ETV Bharat / health

బిగ్ అలర్ట్ : జుట్టుకు రంగు వేస్తున్నారా? - ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలుసా? - Hair Dye Side Effects - HAIR DYE SIDE EFFECTS

Hair Dye Side Effects : అందంగా కనిపించడంలో జుట్టు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, నేటి రోజుల్లో చాలా మంది తెల్లజుట్టు ప్రాబ్లమ్​తో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే జుట్టును నల్లగా మార్చడానికి విభిన్నమైన హెయిర్ డైలను వాడుతుంటారు. మీకూ అలాంటి అలవాటు ఉందా? అయితే, మీకో బిగ్ అలర్ట్.

Side Effects Of Hair Dye
Hair Dye Side Effects (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 1:56 PM IST

Side Effects Of Hair Dye : ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, వంశపారంపర్యం.. కారణం ఏదైతేనేం? జుట్టు రాలడం, ముప్ఫై దాటకుండానే నెరవడం మామూలైంది. ఈ క్రమంలోనే చాలా మందికి తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి విభిన్న హెయిర్ డైలను వాడటం పరిపాటిగా మారిపోయింది. అలా హెయిర్ డైలను(Hair Dye) వాడే వారందరికీ బిగ్ అలర్ట్. అదేంటంటే.. హెయిర్ డైలలో వాడే కెమికల్స్ కారణంగా వాటిని వాడడం వల్ల చర్మ, జుట్టు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజాగా ఓ వ్యక్తి తెల్ల జుట్టుకు హెయిర్ డై వేసుకోగా.. అతను తీవ్రమైన దుష్ప్రభావాలను ఎదుర్కొన్నట్లు సమాచారం. ఆ వ్యక్తి హెయిర్ డై వేసుకొని నిద్రపోగా తెల్లారేసరికి అతని ముఖం తీవ్రంగా వాచిపోయి గుర్తు పట్టరానంతగా మారిపోయాడట. అలాగే.. గొంతు నొప్పి, తలపై మంటలు, అలర్జీ వంటి సమస్యలు అతనిని ఇబ్బంది పెట్టాయట. వీటన్నింటికీ కారణం.. అందులో వాడిన రసాయనమే అని నిపుణులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అసలు, ఇంతకీ ఆ వ్యక్తి వేసుకున్న హైయర్ డైలో ఉపయోగించిన రసాయన పదార్థమేంటి? దాని వల్ల కలిగే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తెల్ల జుట్టుకు రంగు వేసుకుంటే చూడటానికి బాగానే ఉంటుంది. అలాగే అందులోని రసాయనాల వల్ల జుట్టు నిగనిగలాడుతుంది. కానీ, ఇదంతా తాత్కాలికమే. హెయిర్ డైలలో ఉపయోగించే కొన్ని రసాయనాల కారణంగా వివిధ చర్మ, జుట్టు(Hair) సమస్యలు తలెత్తవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. అందులో ముఖ్యంగా హెయిర్ డైలలో ఉపయోగించే 'పారాఫెనిలెనిడియమైన్'(PPD) అనే రసాయనం చర్మ, జుట్టు ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతున్నట్లు ఇటీవల పరిశోధనల్లో వెల్లడైంది.

ఈ కెమికల్ వాడిన, హెయిర్ డై యూజ్ చేసిన వారిలో అలర్జీ ప్రతిచర్యలు, చర్మ వాపు, గొంతునొప్పి వంటి సమస్యలు తలెత్తినట్లు కనుగొన్నారు. ఇటీవల ఇంగ్లాండ్​లో ఒక వ్యక్తి హెయిర్ కలర్ వాడి ఆస్పత్రి పాలైన ఘటనలో.. అతడి ఉపయోగించిన హెయిర్ డైలో పారాఫెనిలెనిడియమైన్ అనే రసాయనమే అందుకు కారణమైనట్లు పరిశోధకులు గుర్తించారట.

జుట్టుకు రంగు వేసుకుంటున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

2018లో "Journal of Investigative Allergology and Clinical Immunology"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. హెయిర్ డై లోని పారాఫెనిలెనిడియమైన్ అనే రసాయనం కారణంగా చాలా మందిలో.. అలర్జీ, ముఖం వాపు, ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో స్పెయిన్​లోని హాస్పిటల్ యూనివర్సిటీరియో డి గ్రాన్ కానరియా డాక్టర్ నెగ్రిన్ అనే ఇన్​స్టిట్యూషన్​కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ Maria Luisa Perez Varela పాల్గొన్నారు.

అంతేకాదు.. పారాఫెనిలెనిడియమైన్ అనే కెమికల్ ఉన్న హెయిర్ డై వాడడం వల్ల.. జుట్టు ఊడడం, చుండ్రు, శ్వాస కోశ సమస్యలు, కళ్ల చికాకు, ఎరుపు, నీరు కారడం వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, వీలైనంత వరకు కెమికల్స్ ఉన్న హెయిర్ డైలకు దూరంగా ఉండడం మంచిదంటున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో హెయిర్ డై వాడాలనుకుంటే.. కేశ ఆరోగ్య నిపుణులను సంప్రదించి వారి సూచనలు పాటించడంతో పాటు ప్యాచ్ టెస్ట్ అనంతరం వాడడం బెటర్ అని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎంత ట్రై చేసినా హెయిర్ డై మచ్చలు పోవట్లేదా? - ఇలా చేశారంటే చిటికెలో మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.