ETV Bharat / health

ఎన్ని మందులు వాడినా మెడనొప్పి తగ్గడం లేదా? - మందుబిల్ల అవసరం లేకుండా నేచురల్​గా తగ్గించుకోండిలా! - Neck Pain Relief

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 5:19 PM IST

Home Remedies Neck Pain : మీరు తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నారా? ఎన్ని మందులు, పెయిన్​ బామ్స్​​ వాడినా ఫలితం కనిపించలేదా ? అయితే, ఈ స్టోరీ మీ కోసమే! కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా.. మందుల అవసరం లేకుండానే మెడనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ మీ కోసం..

Home Remedies Neck Pain
Home Remedies Neck Pain (ETV Bharat)

Neck Pain Relief : రకరకాల కారణాలతో మెడనొప్పి వేధిస్తుంటుంది. దీంతో మెజార్టీ జనాలు పెయిన్​ కిల్లర్స్​, వివిధ రకాల పెయిన్​ బామ్స్​ వాడుతుంటారు. ఇవి భరించలేని నొప్పి నుంచి కాస్త ఉపశమనం పొందేలా చేసినా.. శ్వాశ్వత పరిష్కారాన్ని మాత్రం చూపించవు. ఇలాంటి వారు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మెడ నొప్పిని తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

మెడనొప్పి సమస్య ఉంటే అది రాత్రి ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది. అయితే.. ఈ నొప్పి ఒక్కసారిగా రాదు. మీరు కంప్యూటర్​ ముందు తప్పుడు భంగిమలో ఎక్కువ రోజులు కూర్చుంటే మెడ భాగంలో పెయిన్​ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు కూడా మెడనొప్పిని కలిగిస్తాయి.

అమెరికాలోని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్‌లో (report) చీఫ్ మెడికల్ ఎడిటర్​గా పనిచేస్తున్న 'డాక్టర్​ హోవార్డ్ E. లెవైన్'.. మెడ నొప్పి తగ్గడానికి కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అవేంటంటే..

  • మెడ నొప్పితో బాధపడేవారు తప్పుడు భంగిమలో కంప్యూటర్​ ముందు కూర్చుని పనిచేయకూడదు. మీ కంటి చూపుకి నేరుగా డెస్క్​టాప్​ ఉండాలి.
  • అలాగే కీబోర్డ్ చేతికి దగ్గరగా అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఛైర్​లో వంగి కూర్చవడం, మెడని కిందకి లేదా పైకి ఎక్కువ సేపు వంచి చూడడం వల్ల మెడ నొప్పి తీవ్రమవుతుంది. కాబట్టి, మెడనొప్పితో బాధపడేవారు సరైన భంగిమలో కూర్చోవాలి.
  • మీకు కంటి అద్దాలుంటే తప్పకుండా వాటిని టైమ్​ పీరియడ్​ ప్రకారం చెక్​ చేసుకోండి. ఎందుకంటే కొందరిలో సైట్ పెరుగుతూ ఉంటుంది. మీరు సరైన గ్లాసెస్​ ధరించకపోతే.. తరచూ మెడను వెనుకకు వంచి చూస్తారు. దీనివల్ల మెడనొప్పి పెరుగుతుంది.
  • రాత్రి పడుకునే ముందు కొంతమంది రెండు మూడు దిండ్లు ఉపయోగిస్తుంటారు. కానీ, ఈ అలవాటు మంచిది కాదు. దీనివల్ల మెడనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మెత్తగా ఉండే ఒక దిండు పెట్టుకోవడం మంచిది.
  • చాలా మందిలో మెడనొప్పి బాధ.. కంటినిండా నిద్రపోతే తగ్గిపోతుంది. కాబట్టి, కనీసం 8 గంటలు నిద్రపోవాలి. ​
  • అయితే, తీవ్రమైన మెడనొప్పితో పాటు జ్వరం, బరువు తగ్గడం, చేతులు, కాళ్లు తిమిర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

Neck Pain Treatment : మెడనొప్పికి కారణాలేంటో తెలుసా?.. ఇలా చేస్తే అంతా సెట్​!

ఆఫీస్​లోనే ఈజీగా యోగా.. ఈ 5 ఆసనాలతో స్ట్రెస్​, మెడ నొప్పి మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.