ETV Bharat / health

సూపర్​ ఐడియా : వర్షాకాలంలో ఇల్లంతా బ్యాడ్​ స్మెల్​ వస్తోందా ? ఇంట్లోనే రూమ్​ ఫ్రెష్​నర్స్ రెడీ చేసి స్ప్రే చేసేయండి!​ - Room Fresheners Making

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 29, 2024, 1:47 PM IST

How To Make Room Fresheners : వర్షాకాలంలో ఇల్లంతా ఒక రకమైనటువంటి దుర్వాసన వస్తుంటుంది. అయితే, చాలా మంది సువాసనలు రావడానికి రూమ్​ ఫ్రెష్​నర్స్​​ వాడుతుంటారు. కానీ, ఇవి ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే నాచురల్​గా రూమ్​ ఫ్రెష్​నర్స్​ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Room Fresheners
How To Make Room Fresheners (ETV Bharat)

How To Make Room Fresheners At Home : ఇంట్లోకి గాలి సరిగ్గా ప్రసరించకపోవడం, ఇల్లు క్లీనింగ్​ లేకపోవడం వంటి కారణాల వల్ల అప్పుడప్పుడూ ఇంట్లో నుంచి బ్యాడ్ స్మెల్​ వస్తుంటుంది. అలాగే వర్షాకాలంలో ఇంట్లో దుస్తులు ఆరేసుకోవడం వల్ల లేదా ఇతర కారణాలతో కూడా ఇల్లంతా దుర్వాసనతో నిండిపోతుంది. అయితే, మెజార్టీ జనాలు చెడు వాసనలను తొలగించడానికి మార్కెట్​లో దొరికే ఖరీదైనా రూమ్​ ఫ్రెష్​నర్స్​ వాడుతుంటారు. వీటిని వివిధ కెమికల్స్​తో తయారు చేస్తారు. కాబట్టి, తరచుగా రూమ్​ ఫ్రెష్​నర్స్ వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇంట్లోనే కొన్ని పదార్థాలను యూజ్​ చేసి రూమ్​ ఫ్రెష్​నర్స్​ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఎసెన్షియల్ ఆయిల్స్​తో : గులాబీ, లావెండర్, లెమన్ గ్రాస్, టీ ట్రీ వంటి అనేక రకాల సువాసనలను వెదజల్లే ఎసెన్షియల్ ఆయిల్స్​ ఇప్పుడు మార్కెట్​లో లభిస్తున్నాయి. ఇందులో మీకు ఏ సువాసన ఇష్టమైతే దానిని ఎంపిక చేసుకుని.. స్ప్రే బాటిల్​లో నీళ్లు పోసి.. కొన్ని చుక్కల ఆయిల్​ని కలపండి. వాటర్​ నుంచి మంచి సువాసన వచ్చినప్పుడు ఇంట్లో స్ప్రే చేసుకుంటే సరిపోతుంది.

నిమ్మ, నారింజ తొక్కలతో : ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీళ్లను పోసి.. నిమ్మ, నారింజ తొక్కలు, పుదీనా ఆకులు వేసి మరిగించాలి. బాగా మరిగించిన తర్వాత ఆ నీటిని చల్లార్చి.. వడకట్టి స్ప్రే బాటిల్​లో పోసుకోవాలి. తర్వాత ఇల్లంతా స్ప్రే చేస్తే సరిపోతుంది. నాచురల్​గా ఇలా బ్యాడ్​ స్మెల్​ని దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గులాబీలతో : గులాబీల వాసనంటే అందరికీ ఇష్టం. అయితే, ఈ సువాసన వచ్చే రూమ్​ ఫ్రెష్​నర్​ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కప్పు నీటిలో గులాబీ రేకులను, బేకింగ్​ సోడా వేసి కొద్దిగా వేడి చేయండి. తర్వాత ఈ నీటిని వడకట్టి స్ప్రే బాటిల్​లో పోసుకోండి. రూమ్​లో నుంచి దుర్వాసన వచ్చినప్పుడు స్ప్రే చేస్తే సరిపోతుంది.

లెమన్​ ఎసెన్షియల్ ఆయిల్​ : వాటర్​లో కొద్దిగా లెమన్ ఎసెన్షియల్ నూనె, పెప్పర్​మింట్​ ఆయిల్​ వేసుకుని కూడా మరిగించుకోవచ్చు. దీనిని స్ప్రే బాటిల్​లో పోసుకుని వాడుకోవచ్చు.

కర్పూరంతో : ఒక గిన్నెలో కొన్ని వాటర్​ పోసి అందులో కర్పూరం వేసి ఓ మూలకు ఉంచండి. ఇల్లంతా మంచి స్మెల్​తో నిండిపోతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి దోమలు రాకుండా మరొక ఉపయోగం కూడా ఉంది.

క్యాండిల్స్ వెలిగించండి! ప్రస్తుతం మార్కెట్​లో వివిధ రకాల డిజైన్లు, మోడళ్లలో ఉన్న సెంటెడ్ క్యాండిల్స్ విరివిగా దొరుకుతున్నాయి. వీటిని ఇంట్లో వెలిగించినా కూడా చెడు వాసనలు పోతాయి.

ఇవి కూడా చదవండి :

పనికిరానివని పడేస్తున్నారా? ఇవి బాత్రూంలో పెడితే ఎప్పుడూ సువాసనే!

సూపర్​ న్యూస్​: వర్షాకాలంలో జలుబు, తుమ్ములు తగ్గాలంటే - ఈ టిప్స్​ పాటించండి!

ఫ్రిడ్జ్‌ డోర్‌ ఓపెన్ చేయగానే దుర్వాసన వస్తోందా ? ఈ టిప్స్​ పాటిస్తే క్లీన్​ అండ్​ ఫ్రెష్​ పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.