ETV Bharat / health

అలర్ట్ : ఆరోగ్యానికి మంచివని పొట్టలో వేసేస్తున్నారా? - తీవ్ర హాని కలిగిస్తాయ్! - Foods That Are Unhealthy

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 11:52 AM IST

Foods That Are Unhealthy : కొన్ని ఆహారాలు ఆరోగ్యానికి మంచివని భావించి తింటూ ఉంటాం. కానీ.. అవి హానికరమైనవని తెలిస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ అలాంటి ఆహార పదార్థాల గురించే వివరిస్తున్నాం. మరి.. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకోండి.

Foods That Are Unhealthy
Foods That Are Unhealthy

Foods That Are Unhealthy : హెల్దీగా ఉండటానికి.. పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అలాగే మంచి జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచిస్తారు. అందుకే చాలా మంది జనాలు డైట్‌లో హెల్దీ ఫుడ్‌ను, డ్రింక్స్‌ను యాడ్ చేసుకుంటూ ఉంటారు. రోజూ తినే ఆ ఆహార పదార్థాలు శరీరానికి మంచి చేస్తాయనే అనుకుంటారు. కానీ.. అందులో కొన్ని తీవ్ర అనారోగ్యకరమైనవి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

డైజెస్టివ్ బిస్కెట్స్ :
మనలో చాలా మంది ఆకలిగా ఉన్నప్పుడు తినే డైజెస్టివ్‌ బిస్కెట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అనుకుంటారు. కానీ, నిజానికి వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషక పదార్థాలు ఎక్కువగా ఉండవట. వీటిని ప్రాసెస్‌డ్‌ పిండి పదార్థాలు, షుగర్‌తో తయారు చేయడం వల్ల.. ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తు్ననారు. డైజెస్టివ్‌ బిస్కెట్లలో అధిక క్యాలరీలు ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 2017లో ప్రచురించిన 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్' అధ్యయనం ప్రకారం.. డైజెస్టివ్ బిస్కెట్లు ఎక్కువగా తినే వారిలో బరువు పెరిగే ప్రమాదం 20 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారట.

పిల్లలకు హెల్త్ డ్రింక్స్ :
ప్రస్తుత కాలంలో.. హెల్త్ డ్రింక్స్‌ చాలా పాపులర్. వీటిని రంగురంగుల ప్యాకెట్లలో ప్యాక్‌ చేసి సూపర్‌ మార్కెట్లు, షాపుల్లో అమ్ముతున్నారు. పిల్లల ఆరోగ్యానికి మంచివని వీటిని చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. అయితే.. వీటిని తయారు చేయడానికి చక్కెర ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే పాడవకుండా ఉండటానికి వివిధ రకాల ప్రిజర్వేటివ్స్‌ వాడుతారు. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావని నిపుణులంటున్నారు.

మీ పిల్లలు జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తింటున్నారా ? ఇలా చేస్తే పూర్తిగా మానేస్తారు!

డైట్ ఖఖ్రా (Diet Khakhra) :
చాలా మంది సాయంత్రం టీ తాగేటప్పుడు స్నాక్స్‌గా డైట్ ఖఖ్రాను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, నిజానికి వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని రోజూ తినడం వల్ల అనారోగ్యకరమైన బరువు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

బ్రౌన్ బ్రెడ్ :
చాలా మంది వైట్‌ బ్రెడ్‌ కంటే బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని తింటుంటారు. కానీ, వీటిని తయారు చేయడానికి వివిధ రకాల కలర్‌లను ఉపయోగిస్తారట. అంతేకాదు.. బ్రెడ్​లో ఆరోగ్యానికి మేలు చేసే పోషక పదార్థాలు ఏవి పెద్దగా ఉండవని చెబుతున్నారు. అందుకే మార్కెట్లో బ్రౌన్ బ్రెడ్‌ను కొనేటప్పుడు ప్యాక్‌పై ఉన్న పోషక విలువలను ఒకసారి చెక్‌ చేయాలని సూచిస్తున్నారు.

బ్రేక్‌ఫాస్ట్‌ సిరిల్స్‌ (Breakfast Cereals) :
కొంత మందికి ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ సిరిల్స్‌ తినే అలవాటు ఉంటుంది. అయితే.. వీటిలో షుగర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. బ్రేక్‌ఫాస్ట్‌ సిరిల్స్‌ను డైలీ తినడం వల్ల బరువు పెరగడంతో పాటు, వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

NOTE : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

షుగర్‌ ఉన్నవారు పెరుగు, సాల్ట్ తీసుకుంటే ఏమవుతుంది? - ఆయుర్వేద నిపుణులేమంటున్నారు?

అలర్ట్‌ - గర్భిణులు పానీపూరి తింటే ఏమవుతుంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.