Health Benefits of Bitter Gourd : రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. రాత్రి వేళ్లలోనూ వేడి తగ్గడం లేదు. ఉదయం 10 దాటక ముందే ఎండ మంట మొదలవుతోంది. ఈ క్రమంలో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడం కోసం, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి చాలా మంది కొబ్బరినీళ్లు, మజ్జిగ, చెరుకురసం, నిమ్మరసం వంటివి తీసుకుంటుంటారు. మరికొందరు రకరకాల హైడ్రేటింగ్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే, ఇవి మాత్రమే కాదు.. సమ్మర్లో కాకరకాయను(Bitter Gourd) తినడం ద్వారా కూడా బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చని మీకు తెలుసా? అంతేకాదు.. వేసవిలో కాకరకాయను తినడం వల్ల ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోషకాలు పుష్కలం : కాకరకాయ రుచికి చేదుగా ఉన్నప్పటికీ దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, జింక్, కొవ్వు, పీచు, ఐరన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
హైడ్రేట్‌గా ఉంచుతుంది : కాకరకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమ్మర్లో దీనిని తీసుకోవడం వల్ల బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బాడీని హైడ్రేట్‌గా ఉంచి రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి వేసవిలో కాకరకాయను తినడం వల్ల బాడీ ఉష్ణోగ్రతను కంట్రోల్లో ఉంచుకోవడమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.
2013లో 'న్యూట్రిషన్ రివ్యూస్' అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. కాకరకాయలో సుమారు 96శాతం వాటర్ కంటెంట్ ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే సమ్మర్లో దీనిని తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లగా, హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాకు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్. జె.ఎం. డిమన్ పాల్గొన్నారు. వేసవిలో కాకరకాయ బాడీని హైడ్రేట్‌గా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
బరువు కంట్రోల్ : సమ్మర్లో కాకరకాయను మీ డైట్లో చేర్చుకోవడం ద్వారా బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనిలో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా కాకరలో ఉండే ఫైబర్ కంటెంట్ అతిగా తినాలనే కోరికలను తగ్గిస్తుందంటున్నారు.
బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ : కాకరకాయ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, ముఖ్యంగా మధుమేహం ఉన్న వ్యక్తులు దీనిని తమ డైట్లో చేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది : కాకరలోని యాంటీమైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అలాగే పేగుల్లో చేరిన మలినాలను తొలగిస్తాయి. అదేవిధంగా దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు జీవప్రక్రియ సమయంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్‌ను, ఇతర ప్రమాదకర సమ్మేళనాలను ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ లేకుండా నాశనం చేస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది : సమ్మర్లో కాకరకాయను తినడం వల్ల అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడమే కాకుండా UV రేడియేషన్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. అంతేకాకుండా కాకరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు.
జీర్ణవ్యవస్థకు మేలు : కాకరకాయ జీర్ణక్రియలో చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని పోషకాలు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతాయంటున్నారు. అంతేకాకుండా.. కాలేయాన్ని శుభ్రపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ - ఇవి తాగితే ఎండ వేడిమి, డీహైడ్రేషన్ మీ దరిచేరవు! ప్రిపరేషన్ వెరీ ఈజీ!