Indoor Plants For Home Cooling : ఎండలు మండుతున్నాయి. ఇంట్లో ఉన్నా వేడిని తట్టుకోలేక కూలర్లు, ఏసీలు తెచ్చిపెట్టుకుంటున్నాం. అయితే ఎండవేడి నుంచి మిమ్మల్ని కేవలం ఏసీలు, కూలర్లే కాదు కొన్ని మొక్కలు కూడా కాపాడతాయట. మొక్కలంటే వెళ్లి చెట్టు కింద కూర్చోవాలా అనుకోకండి! మీ ఇంట్లో మీ గదిలోకే మొక్కల్ని తెచ్చుకోవాలి. అవును మీరు వింటున్నది నిజమే. కొన్ని రకాల మొక్కల్ని పెట్టుకోవడం వల్ల మీగది ఉష్ణోగ్రత తగ్గి చల్లగా మారుతుందట. దీంతో పాటు గది వాతావరణాన్ని ప్రశాంతంగా, సౌకర్యవంతంగా మార్చే శక్తి కొన్ని మొక్కలకు ఉంటుందట. ఆ మొక్కలేంటి? వాటి కథేంటీ చూసేద్దామా మరి!
కలబంద
కలబందను నేచురల్ కూలింగ్ జెల్గా చెబుతుంటారు. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్క. అయితే ఇది సహజమైన ఎయిర్ కూలర్‌గా కూడా పనిచేస్తుందట. ఈ మొక్క రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేసి కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి పడకగది వాతావరణాన్ని చల్లగా మార్చేందుకు సహాయపడుతుందట.
స్నేక్ ప్లాంట్
స్నేక్ ప్లాంట్‌ను అత్తగారి నాలుక అని కూడా పిలుస్తారట. చాలా స్టైలిష్‌గా కూల్‌గా ఉండే ఈ మొక్క గాలిని శుద్ధి చేసే లక్షణాలకు ప్రసిద్ధి గాంచిది. గది వాతావరణాన్ని చల్లగా మార్చేందుకు ఈ మొక్క చాలా బాగా సహాయపడుతుందట. కలబంద మాదిరిగానే రాత్రి పూట కార్బన్ డయాక్సైడ్ను గ్రహించే ప్రక్రియలో వాతావరణాన్ని ఇది చల్లగా మారుస్తుంది.
పీస్ లిల్లీ
తెల్లటి పువ్వులు కలిగిన అద్బుతమైన మొక్క పీస్ లిల్లీ. ఇది ఇంట్లోని వాతావరణాన్ని ఆకర్షణీయంగా మార్చి గాలిని చల్లబరచడానికి బాగా సహాయపడుతుంది. ఈ మొక్క తన ఆకుల ద్వారా తేమను వదిలి గదిలో శీతలీకరణ వాతావరణాన్ని పెంచుతుంది. గాలి నుంచి విడుదలయ్యే హానికరమైన టాక్సిన్లను తొలగించే సామర్థ్యం కలిగి ఉన్న పీస్ లిల్లీను ఇంట్లో, ఆఫీసులో పెట్టుకోవచ్చు.
స్పైడర్ ప్లాంట్
స్పైడర్ ప్లాంట్ గాలిని శుద్ధి చేసి సౌకర్యవంతంగా మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే ఇది ఇండోర్ ప్రాంతాలను చల్లబరచడంలోనే మంచి పాత్ర పోషిస్తుందట. ట్రాన్స్పిరేషర్ ద్వారా ఇది గాలిలోకి తేమను విడుదల చేసి గది ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.
బోస్టన్ ఫెర్న్
ఆకులు, ఈకలతో కూడిన బోస్టన్ ఫెర్న్ మొక్కలు తేమను వృద్ది చెందేలా చేస్తాయి. అలా గది ఉష్ణోగ్రతను చక్కగా చల్లబరుస్తాయి. మీ గదిలో లేదా బెడ్‌రూమ్‌లో బోస్టన్ ఫెర్న్‌ను ఉంచడం వల్ల వేసవి వేడి నుంచి రిఫ్రెష్ అవచ్చు.
అరేకా పామ్
అరేకా పామ్‌ను సీతాకోకచిలుక పామ్ అని కూడా పిలుస్తారు. ఇంట్లోని వాతావరణానికి ఇది ఉష్టమండల స్పర్శను కలిగిస్తుంది. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండే ఈ మొక్క శీతలీకరణ ప్రభావాలు అధికంగా కలిగి ఉంటుంది. గాలిని శుద్ధి చేసి హ్యూమిడిఫైయర్ మాదిరిగానే గదిలో సహజ శీతలీకరణ ప్రభావాన్ని పెంపొందిస్తుంది.
గసగసాలు ఆరోగ్యానికి మంచివేనా? నిపుణులు ఏం చెబుతున్నారు? - Poppy Seeds Health Benefits