Eating Raw Garlic Side Effects Morning : వెల్లుల్లిలో సహజ సిద్ధంగానే యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి. అయితే.. వెల్లుల్లిని ఖాళీ కడుపుతో అతిగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయట. అవేంటో చూద్దాం.
గుండెలో మంట :
నిపుణులు అభిప్రాయం ప్రకారం.. 'హార్ట్‌బర్న్ గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్' (GERD)తో బాధపడేవారు రోజువారి ఆహారంలో వెల్లుల్లిని తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే.. వీరు వెల్లుల్లిని తీసుకోవడం వల్ల గుండెలో మంట, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో ఉండే ఆమ్ల గుణాలు యాసిడ్ రిఫ్లక్స్‌ను మరింత తీవ్రం చేస్తాయని అంటున్నారు.
కాలేయానికి ఇబ్బంది : వెల్లుల్లిని అతిగా తీసుకుంటే కాలేయానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందట. అంతేకాదు.. ఎప్పుడైనా శరీరానికి గాయాలైతే రక్తస్రావం ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందట. ఎందుకంటే.. వెల్లుల్లిలోని యాంటీథ్రాంబోటిక్ గుణాలు రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయని అంటున్నారు. ఒక అధ్యయనం ప్రకారం.. సర్జరీకి ముందు రోజూ 4 వెల్లుల్లి రెబ్బలు తిన్న వారిలో రక్తస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారట.
నోటి దుర్వాసన :
వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే.. ఎక్కువగా తినడం వల్ల ఇవి నోటి దుర్వాసనకు కారణమవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. 2013 లో "Journal of Breath Research" అనే జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజూ ఉదయాన్నే వెల్లుల్లి తిన్న వారిలో నోటి దుర్వాసన ఎక్కువగా వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో నెదర్లాండ్‌లో యూట్రెక్ట్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న డాక్టర్.ఎం.ఎ.ఎం.కుయిజ్‌పెర్ (Dr. M.A.M. Kuijper) పాల్గొన్నారు. డైలీ వెల్లుల్లి తిన్న వ్యక్తులలో నోటి దుర్వాసన ఎక్కువగా వచ్చినట్లు గుర్తించినట్టు చెప్పారు.
జీర్ణ సమస్యలు :
వెల్లుల్లిలో ఫ్రక్టాన్స్ అనే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి నేరుగా పెద్దపేగులోకి చేరడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటి వివిధ రకాల సమస్యలు వస్తాయి. అందుకే.. రోజుకు 2 వెల్లుల్లి రెబ్బలు తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రాగులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు- A టు Z రోగాలకు సంజీవని! - Health Benefits Of Ragi