Are You Bathing With Heater Water : ప్రస్తుత రోజుల్లో నీళ్లు కాచుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఫాలో అవుతున్నారు. కొంతమంది గీజర్ ఉపయోగిస్తే, మరికొంతమంది గ్యాస్ స్టౌ వాడుతుంటారు.. ఇంకొందరేమో వాటర్ హీటర్‌తో నీళ్లు వేడి చేసుకుంటుంటారు. అయితే, వీటిలో చాలామంది ఇళ్లలో ఎక్కువగా వాటర్ హీటర్నే వాడుతుంటారు. అందుబాటు ధరకు లభించడం, తక్కువ సమయంలో నీళ్లు వేడి కావడమే ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు! అయితే.. ఎలక్ట్రిక్ హీటర్(Electric Heater) వాటర్ వాడడం వల్ల ఆరోగ్య సమస్యలతోపాటు కొన్ని ఇతర నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ హీటర్ వాడడం వల్ల నీరు త్వరగా వేడెక్కడం అటుంచితే.. ఆ నీటితో స్నానం చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ వేడి నీటితో స్నానం చేయడం వల్ల దురద, పొక్కులు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు.
అలాగే ఎలక్ట్రిక్ హీటర్లు యూజ్ చేసేటప్పుడు గాలిలో కార్బన్ మోనాక్సైడ్ వండటి హానికరమైన వాయువులు రిలీజ్ అవుతాయని చెబుతున్నారు. ఇవి తలనొప్పి, వికారం, శ్వాసకోశ సమస్యలకు దారితీయవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఎలక్ట్రిక్ హీటర్‌తో బాగా వేడెక్కిన నీటితో స్నానం చేయడం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్ వంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ముప్పు పెరుగుతుందని సూచిస్తున్నారు.
2020లో "Journal of Headache"లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. హీటర్ వాటర్ తో స్నానం చేసే వ్యక్తులకు తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ అని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ నగరంలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో న్యూరాలజిస్ట్ డాక్టర్ జేన్ స్మిత్ పాల్గొన్నారు. హీటర్‌తో నీటిని వేడిచేసేటప్పుడు కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు రిలీజ్ అవుతాయని ఇవి తలనొప్పికి కారణమవుతాయని ఆయన పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్ హీటర్ వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు.. ఆర్థిక సమస్యలు రావొచ్చంటున్నారు. ఎందుకంటే.. హీటర్స్ పనిచేయడానికి ఎక్కువ విద్యుత్ అవసరం. దానికారణంగా విద్యుత్ బిల్లులు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని హీటర్లు తరచుగా రిపేర్‌కి వస్తుంటాయి. దాంతో వాటిని బాగు చేయించాలన్నా లేదా కొత్తవి కొనాలన్నా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అంతేకాదు.. నాణ్యత లేని హీటర్లు వాడడం వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, మీరు తప్పనిసరి పరిస్థితుల్లో హీటర్ వాడాలనుకుంటే కాస్త ధర ఎక్కువైనా మంచి క్వాలిటీ ఉన్న దాన్ని తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. అదేవిధంగా.. ఎలక్ట్రిక్ హీటర్లు వాడడం వల్ల వాటి నుంచి వెలువడే వాయువులు పర్యావరణానికి హాని కలిగించవచ్చంటున్నారు. వాటికి బదులుగా పర్యావరణానికి అనుకూలంగా ఉండేవి ఎంచుకోవడం మంచిదంటున్నారు.
చివరగా.. ఎలక్ట్రిక్ హీటర్స్‌కి వేగంగా వాటర్‌ని హీట్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ వాటిని జాగ్రత్తగా ఉపయోగించడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. ప్రధానం తడి చేతులతో తాకకుండా, నీటిలో మునిగిపోకుండా సరైన రీతిలో వాడేలా భద్రతా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
మీరు వేడి నీటితో తలస్నానం చేస్తుంటారా? - ఏం జరుగుతుందో తెలుసా!
ఉప్పు నీటి స్నానంతో వెన్ను నొప్పి తగ్గుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?