ETV Bharat / health

అల్లం త్వరగా పాడవుతుందా? - ఇలా స్టోర్ చేసుకుంటే చాలా కాలం ఫ్రెష్​గా ఉండడం పక్కా! - How to Store Ginger for A Long Time

Ginger Storage Tips : అల్లం.. వంటలకు రుచితో పాటు స్పైసీ సువాసనను ఇస్తోంది. అలాగే ఆరోగ్యపరంగాను ఎన్నో ప్రయోజనాలు అందిస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల అల్లం త్వరగా ఎండిపోయి పాడైపోతుంది. దీంతో చాలా మంది.. ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్​గా ఉంటుందని తెగ సెర్చ్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం అదిరిపోయే టిప్స్ తీసుకోచ్చాం. అవేంటంటే..

Ginger Storage Tips
Ginger Storage Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 4:47 PM IST

Best Ways to Storage Ginger : ప్రతి ఒక్కరి వంటగదిలో అల్లం తప్పనిసరిగా ఉంటుంది. దీనిని డైలీ వివిధ వంటకాల్లో యూజ్ చేస్తుంటాం కూడా. ఇక మాంసాహారం వంటల్లో అయితే అల్లం కచ్చితంగా ఉండాల్సిందే. ఇది లేని వంటకాలను అసలు ఊహించుకోలేరు. అదే విధంగా అల్లం(Ginger)లో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, దీని ధర మార్కెట్​లో మిగతా మసాలా దినుసుల కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఇది అధిక వేడి కారణంగా త్వరగా పాడైపోవడం లేదా ఎండిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది అల్లాన్ని ఎక్కువ కాలం ఎలా స్టోర్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. అలాంటి వారు ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే జింజర్​ను చాలా కాలం ఎండిపోకుండా ఫ్రెష్​గా స్టోర్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఫ్రెష్ అల్లం కొనండి : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే అల్లం కొనుగోలు చేసేటప్పుడు సరిగ్గా చూడకుండా కొనేస్తుంటారు. అయితే, అల్లం త్వరగా పాడైపోకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన మొదటి పని జింజర్ కొనుగోలు చేసేటప్పుడు ఫ్రెష్​గా ఉండే అల్లాన్ని ఎంచుకోవాలి. అంటే గట్టిగా, మందంగా, లేతగా ఉండే దాన్ని కొనుగోలు చేయాలంటున్నారు నిపుణులు. అంతేకానీ, మెత్తగా, రంధ్రాలున్న, ముడతలు పడిన అల్లాన్ని తీసుకోవద్దని చెబుతున్నారు. ఎందుకంటే అది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుందంటున్నారు.

అల్లంపై పొట్టు తీయవద్దు : అల్లం ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉండాలంటే మీరు చేయాల్సిన మరో పని.. అల్లం తెచ్చాక దానిపై పొట్టు తీయకుండా ఉండడం. అంటే అవసరానికి కావాల్సిన దాన్ని పొట్టు తీసి వాడుకోవాలి. మిగతా దాన్ని పొట్టు తీయకుండా ఉంచుకోవాలి. పైపొట్టు అల్లానికి రక్షణగా ఉంటూ ఎక్కువకాలం పాడవకుండా కాపాడుతుందని చెబుతున్నారు నిపుణులు.

పరగడుపున అల్లం వాటర్​ తాగితే - ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్!

ఫ్రిజ్​లో స్టోర్ చేయడం : మీరు అల్లాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి మరొక సులభమైన మార్గం.. రిఫ్రిజిరేటర్​లో స్టోర్ చేయడం. ఇలా స్టోర్ చేసే ముందు అల్లాన్ని పొట్టు తీయకుండా లేదా తీసి నిల్వ చేసుకోవచ్చు. ఒకవేళ పొట్టు తీసి స్టోర్ చేసుకోవాలంటే ముందుగా జింజర్​ను తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లాస్టిక్ బ్యాగ్ లేదా గాలి పోని కంటైనర్​లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. బ్యాగ్​ను క్లోజ్ చేసే ముందు దాంట్లో గాలి లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది తేమ పెరగకుండా నిరోధిస్తుంది.

ముక్కలు గట్టిగా చేసి స్టోర్ చేసుకోవడం : మీరు అల్లాన్ని ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవడాని ఈ ప్రాసెస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా అల్లాన్ని పొట్టు తీసి ముక్కలుగా చేసి లైనింగ్ బేకింగ్ షీట్లో ఉంచాలి. ఆపై ముక్కలు గట్టిగా ఉండే వరకు ఫ్రీజర్​లో ఉంచాలి. ఆ తర్వాత వాటిని తీసి గాలి పోని కంటైనర్​కు మార్చుకొని రిఫ్రిజిరేటర్​లో స్టోర్ చేసుకోవాలి. ఇవేకాకుండా అల్లం ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే దాన్ని ఎప్పుడూ ఎక్కువ వేడి ఉన్న ప్రదేశం ఉంచకుండా చూసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అదే విధంగా అల్లాన్ని శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టి దాన్ని పొడిలా చేసుకోవడం ద్వారా కూడా ఎక్కువకాలం దాన్ని వంటలలో యూజ్ చేయవచ్చంటున్నారు. మరి చూశారుగా.. మీకు కూడా ఈ టిప్స్​ నచ్చితే ఫాలో అయ్యి అల్లాన్ని ఫ్రెష్​గా ఉంచుకోండి..

అల్లంతో క్యాన్సర్​కు విరుగుడు! రోజూ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.