Eating Excess Fruits Good Or Bad : రోజూ ఒక యాపిల్ పండు తినండి-డాక్టర్‌కు దూరంగా ఉండండి అనే సామెత గురించి అందరికీ తెలుసు. అంటే దీని అర్థం ప్రతిరోజు యాపిల్ తినడం వల్ల మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది, తద్వారా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదని. ఇదిలా ఉంటే చాలామంది ఈ మధ్యకాలంలో తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పండ్లను తినాల్సిన దానికంటే అధిక మొత్తంలో తింటున్నారు. అయితే ఇలా ఒకేసారి ఎక్కువ పరిమాణంలో రకరకాల పండ్లను ఇంటికి తెచ్చుకొని అతిగా లాగించేస్తుంటారు. ఈ ధోరణి ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
మరి ఎంత మోతాదులో పండ్లు తినాలి?
పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే, కానీ మోతాదుకు మించి తింటే ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు చూపుతాయని చెబుతున్నారు డాక్టర్లు. ప్రతిరోజు శరీరానికి కావాల్సిన పరిమాణంలో ఫ్రూట్స్ తింటే మీకే మంచిదని సూచిస్తున్నారు. అయితే రోజు ఒక వ్యక్తి వంద గ్రాముల పండ్లను, అది కూడా అన్ని రకాల పండ్లను తన డైట్లో భాగం చేసుకోవాలని న్యూట్రిషనిస్టులు అంటున్నారు.
అతిగా తింటే ఏమవుతుంది?
పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిల్లో మినరల్స్, విటమిన్స్ సహా మరెన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. ఇవ్వన్నీ శరీరానికి మంచివే అయినా మనం తినే దాదాపు అన్ని పండ్లలో చెక్కర, క్యాలరీల స్థాయులు అధికంగా ఉంటాయి. ఇవి మానవ శరీరానికి ఎప్పటికీ ప్రమాదకరమే. ప్రతికూల ప్రభావాలు చూపుతాయి కూడా. తద్వారా బరువు పెరుగుతారు. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో మీరు కొత్త అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ పద్ధతిని ఫాలో అవ్వండి
రోజుకు వంద గ్రాముల పండ్లను మాత్రమే తినాలి. ఈ క్వాంటిటీలో అన్ని రకాల పండ్లు ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా పీచు పదార్థం ఎక్కువగా ఉండే పండ్లు, తొక్కతో పాటే తినే పండ్లను మీ డైట్లో చేర్చుకోండి. దీంతో మీ శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది. ఇది మలబద్ధకం సమస్యనూ దూరం చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందుతాయి. అయితే పిల్లలు, గర్భిణీలతో పాటు తరచూ వ్యాయామం చేసేవారు పండ్లను క్రమం తప్పకుండా రోజూ తినవచ్చు.
ఇలా అస్సలు చేయకండి
పండ్లను నేరుగా తినడం అనేది అన్నింటి కన్నా మంచి మార్గమని చెబుతున్నారు వైద్యులు. ఇలా చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని అంటున్నారు. అయితే పండ్లను కట్ చేసి ఫ్రిజ్‌లో పెట్టుకొని తినడం లేదా జ్యూస్‌లు వగైరా లాంటివి చేసుకొని తాగడం ఏ మాత్రం సూచించదగ్గ విషయం కాదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఈ విధంగా పండ్లను తింటే అందులో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి లేదా పూర్తిగా మాయమైపోతాయని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు భోజనం తర్వాత పండ్లను మాత్రం అస్సలు తినకూడదని సూచిస్తున్నారు వైద్యులు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మిమ్నల్ని తరచుగా కడుపు నొప్పి బాధిస్తోందా? - ఈ టిప్స్‌తో అంతా సెట్!
పుదీనాతో కొలెస్ట్రాల్, ఎసిడిటీ సమస్యలు దూరం! మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు