ETV Bharat / health

జీడిపప్పు కొంటున్నారా ? నకిలీని ఇలా గుర్తుపట్టండి! - Fake Cashews in telugu

How To Identify Fake Cashews : డ్రై ఫ్రూట్స్‌ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బాదం, జీడిపప్పు. వీటిని రోజూ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతారు. అయితే.. క్వాలిటీవి తినడం చాలా అవసరం. మార్కెట్లో విచ్చలవిడిగా నకిలీ జీడిప్పు అమ్ముతున్నారు. మరి.. నాణ్యమైనది ఎలా గుర్తించాలో తెలుసా?

How To Identify Fake Cashews
How To Identify Fake Cashews
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 10:15 AM IST

How To Identify Fake Cashews : జీడిపప్పు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మనకు తెలిసిందే. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, మార్కెట్లో వీటికి ఉన్న డిమాండ్‌ను చూసి కొంత మంది వ్యాపారులు నకిలీ జీడిపప్పును విక్రయిస్తున్నారు. కాబట్టి, మనం జీడిపప్పు కొనేటప్పుడు మంచి నాణ్యమైనది కొనుగోలు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫేక్‌ జీడిపప్పును ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తెల్లగా ఉంటేనే..
అసలైన జీడిపప్పు తెల్లగా ఉంటుంది. మనం మార్కెట్లో జీడిప్పును కొనేటప్పుడు అది కాస్త పసుపు రంగులో ఉంటే అది నకిలీదని గుర్తించాలి. అలాగే జీడిపప్పుపై మచ్చలు, నలుపుగా, రంధ్రాలు ఉంటే కూడా వాటిని కొనకూడదు. అవి నకిలీవి. ఇలాంటి జీడిపప్పును కొనుగోలు చేయడం వల్ల మన మనీ లాస్‌ తప్ప, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలనూ పొందలేమని నిపుణులు చెబుతున్నారు.

త్వరగా పాడవదు..
అసలైన జీడిపప్పు తొందరగా పాడవకుండా ఉంటుంది. అలాగే నకిలీ జీడిపప్పు త్వరగా పాడైపోతుంది. ఇందులో కీటకాలు, పురుగుల వంటివి ఏర్పడవచ్చు. నాణ్యమైన జీడిపప్పు కనీసం ఆరు నెలల వరకైనా చెడిపోకుండా ఉంటుందట. కాబట్టి చెక్ చేసుకొని మరీ.. మంచి జీడిపప్పును కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

మందంగా ఉంటుంది..
మంచి నాణ్యమైన జీడిపప్పు ఒక అంగుళం పొడవు, కొంచెం మందంగా ఉంటుంది. చిన్నగా, మందం తక్కువగా ఉంటే అవి నకిలీవని గుర్తుపట్టాలి. ఇలాంటి వాటిని కొనుగోలు చేయకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

దంతాలకు అంటుకోవు..
మీరు జీడిపప్పు కొనుగోలు చేసేటప్పుడు.. చూసి నకిలీని గుర్తించడం సాధ్యం కాకపోతే ఇలా చేయండి. ముందుగా షాప్‌ అతని నుంచి రెండు మూడు జీడిపప్పులను అడిగి తినండి. అప్పుడు తెలుస్తుంది. అసలైన జీడిపప్పు తిన్నప్పుడు అది దంతాలకు అంటుకోదు. అవే నకిలీవైతే దంతాలకు అంటుకుంటాయి. అలాగే నిజమైన జీడిపప్పులు సులభంగా ముక్కలుగా విరిగిపోతాయని నిపుణులంటున్నారు.

జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  • జీడిపప్పు గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందులో మంచి కొవ్వు పదార్థాలు, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి.
  • వీటిలో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పును తినడం వల్ల ఆకలి తొందరగా వేయదు. అలాగే జీర్ణక్రియను మెరుగపరుస్తుంది.
  • ఇందులో ఉండే మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి గుణాలు ఎముకలను బలంగా ఉంచుతాయి.
  • అలాగే జీడిపప్పును తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
  • ఇంకా జ్ఞాపకశక్తి పెరగడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

కూరలో నూనె ఎక్కువైందా ?- ఈ టిప్స్​తో ఆయిల్​ తగ్గడమే కాదు టేస్ట్​ కూడా సూపర్​!

కిచెన్​లో ఈగలు, కీటకాల సమస్య ఎక్కువగా ఉందా? - ఈ టిప్స్​తో ఒక్కటి కూడా కనిపించదు!

మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలా? - బ్లాక్ టీని ఇలా వాడితే రిజల్ట్ పక్కా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.