ETV Bharat / health

డైలీ సోంపు గింజలను ఇలా తీసుకున్నారంటే - డయాబెటిస్​కు ఈజీగా చెక్ పెట్టొచ్చు! - Fennel Seeds for Diabetes - FENNEL SEEDS FOR DIABETES

Fennel Seeds Health Benefits : ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ప్రధానమైన అనారోగ్య సమస్య.. డయాబెటిస్. దీంతో చాలా మంది షుగర్​ను కంట్రోల్​లో ఉంచుకునేందుకు డైలీ మందులు వాడుతూ ఆహార నియమాలు పాటిస్తుంటారు. అయితే, అలాకాకుండా సోంపు గింజలను ఇలా తీసుకున్నారంటే సింపుల్​గా మధుమేహాన్ని కంట్రోల్​లో ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

FENNEL SEEDS
DIABETES
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 5:40 PM IST

Fennel Seeds for Control Blood Sugar : ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా సమస్త మానవాళిని పీడిస్తున్న అతిపెద్ద సమస్య.. డయాబెటిస్! దాంతో అన్నీ తినాల్సిన సమయంలోనూ కొన్ని కఠినమైన ఆహార నియమాలు ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో చాలా మంది మధుమేహ వ్యాధిగ్రస్థులు షుగర్ లెవల్స్ కంట్రోల్​లో ఉంచుకోవడానికి డైలీ ఎన్నో మందులు వాడుతుంటారు. అయితే, అలాకాకుండా మీరు రోజు సోంపు గింజలను ఇలా తీసుకున్నారంటే డయాబెటిస్​ను ఈజీగా కంట్రోల్​ ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు. అంతేకాదు.. సోంపును(Anise Seeds) తీసుకోవడం వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు. ఇంతకీ, సోంపుతో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి? షుగర్ నియంత్రణం కోసం ఏ విధంగా తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

డయాబెటిస్ ఇబ్బందిపడేవారికి సోంపు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు.. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. అంతేకాకుండా.. ఇవి బ్లడ్​ షుగర్​ను కంట్రోల్​లో ఉంచుతాయని చెబుతున్నారు. అదే విధంగా సోంపులో పుష్కలంగా ఉండే ఫైబర్ కూడా రక్తంలో చక్కెర, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు. కాబట్టి దీనిని డైలీ తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే.. ఈ గింజలలో ఉండే ఫైబర్, కాల్షియం, పోటాషియం, ఐరన్, విటమిన్ సి, మెగ్నీషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. అయితే, షుగర్ పేషెంట్స్ అనేక విధాలుగా సోంపును తమ డైలీ డైట్​లో చేర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

సోంపును నమిలి తినడం : డయాబెటిస్ ఉన్న వారు డైలీ భోజనం తర్వాత సోంపును నమిలి తినడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇలా తినడం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పడుకునే ముందు సోంపు గింజలను తిన్నా అది షుగర్​ను అదుపులో ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా.. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు సోంపును నమలడం వల్ల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చంటున్నారు.

షుగర్​ పేషెంట్లు బెండకాయ తింటే మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారంటే!

సోంపు వాటర్ : షుగర్ ఉన్నవారు సోంపువాటర్​ తీసుకున్న మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక గ్లాస్ వాటర్​లో టేబుల్ స్పూన్ సోంపును రాత్రంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. అలాగే నానిన సోంపు గింజలను నమిలి మింగాలి. ఇలా రెగ్యులర్​గా తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ కంట్రోల్​లో ఉండడమే కాకుండా మరికొన్ని ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు.

2012లో ఫైటోథెరపీ రీసెర్చ్ అనే జర్నల్​లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. సోంపు వాటర్ టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్​లో ఉన్నాయని, ఇన్సులిన్ స్థాయిలు మెరుగపడ్డాయని వెల్లడైంది. ఈ పరిశోధనలో దిల్లీలోని జామియా హమ్​దర్ద్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ హుస్సేన్ పాల్గొన్నారు. షుగర్ ఉన్నవారు సోంపు గింజలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్​లో ఉండడమే కాకుండా మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.

సోంపు టీ : మధుమేహం వ్యాధిగ్రస్థులు సోంపును టీ రూపంలో తీసుకున్నా చాలా ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో చెంచా సోంపు మరిగించుకోవాలి. ఆ వాటర్ మరిగి సగానికి వచ్చినప్పుడు వడకట్టుకొని గోరువెచ్చగా తాగాలి. ఇలా తరచుగా తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్​లో ఉంటాయంటున్నారు నిపుణులు.

ఈ 4 అలవాట్లతో - షుగర్​ ఉన్నవారి లైఫే డేంజర్‌లో పడిపోతుంది! - Precautions For Diabetes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.