ETV Bharat / health

పచ్చళ్లలో పోషకాలెన్నో- పికిల్స్​ తినడం వల్ల కలిగే బెనిఫిట్స్​ ఇవే! - Health Benefits Of Pickles - HEALTH BENEFITS OF PICKLES

Health Benefits Of Pickles : ఆవకాయ, నియ్మకాయ వంటి పచ్చళ్లు లేకుండా సమ్మర్ ఏమాత్రం స్పెషల్​గా అనిపించదు. అలాంటి పచ్చళ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

pickles health benefits
health benefits of pickle (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 2:17 PM IST

Health Benefits Of Pickles : ఇండియన్ కిచెన్లలో ఏం ఉన్నా, లేకున్నా పచ్చళ్లు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. ఇంట్లో కూరలు లేకున్నా, సడెన్​గా వండుకునే సమయం లేకున్నా, టక్కున మనల్ని ఆకలి నుంచి ఆదుకునేది ఈ పచ్చళ్లే మరి. ఇవి కేవలం ఆకలిని తీర్చడమే కాదు, అమోఘమైన రుచిని కూడా అందిస్తాయి. అందుకే వీటిని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా వేసవిలో ఎక్కువ మంది పెట్టుకునే ఆవకాయ పచ్చడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంట. దీని రుచి, వాసన - అబ్బో మాట్లాడుకుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ యమ్మీ అండ్ టేస్టీ పచ్చళ్లలో పోషక విలువలు కూడా ఎక్కువేనట. వీటిని మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మీకు ఏంఏం ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

1. ప్రోబయోటిక్స్ : నిల్వ పచ్చళ్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయట. ఈ పులయబెట్టిన ఆహార పదార్థాలు ప్రోబయోటిక్లకు సూపర్ ఫుడ్లు. ఇవి ప్రేగుల మైక్రోబయోమ్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. నిల్వ పచ్చళ్లలో వేసే మసాలాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.

2. యాంటీ ఆక్సిడెంట్స్​ : ఉడికించకుండా పచ్చిగా నిల్వ చేయబడతాయి కాబట్టి పచ్చళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్​ను కాపాడే అవసరమైన సూక్ష్మ పోషకాలు కలిగి ఉంటాయి. వృద్ధాప్య ప్రక్రియను కూడా ఇవి సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే ఊరగాయ, ఆవకాయ, టమాట వంటి నిల్వ పచ్చళ్ల వినియోగం సెల్యులార్ మెటబాలిజం ప్రభావాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

3. విటమిన్లు, ఖనిజాలకు మూలం : పండని కూరగాలతో పాటు కొత్తిమీర, మెంతులు, ఆవాలు, కరివేపాకు లాంటి వాటితో చేసే పచ్చళ్లలో విటమిన్-సి, విటమిన్-ఏ, విటమిన్-కె లాంటి ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇనుము, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఇందులో ఎక్కువగానే లభిస్తాయి.

4. కాలేయానికి రక్ష : భారతీయ సంప్రదాయ పచ్చళ్లలో ఒకటైన ఉసిరికాయ, ఆవకాయ పచ్చళ్లు కాలేయాన్ని రక్షించే హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలు కలిగి ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

5. రోగనిరోధక శక్తి : పచ్చళ్ల తయారీలో ఉపయోగించే మసాలాల్లో ఆరోగ్యకరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో ఎక్కువ మొత్తంలో ఉపయోగించే పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వివిధ బ్యాక్టీరియాల కారణంగా కలిగే వైరస్​ల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇది మెదడులో ఉత్పన్నమైన న్యూరోట్రోఫిక్ ఫాక్టర్(BDNF) అనే గ్రోత్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. అల్జీమర్స్, డిప్రెషన్ వంటి మెదడు సంబంధిత రుగ్మతలను ఎదుర్కోవడంలోనూ ఇది బాగా సహాయపడుతుంది.

6. గర్భిణీలకు : గర్భధారణ సమయంలో మహిళలు తరచుగా పచ్చళ్లు తినాలని కోరుకుంటారు. ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో కలిగే వికారం, వాంతులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో వారికి పచ్చళ్లు బాగా సహాయపడతాయి. పుల్లపుల్లగా, కాస్త ఒగరుగా, కారంగా ఉండే పచ్చళ్లు వారి ఆకలిని పెంచుతాయి. ఇది గర్భధారణ సమయంలో వచ్చే మార్నింగ్​ సిక్​నెస్ సమస్యను తగ్గించడంలో చక్కగా ఉపయోగపడతాయి.

మీ కిచెన్​లో పొగ ఎక్కువగా వస్తుందా? - ఈ టిప్స్ పాటించారంటే ఆ సమస్య ఉండదు - పైగా గ్యాస్ ఆదా! - Kitchen Pollution Reduce Tips

ఎంత ట్రై చేసినా నైట్‌ నిద్రపట్టడం లేదా ? అయితే మీరు ఈ లోపంతో బాధపడుతున్నట్లే! - Magnesium Foods Sources

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.