ETV Bharat / health

ఒత్తిడితో సతమతమవుతున్నారా? - "గులాబీ టీ" తాగితే ఇట్టే తగ్గుతుందట- పైగా వెయిట్​ లాస్​ అవ్వొచ్చట! - ROSE TEA HEALTH BENEFITS IN TELUGU

-ఒత్తిడి తగ్గడానికి జీవనశైలి, అలవాట్లలో మార్పులు అవసరం -హెర్బల్​ టీలతో ఎంతో మేలు!

How to Make Rose Tea at Home
How to Make Rose Tea at Home (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Dec 8, 2024, 12:40 PM IST

Rose Tea Health Benefits in Telugu: ఉద్యోగం, వ్యాపారం, ఉన్నత చదువులు ఇలా ఏ పనిలో రాణిస్తున్నా మనిషికి కాస్త ఒత్తిడి కలుగుతుంది. టెన్షన్​ లేకుండా దాదాపు ఏ పనీ ఉండదు. అయితే, ఇది తీవ్రమైతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు గులాబీరేకల టీ తాగితే ఉపశమనం పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఒక్క టీ తాగితే టెన్షన్​లన్నీ తొలగిపోయే మనసు హాయిగా మారిపోతుందట.

గులాబీరేకలలో విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ సి, ఫినోలిక్ సమ్మేళనాలు, కెరోటినాయిడ్స్, టోకోఫెరోల్, బయోఫ్లేవనాయిడ్స్, టానిన్లు, పెక్టిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయని అంటున్నారు. ఇదే విషయాన్ని నేషనల్​ లైబ్రరీ ఆఫ్​ మెడిసిన్​ నిపుణుల బృందం కూడా వెల్లడించింది. (రిపోర్ట్​ కోసం ఈ లింక్​ క్లిక్​ చేయండి.) మరి ఇంట్లో ఉండే పదార్థాలతో కమ్మగా గులాబీరేకల టీ ఎలా తయారు చేయాలి ? దాని తయారీకి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు :

  • మూడు కప్పుల పాలు
  • మూడు స్పూన్ల చొప్పున -టీపొడి, చక్కెర
  • మూడు యాలకులు
  • ఒక అనాసపువ్వు
  • జీడిపప్పు-10
  • బాదంపప్పు-10
  • రెండు టేబుల్‌స్పూన్లు -నీటిలో నానబెట్టి చేసిన గులాబీరేకల పేస్టు
  • రెండు కప్పుల నీరు

తయారీ విధానం :

  • ముందుగా మిక్సీ గిన్నెలోకి నీటిలో నానబెట్టిన జీడిపప్పు, బాదంపప్పు వేసి మెత్తగా పేస్ట్​ చేసుకోవాలి. (ఇది టీ కోసం పావుకప్పు తీసుకోవాలి.)
  • ఇప్పుడు స్టౌపై పాత్ర పెట్టి అందులో రెండు కప్పుల నీటిని వేడి చేయండి.
  • దీనిలో టీపొడి, గులాబీరేకల పేస్టు, అనాసపువ్వు, యాలకులు వేసి చిక్కగా బాగా మరిగించండి.
  • ఈ డికాక్షన్ వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోండి.
  • ఇప్పుడు మరొక పాత్రలో పాలు, చక్కెర వేసి మరగబెట్టండి.
  • పాలు మరిగేటప్పుడు, దీనిలో బాదం, జీడిపప్పుల పేస్టు పావుకప్పు వేసి బాగా కలపండి.
  • పాలు మరిగిన తర్వాత, అందులో ముందుగా తయారు చేసిన డికాక్షన్‌ను వేసి కలపండి.
  • అయిదు నిమిషాలు మరగించిన తర్వాత.. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
  • ఘుమఘుమలాడే కమ్మటి గులాబీ ఛాయ్​ మీ ముందుంటుంది.

గులాబీ టీతో ఇతర లాభాలు :

  • గులాబీరేకల్లో యాంటీఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయంటున్నారు.
  • అలాగే వీటిలోని ఎ,సి విటమిన్లు వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయని వివరిస్తున్నారు.
  • వీటిలోని ఫ్లేవనాయిడ్స్‌ నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయని.. ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసి ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తాయంటున్నారు
  • రోజూ ఒకటి లేదా రెండు కప్పుల రోజ్‌ టీ తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడి బరువును అదుపు చేయడానికి సాయపడుతుందట.
  • గులాబీ టీ మన శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. అలాగే అధిక కొవ్వును తగ్గించడంలో సాయపడుతుంది. ఇంకా హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.
  • గులాబీ టీలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు అదుపులో ఉంటుందని అంటున్నారు.
  • రోజ్‌ టీలో విటమిన్లు, ఫైబర్‌లు ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపుని నిండుగా ఉన్నట్లు భావన కలిగిస్తాయి. ఇంకా జంక్‌పుడ్స్‌, ఆయిల్‌ఫుడ్స్‌ తినాలనే ఆలోచనలను తగ్గిస్తాయి. వీటికి దూరంగా ఉండటం వల్ల బరువు తగ్గచ్చని నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

బీపీతో ఇబ్బంది పడుతున్నవారు - ఈ హెర్బల్​ టీ తాగితే మంచిదట!

మీరు ఎప్పుడైనా ఎల్లో టీ తాగారా? - ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఈసారి మిస్​ అవ్వరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.