Crying Benefits For Health : మనిషి శారీరకంగా, మానసికంగా ఎదుర్కొనే బాధ, అసంతృప్తి, సంతోషం వంటి రకరకాల భావోద్వేగాల కారణంగా బయటకు వచ్చే ఎమోషన్ ఏడుపు. కానీ ఏడిస్తే ఎవ్వరికీ నచ్చదు. కంట నీరు పెడితే ఇంటికి మంచిది కాదు. ఒంటికి మంచిది కాదు అంటూ ఏవేవో చెప్పి ఏడుపును అదుపు చేయిస్తుంటారు. నిజానికి ఏడుపు కూడా ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
శరీరం, మనసుపై పడే ఒత్తిడిని తగ్గించడానికి, భావోద్వేగ సమతుల్యతను పెంపొందించడానికి ఏడుపు బాగా సహాయపడుతుంది. ఏడవటం వల్ల ఇబ్బంది, అసౌకర్యం వంటి అనుభూతుల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. కన్నీళ్లు కార్చడం ద్వారా సామాజిక బంధాలను బలోపేతం చేస్తుందని నిపుణులు అంటున్నారు.
ఓదార్పు
నిపుణులు, రీసెర్చర్లు కనుగొన్న దాని ప్రకారం ఏడుపు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది. ఏడవటం వల్ల చాలా మందికి ఓదార్పు కలుగుతుంది. తమ భావోద్వేగాలను కంటి నీరు ద్వారా బయటపెట్టడం వల్ల విశ్రాంతిగా ఫీలవుతారు.
నొప్పి నివారణ
కన్నీళ్ల వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇవి శారీరకంగా, మానసికంగా ఎదుర్కొనే సహజమైన నొప్పులను తగ్గిస్తాయి. మనసుపై భారం, ఒత్తిడి పెరిగి ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు ఏడుపు చక్కగా ఉపయెగపడుతుంది.
మానసిక స్థితి
ఏడ్చినప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్ అనే హర్మోన్ మనకు మంచి అనుభూతిని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే సుఖంగా, మానసికంగా మెరుగ్గా ఉండటానికి కూడా ఏడుపు సహాయపడుతుంది.
మంచి నిద్రకు
నిద్రపోవడానికి ప్రతిరోజూ ఏడవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఏడవటం వల్ల భావోద్వేగాల విడుదల జరుగుతుంది. ఫలితంగా ఆందోళన, ఒత్తిడి తగ్గి హాయిగా నిద్రపోగలుగుతారు.
దృష్టి మెరుగవుతుంది
ఏడుపు కళ్లకు సహజమైన లూబ్రికేటర్గా పనిచేస్తుంది. ఇది కళ్లు పొడిబారకుండా చేస్తుంది. కళ్లలోని కార్నియా ఎల్లప్పుడూ తేమగా, లూబ్రికేటింగ్గా ఉంచుతుంది. దుమ్ము, ధూళి, చికాకు వంటి వంటివి కన్నీళ్ల ద్వారా బయటకు పోతాయి. అంటువ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
శివువులకు
సాధారణంగా శిశువులు ఎక్కువగా ఏడుస్తూనే ఉంటారు. వైద్యుల ప్రకారం పిల్లలకు ఏడుపు ప్రయోజనకరంగా ఉంటుంది. వారి శ్వాసనాళాలను శుభ్రపరిచి, ఆక్సిజన్ తీసుకోవడానికి, ఊపిరి సజావుగా పీల్చుకోవడానికి సహాయపడుతుంది.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పడుకునే ముందు పాదాలు కడుక్కుంటున్నారా? లేకుంటే మీ బెడ్ అంతా క్రిములే! - Why Wash Feet Before Bed