ETV Bharat / health

మీకు తెలుసా? : ఈ వస్తువులకు కూడా ఎక్స్​పైరీ డేట్ ఉంటుంది! - ఎక్కువ కాలం వాడితే అంతే! - Household Items Expiry Date - HOUSEHOLD ITEMS EXPIRY DATE

Expiry Date for Household Items: మెజారిటీ జనాలు మందులు, ఆహార పదార్థాలకు మాత్రమే గడువు తేదీ ఉంటుందని అనుకుంటారు. కానీ, మనం ఉపయోగించే ప్రతి వస్తువుకు ఒక ఎక్స్​పైరీ డేట్​ అనేది ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Expiry Date
Expiry Date for Household Items (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 10:21 AM IST

Expiry Date for Household Items : చాలామంది మందులు, టానిక్‌లు, ఇతర ఆహార పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్​పైరీ డేట్ ఎప్పటి వరకు ఉందని ఒకసారి చెక్‌ చేస్తుంటారు. అయితే.. కొన్ని వస్తువులకు మాత్రమే ఇలా చెక్ చేస్తుంటారు. కానీ.. మనం ఇంట్లో ఉపయోగించే వస్తువులకు కూడా ఎక్స్​పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా? మెజారిటీ జనం కొన్ని వస్తువులను నెలలు, ఏళ్ల తరబడి వాడుతుంటారు. ఇలా వాడటం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి, ఇంట్లో గడువు ముగిసే వస్తువులు ఏంటీ? వాటిని ఎన్ని రోజులకొకసారి మార్చాలి? అనే వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

కార్పెట్స్ :
చాలా మంది ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు కార్పెట్‌ని దులిపి ఎండలో వేసి మళ్లీ ఇంట్లో పరుస్తుంటారు. అయితే, కార్పెట్‌ని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల దానిపై దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. దీనివల్ల శ్వాస సమస్యలు, అలర్జీల వంటివి వచ్చే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. కాబట్టి, కార్పెట్లను తరచూ వాక్యుమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి ఆవిరితో శుభ్రం చేసుకోవాలి. మంచి కార్పెట్లు అయితే ఐదారేళ్లు ఉపయోగించుకోవచ్చట.

మ్యాట్రెసెస్‌ :
చాలా మంది జనాలు మ్యాట్రెసెస్‌ పైన ఉన్న బెడ్‌షీట్లను వారానికి ఒకసారి శుభ్రం చేస్తూ.. ఏళ్ల తరబడి వాటినే ఉపయోగిస్తుంటారు. అయితే, కొన్ని సంవత్సరాల నుంచి వీటిని ఉపయోగించడం వల్ల నాణ్యత దెబ్బతింటుంది. దీనివల్ల మ్యాట్రెసెస్‌పై బ్యాక్టీరియా, దుమ్ము దూళి వంటివి పేరుకుపోతాయి. ఫలితంగా మనకు వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఒక మ్యాట్రెసెస్‌ ఎక్స్​పైరీ డేట్ 7 నుంచి 10 సంవత్సరాలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ వస్తువుల్ని కచ్చితంగా మారుస్తుండాలి.. లేదంటే?

లూఫాలు :
చాలా మందికి స్నానం చేసేటప్పుడు లూఫా వాడే అలవాటు ఉంటుంది. అయితే.. కొంత మంది వీటిని వాడిన తర్వాత అలాగే తడి వాతావరణంలోనే పెడుతుంటారు. దీనివల్ల లూఫాపై బ్యాక్టీరియా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, లూఫాను వాడిన తర్వాత పూర్తిగా ఎండబెట్టాలి. ప్రతి వారం ఒకసారి వేడి నీటితో శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఒక లూఫాను నెలకు మించి వాడకూడదని చెబుతున్నారు.

ప్లాస్టిక్‌ బాక్స్‌ :
ప్రస్తుత కాలంలో చాలా మంది గృహిణిలు పప్పుల నుంచి ఉప్పుల వరకూ వంటింట్లోని చాలా పదార్థాల కోసం ప్లాస్టిక్‌ డబ్బాలను వాడుతున్నారు. అయితే.. ఎక్కువ రోజుల నుంచి ఈ డబ్బాలను ఉపయోగించడం వల్ల పగుళ్లు, గీతలు ఏర్పడతాయి. దీంతో బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి, ప్రతి రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్లాస్టిక్ డబ్బాలను మార్చాలి. వీలైతే గాజుతో చేసినవి ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు.

కటింగ్‌ బోర్డులు :
మనం కూరగాయలు కట్‌ చేయడానికి ఉపయోగించే కటింగ్‌ బోర్డును కనీసం రెండేళ్లకు ఒకసారి మార్చాలి. ఎందుకంటే వీటిపైన గాట్లు ఏర్పడి.. అక్కడ బ్యాక్టీరియా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

నాన్‌ స్టిక్‌ పాన్స్ :
ఏళ్ల తరబడి నాన్‌ స్టిక్‌ పాన్స్ ఉపయోగించడం వల్ల వాటిపైన ఉన్న కోటింగ్‌ చెరిగిపోతుంది. దీంతో.. వంట చేసేటప్పుడు పాన్​ నుంచి హానికరమైన రసాయనాలు విడుదలవుతాయి. కాబట్టి, మంచి బ్రాండెడ్‌ పాన్స్ కొనాలి. వీటి ఎక్స్‌పైరీ డేట్ మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు.

కిచెన్‌ స్పాంజ్‌లు :
మనం పాత్రలను శుభ్రం చేయడానికి వాడే కిచెన్‌ స్పాంజ్‌లు ఒకటి లేదా రెండు వారాలకు మించి ఉపయోగించకూడదు. ఎక్కువ రోజులు ఒకేదానిని వాడటం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ వస్తువులకూ ఎక్స్​పైరీ డేట్​ ఉంటుంది! - ఎక్కువ కాలం వాడితే ఏం జరుగుతుందో తెలుసా? - Expiry Date for Household Items

మీ పరుపు ఎన్నాళ్లకు మార్చేయాలి? - లేకపోతే ఏమవుతుంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.