Diabetes Symptoms At Night : మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో మధుమేహ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బాడీలో ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేనప్పుడు లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉయోగించలేనప్పుడు షుగర్ లెవల్స్ పెరిగి మధుమేహం(Diabetes) వస్తోంది. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు.. నైట్ టైమ్ కొన్నిలక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి, రాత్రిపూట కనిపించే ఆ లక్షణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అధిక మూత్రవిసర్జన : మీరు రాత్రిపూట సాధారణంగా కంటే ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేస్తున్నారా? - అయితే మీరు వెంటనే అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ లక్షణం మధుమేహానికి సంకేతం. మీ బాడీలో షుగర్ లెవల్స్ ఎక్కువైనప్పుడు అదనపు చక్కెర మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. అలాగే నిద్రకు భంగం ఏర్పడుతుంది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే మీ నైట్ టైమ్ తరచుగా మూత్రవిసర్జన చేస్తారని నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
ఎక్కువ దాహం : మీరు రాత్రిపూట ఎక్కువ వాటర్ తాగుతున్నారా? అయితే అనుమానాలించాల్సిందే. బ్లడ్‌లో షుగర్ లెవల్స్ ఎక్కువయినప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. బాడీలోని అదనపు చక్కెరను వదిలించుకోవడానికి తరచుగా మూత్రవిసర్జన చేయడం వల్ల శరీరం డీహైడ్రేట్ అయి ఎక్కువ దాహం అనిపించవచ్చు. కాబట్టి ఈ లక్షణం కనిపించినా ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు.
డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగొచ్చా?
శారీరక అలసట : మీలో రాత్రిపూట ఈ లక్షణం కనిపించినా సందేహించాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది కూడా మధుమేహాన్ని సూచించే సంకేతం. రక్తంలోని అధిక షుగర్ లెవల్స్ గ్లూకోజ్‌ను సమర్థవంతంగా యూజ్ చేయకుండా కణాలను అడ్డుకుంటాయి. ఫలితంగా బాడీకి తగిన శక్తి లభించదు. కాబట్టి తగినంత రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా మీరు అలసిపోయినట్లుగా ఉంటే బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరిగాయని అర్థం.
స్లీప్ అప్నియా : మీ బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరిగాయనే దానికి నైట్ టైమ్ కనిపించే మరో హెచ్చరిక సంకేతం స్లీప్ అప్నియా. ఈ పరిస్థితి ఎదురైనప్పుడు నిద్రలో బ్రీతింగ్ తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారవచ్చు. మధమేహ వ్యాధి ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ లక్షణం. కాబట్టి రాత్రిపూట మీకు ఇలాంటి సమస్య ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.
విపరీతమైన చెమట : సాధారణంగా మనం డే టైమ్‌లో ఎక్కువగా శ్రమించినప్పుడు చెమటలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే అలాకాకుండా రాత్రిపూట చెమటలు ఎక్కువగా పడుతుంటే అలర్ట్ కావాల్సిందే! ఎందుకంటే ఇది కూడా డయాబెటిస్ ముందస్తు హెచ్చరిక సంకేతం. బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌లో హెచ్చుతగ్గులు ఉంటే అది బాడీ టెంపరేచర్‌ను ప్రభావితం చేస్తుంది. దాంతో అధిక చెమటలు వస్తాయంటున్నారు నిపుణులు.
ఇవేకాకుండా రాత్రిపూట మీలో పాదాలలో చికాకుగా ఉన్నా సందేహించాల్సిందే. ఎందుకంటే అది కూడా డయాబెటిస్ హెచ్చరిక సంకేతమేనని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి రాత్రిపూట మీలో ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత వైద్యుడిని సంప్రదించి షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఆఫీస్‌లో షుగర్ నియంత్రణ ఎలా? ఉద్యోగులు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!