Healthy Juices To Stop Hair Fall : ఆడవారికైనా, మగవారికైనా నెత్తిమీద జుట్టు ఒత్తుగా ఉంటేనే అందంగా కనిపిస్తారు. అయితే, కాలుష్యం, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏవేవో హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయినా ఫలితం పెద్దగా ఉండదు. అలాంటి వారు కొన్ని జ్యూస్‌లు తాగడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ జ్యూస్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నారింజ జ్యూస్ : నారింజ పండ్లు ఆరోగ్యానికీ, అందానికీ ఎంత మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ సి, వివిధ పోషకాలు అధికంగా ఉంటాయి. హెయర్‌ఫాల్ సమస్య అధికంగా ఉన్నవారు.. రోజూ నారింజ జ్యూస్ తాగడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలా? - మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ డ్రై ఫ్రూట్స్ చేర్చుకుంటే బెస్ట్ రిజల్ట్!
ఉసిరి : ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉండే ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, క్రమం తప్పకుండా ఉసిరి జ్యూస్ తాగడం వల్ల జుట్టు రాలడం సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ సి.. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలోనూ, హెయిర్‌ఫాల్‌ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
పాలకూర రసం : మనం ఆకుకూరల్లో పాలకూరను ఎక్కువగా తీసుకుంటాం. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే, జుట్టు రాలడంతో బాధపడేవారు పాలకూర జ్యూస్ తాగడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఐరన్, విటమిన్ ఎ, సి వంటివి జుట్టును విరిగిపోకుండా, బలంగా ఉండేలా తోడ్పడతాయని పేర్కొన్నారు.
అలర్ట్: నైట్ సరిపడా నిద్రపోయినా - పగలు మళ్లీ నిద్ర వస్తోందా? - ఈ అనారోగ్య సమస్యలే కారణమట!
క్యారెట్ జ్యూస్‌తో : రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే విటమిన్ ఎ, బీటా కెరొటిన్, బయోటిన్ వంటివి కుదుళ్లలను దృఢంగా చేసి హెయిర్‌ఫాల్‌ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 2013లో "జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ"లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనను జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్ యోషిహిరో యమగుచి' నిర్వహించారు.
కాకరకాయ రసం : చేదుగా ఉండే కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసినా కూడా చాలా మంది తినడానికి అంతగా ఆసక్తి చూపించరు. అయితే, జుట్టు అధికంగా రాలే వారు క్రమం తప్పకుండా కాకరకాయ రసం తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరగడం నుంచి బరువు తగ్గేవరకు - కివీతో ప్రయోజనాలు ఎన్నో!
రెడ్ యాపిల్ Vs గ్రీన్ యాపిల్ - డయాబెటిస్ పేషెంట్స్‌కు ఈ రెండింటిలో ఏది మంచిది!