ETV Bharat / health

జుట్టుతోపాటు చర్మానికి కూడా కొబ్బరినూనె రాస్తున్నారా? - దాని వల్ల ఏం జరుగుతుందో తెలుసా? - Is Coconut Oil Good For Skin or not

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 10:46 AM IST

Coconut Oil Health Benefits : ఈరోజుల్లో చాలా మంది చర్మ సంరక్షణ కోసం ఏవేవో ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. కొందరు కొబ్బరినూనెను మాయిశ్చరైజర్​లా వాడుతుంటారు. అలాగే కొన్ని హోమ్ రెమిడీస్​లో ఉపయోగిస్తుంటారు. మరి.. కొబ్బరినూనెను చర్మానికి అప్లై చేయడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Benefits of Coconut Oil Apply On Body
Coconut Oil Health Benefits (ETV Bharat)

Benefits of Coconut Oil Apply On Body : మనం సాధారణంగా అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం డైలీ తలకు కొబ్బరి నూనె రాసుకుంటాం. నిజానికి కొబ్బరినూనెలో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా తోడ్పడతాయి. అయితే.. చాలా మంది చర్మ సంరక్షణ కోసం శరీరానికి కొబ్బరి నూనె(Coconut Oil) అప్లై చేస్తుంటారు. మాయిశ్చరైజర్​లాగా యూజ్ చేస్తుంటారు. మీక్కూడా చర్మానికి కోకోనట్ ఆయిల్ రాసే అలవాటు ఉందా? అయితే, అలా రాయడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కొబ్బరి నూనెను కాప్రిక్, లారిక్ యాసిడ్ అని కూడా పిలుచుకుంటాం. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, కొబ్బరినూనెను ఉత్తమ సహజ చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఒకటిగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఫలితంగా కొబ్బరినూనెను చర్మానికి అప్లై చేయడం ద్వారా అనేక సానుకూల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు.

డార్క్ సర్కిల్స్​కు చెక్ : కొబ్బరినూనెలోని ఔషధ గుణాలు నల్లటి వలయాలు, నల్ల మచ్చలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయంటున్నారు నిపుణులు. అలాగే దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం వాపు, ముఖం ఎరుపును తగ్గించడంలో ఉపయోగపడతాయని చెబుతున్నారు. అంతేకాకుండా.. కోకోనట్ ఆయిల్ చర్మాన్ని టోన్ చేయడానికీ సహాయపడుతుందంటున్నారు.

వృద్ధాప్యాన్ని నివారిస్తుంది : కొబ్బరి నూనెను స్కిన్​కి అప్లై చేయడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుందట. ఇది చర్మం స్థితిస్థాపకతను మెరుగుపర్చడంతో పాటు వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో కూడా కొంతమేర సహాయపడతాయంటున్నారు.

2019లో "అమెరికన్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేటెడ్​గా ఉంచి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ నగరంలోని మౌంట్ సినాయ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ మైఖేల్ ఎస్. ఓలివెరా పాల్గొన్నారు. కొబ్బరినూనెలో ఉండే యాంటీ-మైక్రోబయల్ గుణాలు త్వరగా వృద్ధాప్య సంకేతాలు రాకుండా నివారించడంలో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.

అలర్జీల నుంచి రక్షణ : కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు డెడ్ సెల్స్​ను తొలగించి తామర వంటి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, కాలుష్య కారకాల నుంచి మంచి రక్షణ కలిగిస్తాయంటున్నారు నిపుణులు.

జుట్టు ఎక్కువగా రాలుతోందా? కొబ్బరి నూనె, కరివేపాకుతో సమస్యకు చెక్​- అదెలాగంటే?

గాయాలను తగ్గిస్తుంది : కోకోనట్ ఆయిల్​లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గాయాలపై బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. అలాగే గాయం చుట్టూ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇది గాయాలు త్వరగా మానడానికి తోడ్పడుతుందంటున్నారు నిపుణులు.

మంచి మాయిశ్చరైజర్​ : కొబ్బరి నూనె ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్​లా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇది చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. డ్రై, రఫ్ స్కిన్ కోసం ఇది ఒక మంచి హోం రెమిడీ అని సూచిస్తున్నారు. స్కిన్ పొడిబారినట్టుగా, గరుకుగా ఉన్నవారు నైట్ నిద్రించే ముందు కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. తరచుగా ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు.

అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. కొబ్బరినూనెలో మంచి మాయిశ్చరైజింగ్ లక్షణాలు చాలా మందికి ప్రయోజనం కలిగించినప్పటికీ కొందరిలో ప్రతికూల ప్రభావం చూపవచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి ఎవరైనా కొబ్బరినూనెను చర్మానికి యూజ్ చేసే ముందు పాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత వాడడం బెటర్ అంటున్నారు. అలాగే.. కొబ్బరినూనె అలర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

డైలీ చిన్న ఎండు కొబ్బరి ముక్క తినండి - క్యాన్సర్, గుండె జబ్బులే కాదు ఈ సమస్యలూ మీ దరిచేరవు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.