ETV Bharat / health

హీట్ స్ట్రోక్ - ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి - లేదంటే ప్రాణాలకే ప్రమాదం! - Heat Stroke Prevention Tips

Heat Stroke Prevention Tips : రోజురోజుకి ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 దాటితే చాలు.. ఉక్కపోత చికాకు తెప్పిస్తోంది. మరోవైపు మధ్యాహ్నం వేళ వేడి గాలులకు జనం రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా సమ్మర్​లో హీట్ స్ట్రోక్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

Heat Stroke
Heat Stroke Prevention Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 3:36 PM IST

Prevention Tips for Heat Stroke : ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరమంటున్నారు ఆరోగ్యనిపుణులు. ముఖ్యంగా హీట్​ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువైతే హీట్ స్ట్రోక్(Heat Stroke) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు, హీట్​ స్ట్రోక్ అంటే ఏమిటి? ఎలాంటి లక్షణాలుంటాయి? దీని బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వేసవికాలంలో శరీరం వేడిని తట్టుకోలేకపోయినప్పుడు హీట్ స్ట్రోక్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ టైమ్​లో బాడీ టెంపరేచర్ వేగంగా పెరుగుతుందని.. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా అవుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో వెంటనే స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, చికిత్స అందించడం చాలా అవసరమంటున్నారు. అయితే, అంతకంటే ముందు హీట్​స్ట్రోక్ లక్షణాలు తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.

హీట్ స్ట్రోక్ లక్షణాలు : ముఖ్యంగా హీట్ స్ట్రోక్ సంభవించినప్పుడు శరీర ఉష్ణోగ్రతలు ఛేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే తలతిరగడం, గందరగోళం, చిరాకు, మతిమరుపు, మానసిక స్థితిలో మార్పులు కనిపిస్తాయి. అంతేకాదు ముఖ్యంగా కేంద్ర నాడీ వ్యవస్థ పనిచేయదు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. అలాగే చెమట రాదు. చర్మం పొడిబారి.. వేడిగా మారుతోందని నిపుణులు సూచిస్తున్నారు. ఇవేకాకుండా.. తలనొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు, మూర్ఛ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది అంటున్నారు.

సమ్మర్ స్పెషల్ పెరుగు పచ్చళ్లు - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా - రుచితోపాటు ఆరోగ్యం బోనస్!

హీట్ స్ట్రోక్ నివారణ చర్యలు :

  • హీట్ స్ట్రోక్ బారినపడకుండా ఉండాలంటే.. బాడీని హైడ్రేట్​గా ఉంచుకోవడం చాలా అవసరం. ఇందుకోసం ఎక్కువ మొత్తంలో వాటర్ తీసుకునేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.
  • మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచడానికి సహాయపడే తగిన దుస్తులను ధరించాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా లేత రంగులలో ఉండే తేలికైన, వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోవడం మంచిది అంటున్నారు. అలాగే ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నీడ ప్రదేశాలలో ఉండేలా చూసుకోవాలంటున్నారు.
  • అదేవిధంగా మీరు ఏదైనా కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లయితే శరీరానికి తగిన విశ్రాంతిని అందించడానికి మధ్య మధ్యలో విరామాలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
  • ముఖ్యంగా వేసవిలో కలుషిత నీళ్లు ముప్పు అధికంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం సరికాదంటున్నారు నిపుణులు. బయటకు వెళ్లినప్పుడు ఇంటి నుంచి నీళ్ల బాటిల్‌ తీసుకెళ్లడం ఉత్తమమని సూచిస్తున్నారు.
  • అలాగే తాజాగా వండిన ఆహారం తీసుకోవడంతో పాటు బయట తినడం మానుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
  • వేసవిలో మద్యం లేదా కెఫిన్ సంబంధింత పానీయాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి రెండు శరీరానికి మరింత ముప్పును కలిగిస్తాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్‌కు గురిచేస్తాయంటున్నారు నిపుణులు.
  • 2019లో "ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్స్" జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. వేడి వాతావరణంలో మద్యం సేవించిన వ్యక్తులు హీట్ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం 40% ఎక్కువ అని వెల్లడైంది. ఈ పరిశోధనలో మియామి విశ్వవిద్యాలయంలోని మిల్లర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్​కు చెందిన ప్రముఖ డాక్టర్. డేవిడ్ జె. లీ పాల్గొన్నారు. సమ్మర్​లో మద్యం తాగడం వల్ల డీహైడ్రేషన్ తలెత్తి ఆ కారణంగా హీట్ స్ట్రోక్ సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
  • అదేవిధంగా వేడి చేసి చల్లార్చిన నీటిలో ఓఆర్‌ఎస్‌ కలుపుకొని తాగడం, కొన్ని పండ్లు, మజ్జిగ, నిమ్మరసం లాంటివి తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ బారినపడకుండా చూసుకోవచ్చంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బార్లీ వాటర్​ - ఎండ నుంచి రక్ష మాత్రమే కాదు - ఈ సమస్యలకు కూడా దివ్యౌషధం! - Barley Water Benefits in Summer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.