Tips To Reduce Facial Fat : సాధారణంగానే లావుగా ఉన్నవారి ముఖం కూడా కొంత లావుగా కనిపిస్తుంది. దీనికి కారణం.. మిగతా శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయినట్లుగానే.. ముఖంపై కూడా ఫ్యాట్ పెరిగిపోవడమే. అయితే, కొంత మంది సన్నగా ఉన్నాకూడా వారి ముఖంపై ఫ్యాట్ పెరిగిపోతుంది. దీనివల్ల అందవిహీనంగా కనిపిస్తారు. అయితే, కొన్ని టిప్స్ పాటించడం ద్వారా చాలా ఈజీగా ముఖంపై పెరిగిన కొవ్వుని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ముఖ వ్యాయామాలు : ఫేస్ ఫ్యాట్‌తో బాధపడుతున్నవారు ముఖ వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే.. ముఖ కండరాలు బలంగా మారి ముఖంపైన ఉన్న కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజూ కొన్ని రకాల ఫేస్ వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు.
బరువు తగ్గాలి : అధిక బరువు ఉండడం వల్ల శరీరంలోని అన్ని భాగాల్లో కొవ్వు పెరిగిపోవడంతోపాటు, ముఖంపైన కూడా పేరుకుపోతుంది. కాబట్టి, బరువు తగ్గడానికి రోజూ చెమట వచ్చేలా నడక, పరుగు, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. 2014లో 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఏరోబిక్ వ్యాయామం (రన్నింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి) చేయడం వల్ల ముఖంలోని కొవ్వు తగ్గుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీ బుండాంగ్ హాస్పిటల్‌కు చెందిన 'డాక్టర్ Yoon J. H. (Ji Hyun Yoon)' పాల్గొన్నారు.
ఫేషియల్ మసాజ్ : మసాజ్ చేయడం వల్ల ముఖంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది చర్మానికి రక్తాన్ని అందించి, స్కిన్ ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, రెగ్యూలర్‌గా ఫేషియల్ మసాజ్ చేసుకోండి.
నీరు బాగా తాగండి : నీరు పుష్కలంగా తాగడం ద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అనవసరంగా తినడాన్ని తగ్గించుకోవచ్చు. ఇంకా శరీరానికి తగినంత వాటర్ తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల అందమైన ముఖం తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉప్పు తగ్గించాలి : కొంతమంది ఆహార పదార్థాల్లో ఉప్పు ఎక్కువగా వేస్తుంటారు. అయితే.. ఫేస్ ఫ్యాట్ సమస్యతో బాధపడే వారు ఫుడ్‌లో ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలి. అలాగే ఉప్పు అధికంగా ఉండే జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
కంటి నిండా నిద్రపోవాలి : ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగిన తర్వాత చాలా మంది రాత్రిపూట కంటినిండా నిద్రపోవడం లేదు. అర్ధరాత్రి వరకు ఫోన్ చూస్తూ ఉండిపోతున్నారు. అయితే, రాత్రి సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల కూడా ఫేస్ ఫ్యాట్ పెరిగే ప్రమాదం ఉంటుందట. కాబట్టి, దీనిని తగ్గించుకోవడానికి కనీసం రాత్రి 7-8 గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ టిప్స్ పాటించడం వల్ల కొన్ని రోజుల్లోనే ఫేస్ ఫ్యాట్ తగ్గిపోయి అందంగా మారుతుందని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
మీ బాణపొట్టకు కారణం తిండి కాదు- మీరు చేసే ఈ చిన్న తప్పులేనట! - షాకింగ్ రీసెర్చ్!