ETV Bharat / health

క్యాన్సర్​ టూ గుండె జబ్బులకు చెక్ - కర్బూజతో ఇన్ని ప్రయోజనాలా? - Muskmelon benefits

Muskmelon Benefits: ఈ సారి ఎండలు ఇప్పట్నుంచే మొదలయ్యాయి.. వీటి నుంచి రక్షణ కోసం చల్లని పానీయాలు.. పండ్లు తీసుకుంటాం.. ఇందులో కర్జూజ కూడా ఉంటుంది. అయితే.. కేవలం ఎండ నుంచి కాపాడడమే కాకుండా.. క్యాన్సర్ నుంచి గుండె జబ్బుల వరకు ఎన్నో రోగాలకు చెక్ పెట్టే కెపాసిటీ ఈ పండుకు ఉందట! ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Muskmelon Benefits
Muskmelon Benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 10:22 AM IST

Health Benefits of Muskmelon: కర్బూజను పోషకాల పవర్ హౌస్ అని అంటారు. ఇందులో విటమిన్-సి, ఎ, కె, బి కాంప్లెక్స్​లు​ పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, లైకోపీన్​ కూడా ఇందులో ఉంటాయి. కంటి ఆరోగ్యానికి, ఎముకల ఆరోగ్యానికి, రక్తం గడ్డకట్టడానికి దోహదం చేస్తుంది. అలాగే శరీరానికి శక్తిని అందించడంలోనూ, జీవక్రియను, నాడీవ్యవస్థను మెరుగ్గా ఉంచడంలోనూ కర్బూజ సహాయపడుతుంది. ఇక ప్రయోజనాలు చూస్తే..

హైడ్రేట్​: కర్బూజలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచుతుంది. వేడి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచడానికి, జీవక్రియకూ సహాయపడుతుంది. 2023లో USDA నేషనల్ న్యూట్రియంట్ డేటాబేస్ ఫర్ స్టాండర్డ్ రిఫరెన్స్ ప్రకారం.. కర్బూజలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇది వేడి వాతావరణంలో బాడీని హైడ్రేట్​గా ఉంచుతుందని పేర్కొన్నారు.

యాంటీ ఆక్సిడెంట్లు: కర్బూజలో బీటా కెరోటిన్, విటమిన్-సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్​ను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

మీ పొట్టలో సమస్యా? - అయితే అది ఐబీఎస్ కావొచ్చు!

కంటి ఆరోగ్యం: మస్క్​ మిలన్​లో బీటాకెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-ఎ గా రూపాంతరం చెందుతుంది. విటమిన్-ఎ రెటీనా పనితీరుకు ముఖ్యమైనది. కర్బూజను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

జీర్ణ ఆరోగ్యం: కర్బూజలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. పేగు కదలికలను సులభం చేస్తుంది. గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

రక్తపోటు: రక్తపోటుతో బాధపడేవారికి మస్క్​ మిలన్​ ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీనిలోని పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. ఇదే విషయాన్ని 2023లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ స్పష్టం చేసింది.

బయట తింటున్నారా? - ఈ ఫుడ్​కు కచ్చితంగా నో చెప్పండి!

అధిక బరువు నియంత్రణ: కర్బూజ రుచిలో తియ్యగా ఉంటుంది కానీ, ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని అల్పాహారంగానూ తీసుకోవచ్చు. దీనిలోని పీచు పొట్ట నిండిన భావనను కలిగించి ఆకలిగా అనిపించదు. దీని విత్తనాల్లోని పొటాషియం కొవ్వును తగ్గించడంలో సాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దీన్ని ఎంచుకుంటే సరి.

గుండెకు మంచిది: కర్బూజలో ఉండే యాంటీకోగ్యులెంట్ గుణాలు, ఇందులో ఉండే అడెనోసిన్.. రక్తం పలుచబడటానికి సహాయపడుతుంది. తద్వారా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

క్యాన్సర్​: క్యాన్సర్ నివారణలో కూడా ఈ పండు ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ సి, బీటా కెరోటిన్‌లు క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తిప్పికొట్టడంలో సహాయపడతాయి. ఫలితంగా శరీర కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.

అతిగా ఆలోచిస్తున్నారా? - మీకు గుండె జబ్బు వచ్చే అవకాశం!

కొబ్బరినీళ్లు ఏ టైమ్​లో తాగాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.