపుణులు అంటున్నారు. ఎర్ర రక్త కణాలు శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్‌ను అందించలేకపోవడం వల్ల అలసట వస్తుందని నిపుణులంటున్నారు. 2019లో "అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. తీవ్రమైన అలసటతో బాధపడేవారిలో రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటికీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ చెందిన 'డాక్టర్‌ డేవిడ్ డబ్ల్యూ. జాన్సన్' పాల్గొన్నారు. ఇంకా..

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • తలనొప్పి
  • తలతిరగడం
  • కాళ్లు, చేతులు చల్లగా ఉండటం
  • గుండె వేగంగా కొట్టుకోవడం
  • చికాకుగా ఉండటం
  • ఏకాగ్రత లోపించడం
  • నిద్రలేమి
  • దురద
  • విపరీతమైన ఆందోళన
  • ఆకలి లేకపోవడం
  • జుట్టు రాలడం
  • ఛాతీ నొప్పి
  • పెళుసుగా ఉండే గోళ్లు
  • నోటిలో పుండ్లు
  • నాలుక మంట
  • రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల చర్మం పసుపు రంగులోకి మారవచ్చు.
  • ముఖం లేదా కాళ్లలో వాపు
  • ఇలాంటి లక్షణాలు కనిపించిన వారు రక్తపరీక్ష చేసుకోవడం వల్ల ఎనిమియా ఉందా ? లేదా ? అనేది నిర్ధారించుకోవచ్చు.

రక్తహీనతను తగ్గించే ఆహార పదార్థాలు ?

  • తాజా కూరగాయలు ముఖ్యంగా, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఐరన్​ అధికంగా ఉండే మాంసం, పౌల్ట్రీ, చేపలు, బీన్స్, పప్పుధాన్యాలు తినాలని చెబుతున్నారు.
  • ఇంకా డ్రైఫ్రూట్స్‌ను డైట్‌లో భాగం చేసుకోవాలి.
  • అలాగే విటమిన్‌ సి ఎక్కువగా ఉండే కివీ పండ్లు, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, బొప్పాయి, జామపండ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎండు ద్రాక్షతో రక్తహీనత మాయం.. ఎప్పుడు? ఎలా? తినాలో తెలుసా?

బచ్చలితో రక్తహీనతకు చెక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.