How To Control Uric Acid At Home : మనం తీసుకునే ఆహారం లేదా పానీయాల్లో ప్యూరిన్లు(Purines) ఎక్కవ మొత్తంలో ఉంటే శరీరంలో యూరిక్ యాసిడ్(Uric Acid) ఏర్పడుతుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువ అయితే గౌట్ నుంచి కిడ్నీలో రాళ్ల వరకు అనేక రకాల సమస్యలు వస్తాయి. సాధారణంగా యూరిక్ యాసిడ్‌ను శరీరం మూత్రపిండాల ద్వారా బయటకు పంపుతుంది. కానీ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటే రక్తంలోకి చేరుకుని హైపర్యూరిసెమియాకు(Hyperuricemia) దారితీస్తుంది. యూరిక్ యాసిడ్ పెరిగితే శరీరంలో స్పటికాలు ఏర్పడి కీళ్లలో స్థిరపడుతాయి. ఫలితంగా ఆర్థరైటిస్ లాంటి గౌట్ సమస్యకు దారితీస్తుంది. ఇదే కనక జరిగితే రాత్రి పూట కీళ్లలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ముఖ్యంగా బొటనవేలు నొప్పి అనేది గౌట్ సమస్యకు ప్రధాన సంకేతం. కాలక్రమేణా ఇది ముదిరి కీళ్లు, ఎముకలు, స్నాయువులను దెబ్బతీసి గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీ జబ్బులు, ఫ్యాటీ లివర్ వ్యాధులు వంటి ప్రమాదకరమైన సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం నీరు ఎక్కువగా తాగడం మొదలుకొని, జీవన విధానంలో, డైట్లో అనేక మార్పులు చేయాల్సి ఉంటుంది.
యూరిక్ యాసిడ్ తగ్గాలంటే రోజువారీ లైఫ్ స్టైల్‌నే మార్చుకోవాల్సి ఉంటుంది. వ్యాయామం, పోషకాలతో కూడిన ఆహరం, సరిపడా నిద్ర లాంటివి తప్పకుండా చేర్చడం వల్ల శరీరం నొప్పి వంటి వాటిని తట్టుకునేలా తయారవుతుంది. కెఫీన్, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండటం వల్ల శరీరంలోని యూరిక్ యాసిడ్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. వీటితో పాటు యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు సహాయపడే మూలికలు కొన్నింటి గురించి తెలుసుకుందాం.
1. మందార:
Hibiscus Juice : మందారను ఎండబెట్టి లేదా నేరుగా నీటిలో మరిగించి టీ చేసుకుని తాగడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా త్వరగా తగ్గుతాయి. ఈ టీ యూరిక్ యాసిడ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. నీటిలో మందార వేసి 5 నిమిషాల పాటు మరిగించి, గొరువెచ్చగా మారిన తర్వాత వడగట్టి తాగాలి.
2. డాండెలైన్:
Dandelion : డాండెలైన్ లేదా సింహపర్ణి అనే మొక్క యూరిక్ యాసిడ్ తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఉదయాన్నే దీంతో టీ తయారు చేసుకుని తరచుగా తాగడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
3. సెలరీ:
Celery : సెలరీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి గౌట్ సంబంధిత సమస్యలను తగ్గించడంలో, యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ను తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తాయి.
4. అల్లం:
Ginger : అల్లం టీ లేదా అల్లంతో తయారు చేసిన ఆహార పదార్థాల వల్ల కూడా నొప్పి, మంట వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు అల్లాన్ని నేరుగా ఉడకబెట్టి, వస్త్రంలో చుట్టి నొప్పి ఉన్న చోట పెట్టుకుంటే కూడా మంచి ఉపశమనం లభిస్తుంది.
5. అరటిపండు:
Banana : యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో రోజుకు ఒక అరటి పండు మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అవయవాలు సక్రమంగా పనిచేయడానికి తగినంత పొటాషియం అరటిలో ఉంటుంది. అదనంగా ఇందులోని పీచు పదార్థం శరీరంలోని యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుంది.
6. మెగ్నీషియం:
Magnesium : మెగ్నీషియంను తరచుగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించవచ్చు. బాదం, జీడిపప్పు వంటి గింజలు, పాలకూర, గుమ్మడికాయ వంటి కూరగాయల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
7. యూపిల్ సైడర్ వెనిగర్:
Apple cider vinegar : యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికే కాకుండా మొత్తం ఆరోగ్యానికి మేలు చేసేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ చాలా బాగా సహాయపడుతుంది.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
యూరిక్ యాసిడ్ పెరిగితే కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు.. ఇవి తింటే అంతా సెట్!