ETV Bharat / health

కుక్క కరిస్తే శరీరంలో ఏం జరుగుతుంది? - రేబిస్ రాకుండా ఏం చేయాలి?? - How To Stop Rabies

How To Stop Rabies Disease : కుక్క కరిచినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ప్రాణాంతకమైన రేబిస్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. కుక్క కరిచినప్పుడు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది ఈ స్టోరీలో చూద్దాం.

Rabies Disease
How To Stop Rabies Disease (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 12:48 PM IST

How To Stop Rabies Disease : కుక్క ఎంత విశ్వాసం గల జంతువో.. పొరపాటున దాని కాటుకు గురైతే అంత ప్రమాదకరంగా కూడా పరిణమించే అవకాశం ఉంటుంది. టీకాలు వేయించని కుక్కలు కరిస్తే.. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. రేబిస్‌ వ్యాధి బారిన పడి చనిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల రేబిస్ వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చని చెబుతున్నారు. మరి.. కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి? రేబిస్‌ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రేబిస్‌ వ్యాధి రావడానికి 'రేబిస్' అనే వైరస్‌ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్‌ కుక్క చొంగలో ఉంటుంది. టీకాలు వేయించిన కుక్కలకు ఇది సోకదు. ఈ వైరస్‌ ఉన్న కుక్కలు.. మనుషులను కరిచినా, శరీరం మీద గాయాలున్న చోట నాకినా, దాని చొంగ ద్వారా వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తుందట.

మీకు తెలుసా? - మీ మనసు ఎంత బాధపడితే - మీ సెకండ్ బ్రెయిన్ అంత ఏడుస్తుంది! - Gut Health Damage Foods

కుక్క కరిచినప్పుడు ఇలా చేయండి :

  • కుక్క మనుషుల శరీరాన్ని పుండ్లు పగుళ్లు వంటివేవీ లేనిచోట నాకినప్పుడు పెద్దగా భయపడాల్సిన పనిలేదని నిపుణులంటున్నారు. ఆ ప్రాంతాన్ని శుభ్రంగా నీటితో కడుక్కోవాలని సూచిస్తున్నారు.
  • ఒకవేళ కుక్క కరిస్తే.. వీలైనంత త్వరగా గాయాన్ని ధారగా పడుతున్న నీటి కింద పెట్టి 10-15 నిమిషాల సేపు సబ్బుతో శుభ్రంగా కడగాలి.
  • అలాగే గాయాన్ని నేరుగా చేత్తో తాకకూడదు.
  • గ్లౌజులు వేసుకుని కడుక్కుంటే మంచిది.
  • తర్వాత గాయాన్ని పొడిగా తుడిచి, యాంటిసెప్టిక్‌ లోషన్లు రాసి వదిలెయ్యాలి. ఇలా చేసిన తర్వాత వైద్యుడిని సంప్రదించి.. యాంటీ రేబిస్‌ టీకాలు తీసుకోవాలి.

రేబిస్‌ వ్యాధి ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ?

  • కుక్క కరిచిన 7 నుంచి 10 రోజుల్లో రేబిస్‌ వ్యాధి లక్షణాలను గుర్తించవచ్చు.
  • బాధితులు చాలా అలసటగా ఉండి ఏమి తినకుండా ఉంటారు. అలాగే జ్వరం, తలనొప్పి, కండారాల నొప్పులతో బాధపడతారు.
  • 2002లో 'క్లినికల్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్' జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. రేబిస్‌ వ్యాధి ఉన్న వారిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపించాయని పరిశోధకులు గుర్తించారు.
  • రేబిస్‌ వ్యాధి ఉన్నవారికి తీవ్రమైన తలనొప్పి, కండారాల నొప్పులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డాక్టర్‌ శివరాజు (జనరల్ ఫిజీషియన్‌) చెబుతున్నారు.
  • కుక్క కరిచిన దగ్గర మంట, దురద, జలధరింపులు, నొప్పి లేదా తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • అలాగే నీళ్లంటే భయపడతారు.
  • వీరిలో దగ్గు, మతిమరుపు, గొంతు మంట, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ ముఖం ముద్ద మందారంలా మెరిసిపోవాలంటే - రాత్రి వేళ ఇలా చేయండి! - How to Cleanse Face Every Night

యువకులు స్మోకింగ్​కు ఎందుకు అలవాటు పడతారు? - దాన్ని ఎలా అడ్డుకోవాలి? - Causes of Nicotine Addiction

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.