ETV Bharat / health

వాటర్ బాటిళ్ల మూతలు రకరకాల రంగుల్లో! - అవి నీటి క్వాలిటీకి గుర్తులా? - Water Bottle Caps Colour - WATER BOTTLE CAPS COLOUR

Water Bottle Caps Colour: మార్కెట్లో లభించే వాటర్​ బాటిళ్ల క్యాప్స్ రకరకాల రంగుల్లో ఉంటాయి. మరి.. ఈ రంగులు దేనికి సంకేతం అంటే.. అందులోని నీటి క్వాలిటీని ఈ రంగులు సూచిస్తాయని చాలా మంది భావిస్తారు. మరి, ఇది నిజమేనా? అసలు వాటర్​ బాటిల్​ క్యాప్స్​ వివిధ రంగుల్లో ఎందుకు ఉంటాయి? మీకు తెలుసా?

Water Bottle Caps Colour
Water Bottle Caps Colour (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 3:00 PM IST

Facts About Water Bottle Caps Colour: మనం ఆరోగ్యంగా ఉండటానికి రోజూ తగినంత నీరు తాగడం తప్పనిసరి. నీరు మనల్ని హైడ్రేట్‌గా ఉంచి, శరీరంలోని మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే చాలా మంది ఎక్కడికి వెళ్లినా తమ వెంట వాటర్​ బాటిల్​ తీసుకెళ్తుంటారు. మరికొద్దిమంది చేతిలో వాటర్​ బాటిల్ లేకపోతే దగ్గరలోని షాప్​కు వెళ్లి బాటిల్​ కొని తాగుతుంటారు.

వాటర్​ బాటిల్స్​లో కూడా ఎన్నో బ్రాండ్​లు ఉన్నాయి. అలాగే బాటిల్​ క్యాప్స్​ కూడా అనేక రంగుల్లో ఉంటాయి. అయితే.. చాలా మంది వాటర్​ బాటిల్​ క్యాప్స్​ కలర్​ను బట్టి నీటి క్వాలిటీ మారుతుంది అనుకుంటారు. మరి, ఇది నిజమేనా? అసలు వాటర్​ బాటిల్​ క్యాప్స్​ వివిధ రంగుల్లో ఎందుకు ఉంటాయి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం..

  • బ్లూ కలర్ క్యాప్ ఉంటే ఆ నీరు మినరల్ వాటర్( Mineral Water ) అని అర్ధం. అంటే ఆ నీరు ప్రకృతి జలాల నుంచి సేకరించి ఫ్యూరిఫై చేసి బాటిల్​లో ప్యాక్ చేస్తారని అర్థం. ఇది స్వచ్ఛతకు, శుద్ధతకు ప్రతీక అని అంటున్నారు. మిగిలిన వాటితో పోలిస్తే ఇందులో పోషకాలు ఎక్కువని నిపుణులు అంటున్నారు. 2023లో ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. నీలిరంగు క్యాప్‌తో ఉన్న నీటిలో సాధారణ నీటి కంటే 20% ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో జియాంగ్‌సీ యూనివర్సిటీ ఆఫ్ ట్రాడిషనల్ చైనీజ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ డాక్టర్ జియాంగ్ యున్ పాల్గొన్నారు.
  • గ్రీన్‌ కలర్ క్యాప్​తో కొన్ని కనిపిస్తాయి. ఆకుపచ్చ రంగు క్యాప్​ను బాటిల్​కు బిగించారంటే.. అందులో అదనపు ఫ్లేవర్స్‌ ఉన్నాయని అర్థం. అంటే పుదీనా, నిమ్మరసం ఫ్లేవర్స్​ యాడ్​ చేసినట్లు అని చెబుతున్నారు.
  • ఎరుపు రంగు క్యాప్‌తో ఉండే బాటిల్స్‌లో.. కార్బొనేటెడ్‌ వాటర్ ఉందని అర్థం.
  • అదే విధంగా ఎల్లో కలర్‌ క్యాప్‌తో ఉన్న వాటర్‌ బాటిల్‌లో విటమిన్లు, ఎలక్ట్రోలైట్స్‌ ఉన్నట్లు.
  • ఇక నలుపు రంగు క్యాప్(Black Cap Water Bottle) కలిగి ఉన్న వాటర్ బాటిల్ విషయానికొస్తే.. ఈ బాటిల్​లో ఆల్కలీన్‌తో కూడిన వాటర్ ఉందని అర్థం చేసుకోవాలి. ఈ బ్లాక్‌ కలర్‌ క్యాప్‌ ఉండే వాటర్‌ బాటిల్స్‌ చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ కలర్ క్యాప్స్​ని కేవలం ప్రీమియం వాటర్ ఉత్పత్తులకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇలాంటి నీటిని ఎక్కువగా సెలబ్రిటీలు తాగుతుంటారు.
  • పింక్ కలర్‌ క్యాప్‌తో ఉండే వాటర్‌ బాటిల్స్‌ విషయానికొస్తే.. ఇది వాటర్ గురించి చెప్పేది కాదని.. పలు స్వచ్ఛంద సంస్థలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలాంటి క్యాప్స్‌ను ఉపయోగిస్తాయి.

వాటర్​ బాటిల్​ క్యాప్స్​ కలర్​ను బట్టి నీటి క్వాలిటీ మారుతుందా: నిజానికి.. వాటర్ బాటిల్‌లోని నీటి క్వాలిటీ, ఆ క్యాప్ రంగుకి ఏమాత్రం సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. అవి ఫ్లేవర్​ ను మాత్రమే సూచిస్తాయని చెబుతున్నారు.

వాటర్ బాటిల్ క్యాప్స్ డిఫరెంట్ కలర్స్​లో - దీని అర్థం ఏంటో తెలుసా?

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా? - రీసెర్చ్​లో ఆసక్తికర విషయాలు! - How Much Water To Drink A Day

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.