ETV Bharat / health

చియా సీడ్స్ Vs అవిసె గింజలు - వీటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి? నిపుణులు ఏం అంటున్నారు?

Chia Seeds Vs Flax Seeds : ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. దీంతో చాలా మంది తమ డైలీ డైట్​లో నట్స్, ఫ్రూట్స్​తో పాటు సీడ్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మందికి అవిసె గింజలు మంచివా? చియా విత్తనాలు మంచివా? అనే డౌట్​ వస్తుంది. మరి దీనిపై నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు చూద్దాం.

seeds
Chia Seeds Vs Flax Seeds
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 11:19 AM IST

Chia Seeds Vs Flax Seeds Benefits : కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది తీసుకునే ఆహారం విషయంలో కాస్త ఎక్కువగానే శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు తమ డైలీ డైట్​లో పండ్లు, జ్యూస్​లు ఉండేలా చూసుకుంటున్నారు. వీటితో పాటు కొందరు చియా, అవిసె గింజలు(Flax Seeds) వంటి సీడ్స్​నూ తీసుకుంటున్నాపు. నిపుణులు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం రోజువారీ ఆహారంలో సీడ్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. అయితే ఈ క్రమంలోనే చాలా మందికి ఈ రెండింటిలో వేటిని తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అనే సందేహం వస్తుంది. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో చూద్దాం.

చియా విత్తనాలు : సాల్వియా హిస్పానికా మొక్క నుంచి లభించే చియా విత్తనాలు పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ అధిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

అవిసె గింజలు : లినమ్ యుసిటాటిస్సిమమ్ ప్లాంట్ నుంచి అవిసె గింజలను సేకరిస్తారు. ఈ గింజలలో ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే అవిసె గింజల్లో లిగ్నాన్లు 75 నుంచి 800 రెట్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన ఈ లిగ్నాన్లు గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. అలాగే అవిసె గింజలు ప్రొటీన్, అవసరమైన విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం.

ఆరోగ్య ప్రయోజనాలు : చియా విత్తనాలు, అవిసె గింజలు రెండూ మొత్తం శ్రేయస్సుకు తోడ్పడే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే సాధారణ పేగు కదలికలకు సహాయం చేయడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది. అదనంగా, రెండు విత్తనాలలో కనిపించే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మంటను, రక్తపోటును తగ్గించడం, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇంకా.. చియా, ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. బాడీలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షిస్తాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి.

అయితే చియా విత్తనాలు సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటాయి. ఇవి గ్లూటెన్ సెన్సిటివిటీ లేదా ఉదర కుహర వ్యాధి ఉన్న వ్యక్తులకు తగిన ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. వీటిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్, మాంసకృత్తుల వల్ల ఇవి తింటే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది బరువు నిర్వహణలో చాలా బాగా సహాయపడుతుంది. అంతిమంగా, ఈ రెండింటిలో వేటి ద్వారా ఆరోగ్యానికి ఎక్కువ లాభం అనేది ఎంపిక, వ్యక్తిగత ప్రాధాన్యత, ఆహార అవసరాలు, వంటల ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆ కూరగాయలను వండకుండా తింటున్నారా? ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే!

న్యూట్రిషన్ వ్యాల్యూ ఎండ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్(2017)లో జరిపిన అధ్యయనం ప్రకారం.. అవిసె గింజల్లో ఉండే ఫైబర్, లిగ్నాన్స్, ఒమేగా-3లు, ఇతర పోషకాలు గుండె ఆరోగ్యం, క్యాన్సర్ ప్రమాద తగ్గింపు, మెరుగైన జీర్ణక్రియ కోసం చాలా బాగా సహాయపడతాయని వెల్లడైంది. అలాగే న్యూట్రిషన్ వ్యాల్యూ ఎండ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ చియా సీడ్(2017)లో జరిపిన అధ్యయనం ప్రకారం.. ఇందులో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, బరువు తగ్గడానికి సహాయపడతాయని కనుగొంది.

ఇన్నీ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తున్న ఈ రెండింటినీ మీ రోజువారి డైట్​లో స్మూతీస్, పెరుగు, ఓట్​మీల్, సలాడ్​లు లేదా మీకు ఇష్టమైన ఇతర ఆహారాలలో యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. అవిసె గింజలలో ఉండే ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ ఇవి తీసుకున్నప్పుడు తగినంత నీరు తాగాలి. లేదంటే కొన్ని జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

seeds for beauty and health : ఆ అయిదు రకాల గింజలతో.. అందం.. ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.