ETV Bharat / health

పెంపుడు కుక్కలతోనూ జాగ్రత్త!- రేబిస్​ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే! - Dog Bite Treatment in Telugu - DOG BITE TREATMENT IN TELUGU

Dog Bite Treatment in Telugu : కుక్కలను పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. ఆ సరదానే ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. ఇంట్లో కుక్కయినా, వీధిలోని కుక్కయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. కరిస్తే రేబీస్‌ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. శునకాలు గాయపరిచినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రథమ చికిత్స ఎలా చేసుకోవాలో చూద్దాం.

Dog Bite Treatment in Telugu
Dog Bite Treatment in Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 8:27 AM IST

Dog Bite Treatment in Telugu : విశ్వాసానికి మారు పేరుగా చెప్పే కుక్కలు కొన్నిసార్లు కరిచే అవకాశం ఉంటుంది. అవి పెంచుకునే కుక్కలు అయినా లేదంటే వీధి కుక్కలు అయినా కరిస్తే ప్రమాదమే. కుక్కలు కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేయించుకోవాలని అంటూ ఉండటం మనం వింటూనే ఉంటాం. కుక్క కరిచినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్స ఏంటి? ఎలాంటి తప్పులు చెయ్యకూడదు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

వ్యాక్సిన్‌ వేయించడం ముఖ్యం
కుక్క కాట్లను వాటి స్వభావాన్ని బట్టి మూడు రకాలుగా విభజించారు. రక్తం రాకుండా గీరడం లేదా కొరకడం, రక్తం వచ్చేలా కొరకడం, తీవ్రస్థాయిలో గాయపర్చడం. ఇందులో మొదటి రకం కుక్క కాటు వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. అయినా కానీ జాగ్రత్త పాటించడం ఉత్తమం. సాధారణంగా ఇంట్లో పెంచుకునే కుక్కలు రక్తం రాకుండా గీరడం లేదంటే కొరకడం చేస్తుంటాయి. పుండు లేదా గాయం లేని చోట నాకినా ఎలాంటి ప్రమాదం ఉందడు. ఈ రకమైన కాట్ల వల్ల రేబిస్ వచ్చే అవకాశాలు అతి తక్కువ. ఒకవేళ ఇంట్లో పెంపుడు కుక్క ఉంటే మాత్రం దానికి టీకా వేయించడం ఉత్తమం. కొన్నిసార్లు పెంపుడు కుక్కలు గాయాలు, పుండ్లు ఉన్న చోట నాకుతుంటాయి. రక్తం వచ్చేలా కొరుకుతుంటాయి. ఈ సందర్భంలో రేబిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మెడ, ముఖం, తల, అరచేతులు, చేతివేళ్ల మీద కరిస్తే రేబిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటికి వెంటనే ప్రథమ చికిత్స, వైద్యం అవసరం.

కుక్క కరిస్తే ఇలా చేయాలి
కుక్క కరిచినపుడు ధారగా పడుతున్న నీటితో 15 నిమిషాల పాటు గాయాన్ని కడగాలి. దీని వల్ల కుక్క లాలాజలం శరీరంలోకి ప్రవేశించకుండా, రేబిస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. యాంటీసెప్టిక్‌ లోషన్‌తో శుభ్రం చేయాలి. ఆ తర్వాత వైద్యుల దగ్గరకు తీసుకెళ్లి వ్యాక్సిన్‌ వేయించాలి. కుక్క కరిస్తే చాలామంది గాయాన్ని చేతితో ముట్టుకుంటూ ఉంటారు. ఇలా ఎంతమాత్రం మంచిది కాదు. గాయాన్ని నేరుగా చేతులతో ముట్టుకోకుండా చేతులకు గ్లౌజ్​లు వేసుకొని ముట్టుకోవాలి. గాయం పెద్దగా అయితే కానీ కుట్లు వేయకూడదు. ఒకవేళ కుట్లు తప్పనిసరి అయినా వాటిని వదులుగా వెయ్యాలని గుర్తించుకోవాలి.

ఈ ఇంజెక్షన్లు అసలు మర్చిపోవద్దు
కరిచిన చోట మూసి ఉంచొద్దు. నీరు, రక్తం కారిపోయినా వదిలేయాలి. కుక్క కరిస్తే ముందుగా ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్ వేయించుకోవాలి. గాయం మానటానికి యాంటీ బయోటిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. యాంటీ రేబీస్ టీకాను అవసరాన్ని బట్టి మూడు లేదా ఐదు మోతాదుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వైద్యుల సలహా మేరకు కొన్ని ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎన్ని టెస్టులు చేసినా వ్యాధి ఏంటో తెలియట్లేదా? ఈ ఒక్క పరీక్షతో ఫుల్ క్లారిటీ! - Biopsy Test

గ్యాస్ ట్రబుల్​​తో ఇబ్బంది పడుతున్నారా? ఇవి పాటిస్తే ఈజీగా చెక్​ పెట్టొచ్చు! - Foods To Avoid Gas Trouble

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.