Easy Ways to Remove Hair Dye Stains : అందంగా కనిపించడంలో మన జుట్టు కూడా కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, కొన్ని కారణాలు హెయిర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఆ కారణంగా ఆడ, మగ అనే తేడా లేకుండా చిన్న వయసులోనే జుట్టు(Hair) తెల్లబడటం చాలా మందికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ క్రమంలోనే వైట్ హెయిర్‌తో బాధపడేవారిలో మెజార్టీ పీపుల్ సౌందర్య పోషణలో భాగంగా.. హైయిర్ డైలు, జుట్టుకు రంగు వేసుకుంటుంటారు.
అయితే, హెయిర్ డైలు వేసుకునే క్రమంలో కొన్ని సందర్భాల్లో అవి చర్మానికి అంటుకుని అక్కడ మచ్చలుగా ఏర్పడతాయి. వీటిని తొలగించే క్రమంలో ఎంత రుద్దినా అవి ఓ పట్టాన వదలవు. దాంతో చూసే వారికి జుట్టుకు హెయిర్ డై వేసుకున్నట్లు తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా అవి అలాగే ఉండిపోతాయి. అలాంటి వారు ఇంట్లోనే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు ఫాలో అయ్యారంటే.. స్కిన్‌పై ఉన్న హెయిర్ డై మచ్చలను ఈజీగా తొలగించుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిమ్మకాయ : నిమ్మకాయలో ఉండే యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే హెయిర్ డై మచ్చలను తొలగించడంలో నిమ్మకాయ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ముందుగా నిమ్మకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై ఒక ముక్క తీసుకొని మచ్చ పడిన చోట నెమ్మదిగా రుద్దాలి. కాసేపు అలాగే ఉంచిన తర్వాత గోరువెచ్చని వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
వెనిగర్ : ఇది కూడా హెయిర్ డై మచ్చలు తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం వెనిగర్‌లో ముంచిన కాటన్ బాల్‌తో చర్మంపై మచ్చ పడిన చోట నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అక్కడి మృత చర్మం తొలగిపోయి మచ్చ పడిన ప్రదేశం తిరిగి కాంతివంతమవుతుందంటున్నారు నిపుణులు.
2016లో 'జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. హెయిర్ డై మచ్చల చికిత్సకు వెనిగర్ మిశ్రమాన్ని ఉపయోగించిన వ్యక్తులు డై మచ్చల తొలగింపులో గణనీయమైన తగ్గింపును చూశారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో లాహోర్‌లోని పంజాబ్ మెడికల్ కాలేజీకి చెందిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్. జీ. షాహిన్ పాల్గొన్నారు. వెనిగర్ హెయిర్ డై మచ్చలను తొలగించడంలో చాలా వరకు సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
తరచూ ఫేస్ వాష్ చేస్తున్నారా? వేసవిలో ఇలా అస్సలు చేయొద్దు!
డిటర్జెంట్ : దుస్తులపై పడిన మరకల్ని తొలగించడానికి మనం డిటర్జెంట్ యూజ్ చేస్తాం. అయితే చర్మంపై పడిన డై మచ్చల్ని కూడా సబ్బుతో పోగొట్టవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. కాస్త డిటర్జెంట్‌ని హెయిర్ డై మచ్చ పడిన చోట అప్లై చేసి చేతివేళ్లతో నెమ్మదిగా రుద్దాలి. ఆపై గోరువెచ్చటి నీటిలో ముంచిన కాటన్ క్లాత్‌తో ఆ ప్రదేశాన్ని సబ్బు పోయే దాకా శుభ్రం చేస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు.
బేబీ ఆయిల్ : బేబీ ఆయిల్‌తో పాటు కొన్ని ఎసెన్షియల్ నూనెలు కూడా డై మచ్చను తొలగించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. వీటిలో ఏదైనా కాస్త నూనెను తీసుకొని దాన్ని మచ్చపై అప్లై చేసి చేతి మునివేళ్లతో నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. కొంతసేపటి తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇకపోతే.. ప్రస్తుతం చర్మానికి అంటినా వెంటనే తొలగిపోయే హెయిర్ డైలు కూడా వస్తున్నాయి. కాబట్టి, సాధ్యమైనంతవరకు ఇలాంటి వాటిని ఎంచుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ ఫేస్ ప్యాక్‌ను ఎప్పుడైనా ట్రై చేశారా? - ముఖంపై మొటిమలు, మచ్చలు ఇట్టే మాయం!