Healthy Food for Diabetics : ఆహార పదార్థాలలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మధుమేహ బాధితులు (షుగర్ వ్యాధిగ్రస్థులు) ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. కొన్ని ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా పెంచుతాయి. దాంతో ఆ ప్రభావం ఇతర అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
చక్కెర పానీయాలు
సోడాలు, పండ్ల రసాలు, టీ, కాఫీ వంటి చక్కెర పానీయాలకు మధుమేహ బాధితులు దూరంగా ఉండాలి. ఈ పానీయాల్లో సాధారణ చక్కెర అధికంగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచేందుకు ఉపకరిస్తాయి. పండ్ల రసాలు కూడా ఫైబర్ లేకపోవడం వల్ల రక్తప్రవాహంలోకి తొందరగా ప్రవేశించి అధిక చక్కెరకు కారణమవుతాయి.
శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు
బియ్యం రొట్టెలు, పాస్తా, తెల్లటి పిండితో తయారైన ఆహార పదార్థాలు చక్కెరతో సమానంగా పని చేస్తాయి. అవి త్వరగా గ్లూకోజ్‌గా మారి కలిసిపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. బ్రౌన్ రైస్, గోధుమలు, ఓట్ మీల్ వంటి తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఆయా పదార్థాలు బ్లడ్ షుగర్‌పై నెమ్మదిగా, తక్కువ ప్రభావాన్ని చూపుతాని పరిశోధనల్లో తేలింది.
ట్రాన్స్ ఫ్యాట్స్
ప్రాసెసింగ్ చేసిన ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ ఊబకాయానికి కారణమై ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ (LDL) పరిమితిని పెంచడంతో పాటు మంచి కొలెస్ట్రాల్ (HDL)ను తగ్గించే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి ఆహార పదార్థాలు గుండె జబ్బులకు దారి తీస్తాయి. మరీ ముఖ్యంగా మధుమేహంతో బాధ పడుతున్న వారు ఎక్కువగా గుండెపోటు బారిన పడడానికి ఇలాంటి ఆహారమే కారణం.
ప్యాక్ చేసిన స్నాక్స్, స్వీట్లు
బాగా నూనెలో వేయించి ప్యాకింగ్ చేసిన చిప్స్, క్రాకర్లు, కుకీల్లో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉంటుంది. ఈ పదార్థాల్లో శరీరానికి అవసరమైన ఫైబర్ లోపించడంతో పాటు రక్తంలో చక్కెరను వేగంగా పెంచడానికి ఉపయోగపడతాయి. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిల నియంత్రణ అదుపు తప్పుతుంది.
కృత్రిమ ఫ్లేవర్లు ప్రమాదకరం
పెరుగు ఆరోగ్యకరమైన ఎంపిక. కానీ, వివిధ రకాల పండ్ల రుచిని తలపించేలా తయారు చేసిన ఫ్లేవర్స్ ఆరోగ్యానికి తీవ్ర హానికరం. అలాంటి ఫ్లేవర్స్ అన్నీ చక్కెరతోనే తయారవుతాయి. ఇలాంటి యాడెడ్ షుగర్ మధుమేహం ఉన్నవారికి అత్యంత ప్రమాదకరం. ఇంట్లో, బయట లభించే తోడు పెట్టిన సాధారణ, తియ్యని పెరుగు చాలా మంచింది. దీంతో పాటు తాజా పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిందని నిపుణులు సూచిస్తున్నారు.
డ్రై ఫ్రూట్స్ లో చక్కెర అధికం..
మధుమేహ బాధితులు పండ్లు తీసుకోవడం మంచిది. చాలా మంది డ్రై ఫ్రూట్స్ మంచివనే అనుకుంటారు కానీ, అవన్నీ ప్రమాదకరమే అని డైటీషియన్స్ వెల్లడిస్తున్నారు. ఎండిన పండ్లలో కార్బోహైడ్రేట్లు, చక్కెర అధికంగా ఉంటుంది. ఒక చిన్న ఎండుద్రాక్షలో మిఠాయి బార్‌లో ఉన్నంత చక్కెర ఉంటుందని పరిశోధనలు తేల్చాయి. తాజా పండ్లు మంచి ఎంపిక, అవి ఎక్కువ నీరు, ఫైబర్ కలిగి ఉంటాయని, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
తిన్నది అరగడం లేదా? అయితే వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండాల్సిందే! - Digestion Problem In Monsoon