ETV Bharat / health

ఈ ఫేషియల్​తో - బ్యూటీ పార్లర్​కు వెళ్లకుండానే ఫేస్​లో గ్లో! మీరూ ట్రై చేస్తారా? - Ice Facial Benefits - ICE FACIAL BENEFITS

Ice Facial: అందంగా కనిపించాలని చాలా మంది ఫేషియల్స్​ చేయించుకుంటుంటారు. ఇక ఫేషియల్స్​ అంటే బ్యూటీ పార్లర్​కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడావసరం లేకుండా పార్లర్​లాంటి మెరుపునిచ్చే ఫేషియల్​ ఒకటి ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Ice Facial Benefits
How to Do Ice Facial at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 4:40 PM IST

Ice Facial Benefits and How to Do It: పార్టీ.. ఫంక్షన్​.. మ్యారేజ్​.. ఇలా అకేషన్​ ఏదైనా అందంగా కనిపించాలని చాలా మంది అనుకుంటారు. ఈ క్రమంలోనే బ్యూటీపార్లర్​కు వెళ్లి వేలు ఖర్చు పెట్టి ఫేషియల్​ చేయించుకుంటారు. అయితే ఇప్పుడు బ్యూటీ పార్లర్​తో అవసరం లేకుండానే పార్లర్​లాంటి మెరుపునిచ్చే ఫేషియల్​ ఒకటి ఉంది. అది కూడా ఇంట్లో లభించే ఒకే ఒక్క పదార్థంతో చేసుకోవచ్చు. ఇంతకీ ఆ ఫేషియల్​ ఏంటి? ఎలా చేసుకోవాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

క్రయోథెరపీ: పార్లర్​ వెళ్లకుండానే ఇంట్లోనే చేసుకునే ఫేషియల్​ "ఐస్​ ఫేషియల్​". దీనినే వైద్య పరిభాషలో క్రయోథెరపీగా చెప్తారు. ఐస్​ లేదా కోల్డ్ క్రంపెస్​లను ఉపయోగించి.. ముఖంపై అప్లై చేసుకోవాలి. ఈ ఫేషియల్​ మంచి ప్రయోజనాలు ఇవ్వడమే కాకుండా వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇక ప్రయోజనాలు చూస్తే..

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది: చల్లని ఉష్ణోగ్రత వల్ల చర్మంలోని రక్తనాళాలు సంకోచం చెంది విస్తరిస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది చర్మానికి ఆక్సిజన్, పోషకాల సరఫరాను పెంచుతుంది. దీనివల్ల స్కిన్ టోన్​ కూడా మెరుగవుతుంది.

కళ్ల వాపు తగ్గుదల: చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ముఖం, కళ్లు ఉబ్బిపోతుంటాయి. అలాంటి సమయంలో ఈ ఐస్​ ఫేషియల్​ చేస్తే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. దీని వల్ల కళ్ల వాపు తగ్గిపోతాయని, డార్క్​ సర్కిల్స్​ కూడా తగ్గుతాయని అంటున్నారు. అలాగే చర్మం చాలా హెల్దీగా ఉంటుందని.. పైగా ఉదయం దీనిని చేయడం వల్ల నిద్ర మత్తు నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.

సమ్మర్‌లో క్యారెట్‌ ఫేస్‌ప్యాక్స్ - ఇవి ట్రై చేశారంటే ముఖం తళతళా మెరిసిపోద్ది! - summer beauty tips

మొటిమల సమస్యలు ఉంటే: మొటిమలతో ఇబ్బంది పడేవారు కచ్చితంగా దీనిని ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. మొటిమల వల్ల కలిగే వాపుని, రెడ్​నెస్​ను తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుందని అంటున్నారు. దీనివల్ల మొటిమలు చాలా సులభంగా తగ్గుతాయని.. అంతేకాకుండా చర్మంలో ఆయిల్​ విడుదల కావడం తగ్గుతందని అంటున్నారు. అలాగే ఓపెన్ పోర్స్​ నుంచి కూడా ఉపశమనం అందుతుందని చెబుతున్నారు.

2016 లో "జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ"లో ప్రచురితమైన ఐస్ ఫేషియల్‌లు మొటిమలను తగ్గించడంలో, అలాగే మొటిమల వల్ల వచ్చే వాపును తగ్గించడంలో కూడా సహాయపడతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్​లో చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ జాన్ స్మిత్, MD పాల్గొన్నారు. ఐస్​ ఫేషియల్​ రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుందని.. మొటిమల వాపును తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

గుడ్డు పెంకులతో సౌందర్యం - అలా చేస్తే ముఖంలో కొత్త మెరుపు!

ఐస్​ ఫేషియల్​ ఎలా చేసుకోవాలంటే:

  • ఐస్ ఫేషియల్ చేసుకోవాలనుకుంటే ముఖంపై మేకప్​ ఉంటే క్లీన్ చేసుకోవాలి. తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.
  • అనంతరం ఐస్​ క్యూబ్స్​ తీసుకోవాలి. అయితే ఈ క్యూబ్స్​ను డైరక్ట్​గా ఫేస్​పై పెట్టుకుండా.. ఓ కాటన్ క్లాత్​లో వేసి ముఖంపై మసాజ్ చేయాలి. వీటిని మెల్లగా రౌండ్​ షేప్​లో కదిలిస్తూ మసాజ్ చేయాలి. లేదంటే కోల్ట్ ఫేషియల్ రోలర్​ని ఉపయోగించవచ్చు.
  • కంటి కింద, మొటిమలు ఉన్న ప్రాంతాలపై మరింత శ్రద్ధ తీసుకోవాలి.
  • అయితే ఈ ఫేషియల్​ను ఒకటి నుంచి రెండు నిమిషాలు మాత్రమే చేయాలి. లేదంటే స్కిన్ ఇరిటేషన్ వచ్చే అవకాశముంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నిద్రపోయేప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? జాగ్రత్త- మొటిమల సమస్య అధికమవుతుంది!

ఫస్ట్​టైమ్​ మేకప్​ ట్రై చేస్తున్నారా? ఈ టిప్స్​ పాటించండి - సూపర్ బ్యూటీ మీ సొంతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.