How To Remove Humidity From Room Cooler : చాలా మంది జనాలు ఎండాకాలంలో వేడి, ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి ఏసీలు, కూలర్లు వినియోగిస్తారు. ఏసీ ఉన్నవారికి పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ.. కూలర్లు వాడే వారికి మాత్రం సమస్య కంటిన్యూ అవుతుంది. ఎండవేడి ఎక్కువగా ఉన్నప్పుడు రూమ్ టెంపరేచర్ కూల్ కాదు. గది మొత్తం తేమ నిండిపోయి ఉక్కపోతగా ఉంటుంది. సన్న చెమట పడుతూ.. ఒళ్లంతా జిడ్డుగా ఉంటుంది. దీనికి కారణం.. గదిలోని తేమ మొత్తం బయటకు వెళ్లకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న తప్పులే ఈ పరిస్థితిని తీసుకొస్తాయని అంటున్నారు. అందుకే.. వాటర్ కూలర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఈ తప్పులు చేయకూడదని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కూలర్‌ను కిటికీ దగ్గర పెట్టండి :
మెజార్టీ ప్రజలు కూలర్‌ను గదిలోనే ఏదో ఒక చోట పెడుతుంటారు. అయితే.. ఇలా రూమ్‌లో పెట్టడం వల్ల గది మొత్తం తేమ నిండిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు కూలర్ గాలి వల్ల శరీరం చల్లబడడానికి బదులు.. చెమట జిడ్డుతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి.. రూమ్ కూల్‌గా ఉండాలంటే కూలర్‌ను కిటికీల దగ్గర లేదా గది బయట పెట్టాలని సూచిస్తున్నారు.
వాటర్ పంపుని ఆఫ్ చేయండి :
ఒకవేళ మీరు కూలర్‌ను గది బయట లేదా కిటికీ దగ్గర పెట్టే అవకాశం లేకపోతే.. గది మొత్తం తేమ నిండిపోయినప్పుడు, వాటర్ పంపును ఆఫ్ చేయండి. ఇలా కొద్దిసేపు పంపును ఆఫ్ చేసి కేవలం ఫ్యాన్‌ను మాత్రమే ఆన్ చేయండి. ఈ చిట్కా పాటించడం వల్ల గదిలో తేమను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తర్వాత వాటర్ పంప్ ఆన్ చేసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు.
సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేయండి :
కొంత మంది కూలర్ ఆన్‌లో ఉన్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ ఆఫ్ చేస్తుంటారు. అయితే, ఇలా చేయకూడదట. రెండూ ఆన్‌లో ఉండటం వల్ల గదిలోని నుంచి తేమ మొత్తం బయటకు వెళ్లిపోయి రూమ్ చల్లగా ఉంటుంది. అలాగే కిటికీలను తెరిచి ఉంచాలని సూచిస్తున్నారు.
ఎగ్జాస్ట్ ఫ్యాన్ :
మీ రూమ్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే దానిని ఆన్ చేసి ఉంచండి. ఒకవేళ మీ రూమ్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకపోతే అటాచ్డ్ బాత్‌రూమ్‌లో ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రూమ్ కూల్‌గా ఉంటుంది.
కూలర్ స్పీడ్ :
కూలర్ స్పీడ్ ఎప్పుడూ కూడా మీడియమ్ నుంచి హై స్పీడ్ మధ్యలో ఉండేలా చూసుకోండి. ఇలా స్పీడ్ మెయింటెన్ చేయడం వల్ల గది కూల్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వాల్నట్స్ ఎందుకు నానబెట్టి తినాలి? - లేకపోతే ఏమవుతుంది? - Soaked Walnuts Health Benefits